
వేప చెట్ల డైబ్యాక్ తెగులు జీవవైవిద్యం పై ప్రభావం చూపుతుందా?
వేప చెట్ల సంఖ్య తగ్గే ప్రమాదం వ్యవసాయంకు వాడే వేప పిండి ధరలు రెట్టింపు
వృక్ష సంపదలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలు ఈ చెట్టును బహుళ ప్రయోజనకారిగా పరిగణిస్తారు. ఔషధ గుణాలు, మంచి నీడను ఇచ్చే వృక్షంగా వేప చెట్టును ఇంటి ఆవరణలో పెంచటానికి ప్రజలు మక్కువ చూపుతారు. వేప చెట్లు డైబ్యాక్ తెగులు బారిన పడటం తెలంగాణాలో ఆందోళనకర స్థాయిలో ఉంది. చలి కాలంలో ఎక్కడ చుసినా వేప చెట్లు ఎండి పోయినట్లు కనిపిస్తున్నా యి.
డైబ్యాక్ తెగులు తెలంగాణాలో గత నాలుగు సంవత్సరాలనుంచి మాత్రమే కనిపిస్తుంది. హైదరాబాద్‌లోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FCRI) వేప డైబ్యాక్ విస్తరించడానికి కారణం, దీర్ఘ కాలికంగా చెట్లపై ప్రభావం, నివారణ చర్యలపై పరిశోధనను చేపట్టింది. మైక్రోక్లైమేట్ నియంత్రణ మరియు జీవవైవిధ్య మద్దతులో వేప చెట్లు కీలక పాత్ర పోషిస్తున్న వేప చెట్లు తెగులు బారిన పడటాన్ని తీవ్ర విషయంగా పరిగమించాల్సిన అవసరం ఉంది.
వేప డైబ్యాక్ అంటే ఏమిటి?
FCRI డీన్ మరియు అటవీ వి కృష్ణ ప్రకారం వర్షాకాలం తర్వాత పై కొమ్మలు ఎండిపోవడం వేప డైబ్యాక్ లక్షణం. ఈ ఇన్ఫెక్షన్ పై కొమ్మల వద్ద ప్రారంభమై క్రమంగా క్రిందికి వ్యాపిస్తుంది.
ఫోమోప్సిస్ అజాడిరాచ్టే అనే ఫంగస్ మూలంగా వేప చెట్లు డైబ్యాక్ వ్యాధికి గురి అవుతున్నవి. ఈ వ్యాధి విస్తరణ విస్తరణ వేగం చాల ఎక్కువ. అందుకే తెలంగాణ లోని ప్రతి వేపచెట్టు మోడువారినట్లు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వేప చెట్లను ఎండబెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. మార్చి నాటికి చాలా వేప చెట్లు సహజంగా కోలుకోవడం ప్రారంభిస్తాయి.గతంలో ఉత్తర భారతదేశం కె పరిమితం ఐన ఈ వ్యాధి క్రమంగా తెలంగాకు కూడా వ్యాపించింది.
వేప చెట్లు సాధారణంగా శీతాకాలం తర్వాత కోలుకున్నప్పటికీ తాత్కాలిక నష్టం తీవ్రమైన పర్యావరణ పరిణామాలను కలిగి ఉంటుంది. కొమ్మలు ఎండిపోవడం వల్ల విత్తన ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. దీని వల్ల రాష్ట్రంలో వేప చెట్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
మానవులపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుందా?
డైబ్యాక్ తెగులు బారిన పడిన వేప చెట్ల ప్రభావం ప్రత్యక్షంగా మనుషులపై ఉండే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. కానీ వ్యాధి బారిన పడిన చెట్ల కొమ్మలను పళ్ళు తోముకోవటానికి మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉపయోగించరాదని వారు హెచ్చరిస్తున్నారు.
మోడువారిన చెట్లు ఇంటి ఆవరణలో ఉండటం అపశకునంగా ప్రజలు భావించటం జరుగుతుంది. దీనితో వారు మోడువారిన చెట్లను తొలగించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కూలీల ఆదాయం పై ప్రభావం
జూన్ నెలలో వేప కాయలను ఏరుకోవటం ద్వారా కూలీలు ఆదాయం పొందేవారు. వ్యాపారులు వీరినుంచి కిలో వేప కాయలకు 20 రూపాయలు ఇట్చి కొనుగోలు చేసేవారు. దీని ద్వారా అధిక శ్రమ చేయలేని కూలీలు ఎంతో కొంత ఆదాయం పొందే అవకాశం లభించేది. వేప చెట్లు డైబ్యాక్ తెగులు బారిన పడ్డాక వేపకాయల ఉత్పత్తి ఘననీయంగా తగ్గింది. ఇది వారి ఆదాయంపై కుడా ప్రభావం చూపింది.
వ్యవసాయ రంగంపై ప్రభావం
వేప నూనె, వేప గింజల పౌడరును వ్యవసాయంలో రైతులు ఉపయోగిస్తారు. వేప కాయల కొరత తరువాత వేప పొడి ధర కిలోకు ౩౦ రూపాయల నుంచి 50 రూపాయలకు పెరిగింది. ఇది రైతులపై ఆర్ధిక భారం మోపుతోంది. మార్కెట్లో వేప పొడి కొరత ఏర్పడటంతో దానిని ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు దిగుమతి చేసుకుంటున్నారు.
శ్రీ సేద్య సేవ సమితి అధ్యక్షులు రూపని రమేష్ ది ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడుతూ వేప పొంది పంట వేర్లకు వ్యాపించే వ్యాధులను అరికట్టడంలో ఉపయోగపడుతుంది. పంట నాణ్యత, దిగుబడి కూడా వేప నూనె, వేప పౌడర్ ఉపయోగ పడుతుంది. రసాయనిక ఎరువులకు కొంత వరకు వేప నూనె, వేప పౌడర్ ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ లో వేప నూనె, వేప పౌడర్ చాలా ముఖ్యమైనది అని అయన చెప్పారు.

