ఆ రోజు తెలంగాణ తల్లి రూపకల్పన ఎలా జరిగిందంటే...
x

ఆ రోజు తెలంగాణ తల్లి రూపకల్పన ఎలా జరిగిందంటే...

తెలంగాణ తల్లి రూపకల్పన ఏ ఒక్క వ్యక్తి ఊహా కల్పన కాదు. 8 నెలలు విశాల సాహిత్య అకాడమీ కార్యాలయంలో అనేక చర్చలులతో సమిష్టి సూచనలతో రూపొందించబడింది.



తెలంగాణ తల్లి, తెలంగాణ లోగో రాజ ముద్ర గురించి చర్చ నడుస్తూ ఉంది. ఇపుడుకనిపిస్తున్న తెలంగాణ తల్లి రూపకల్పన ఏ ఒక్క వ్యక్తి ఊహా కల్పన కాదు. ఎనిమిది నెలలు విశాల సాహిత్య అకాడమీ కార్యాలయంలో అనేక చర్చలు సాగి అనేక రూపాలు తీసుకున్న సమిష్టి సూచనలతో రూపొందించబడింది.

నంది నిర్మల, గొల్లి శ్రీనివాస్, చారి, దుర్గం రవీందర్, ఏలె లక్ష్మణ్, కాపు రాజయ్య, ఎక్కా యాదగిరి రావు, గంగాధర్, కెసిఆర్, ఆలె నరేంద్ర, మొదలైన మరెందరో కలిసి అనేక విధాలుగా చర్చించిన తరువాత గంగాధర్ తుది రూపం ఇచ్చారు. ఈ కార్యక్రమం నా అధ్వర్యంలోనే జరిగింది.


కిరీటం ఉన్న తెలంగాణ తల్లి తుది రూపం.


ఇటీవల చరిత్రకారుడు డా. ద్యావనపెల్లి సత్యనారాయణ తెలంగాణ తల్లి ఎలా ఉండాలనేదాని మీద ఒక నూతన ప్రతిపాదన చేసాడు. అది వ్యాసకర్త కు తోచిన వ్యక్తిగత ప్రతిపాదన. ఆయన తన వ్యాసంలో రెండు విషయాలను కలగలిపారు. 1. రాజ చిహ్నాలు, నాణేలపై బొమ్మలను చూడవచ్చు. మన ప్రాంతంలో పంది బొమ్మ, సింహం బొమ్మ కనపడుతాయి. డి రాజిరెడ్డి నాణేల చరిత్ర చక్కగ రాసారు.

2. తెలంగాణ తల్లి రూప కల్పన వేరు. ఇది కొత్త భావన. రాజ చిహ్నాలతో కలిపి చర్చించి వ్యాసకర్త గందరగోళం చేశారు. రాజ చిహ్నం, తెలంగాణ తల్లి రెండు వేరు వేరు ప్రత్యేక విషయాలు.

నేను తెలంగాణ తల్లిని రూపొందించాను. ఎనిమిది నెలల నిరంతర చర్చలతో ఒక రూపం ఇచ్చాను. మూడు నెలలు పలువురు ఆర్టిస్టులు సాహితీవేత్తలు జర్నలిస్టులు ఈ సమిష్టి కృషిలో చర్చల్లో పాల్గొన్నారు. కొండపల్లి శేషగిరి రావు పేరు తలిచారు. అది అజంతా శిల్ప ప్రతిమ. తెలంగాణ తల్లి విషయంలో రూపకర్త పేరు ప్రస్తావించకుండా ప్రభుత్వం అని రాసారు. చాలా తప్పు. తెలంగాణ తల్లి రూపకల్పన 2007 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే పూర్తయింది. ఉద్య ఆకాంక్షల రగిలిస్తూ ఊరూరా వెలసింది తెలంగాణ తల్లి . తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా రూపొందించామో 2007 లోనే నేను వివరించాను.


బతుకమ్మ కంకులతో మలి రూపం లో తెలంగాణ తల్లి


తెలంగాతల్లి ధరించింది గద్వాల చీర. నగలు తెలంగాణ నగలు. ఒడ్డాణంలో కొహినూర్ వజ్రం, కిరీటంలో జాకబ్ వజ్రం. కరీం నగర్ వెండి కడాలు, మట్టెలు, బతుకమ్మ, మన నీళ్లు మనకు రాక వరికి బదులు మెట్టపంట మక్కంకి … ఇలా ప్రతిదీ పది జిల్లాల చిహ్నాలతో రూపొందించాను. దాన్ని ఫైనల్ గా గంగాధర్ ఆర్టిస్టు ప్రింటు చిత్రం గా వేసాడు. తెలంగాణ తల్లి భరత మాత ముద్దుబిడ్డ. భరత మాత రాజమాత. తెలంగాణ తల్లి రాజమాత. అందుకని శివకాశి క్యాలండర్లలో పలు కిరీటాలు పరిశీలించి ఒక మంచి కిరీటం పెట్టాను. ఇంకా అనేకం చెప్పాల్సినవి ఉన్నాయి. మొదట పల్లె తల్లిగా రూపొందించాను. ప్రజాతంత్ర వారపత్రిక పత్రికల్లో ముఖచిత్రంగా ప్రచురించాము. రాజ మాతగా వుండాలనడంతో ప్రస్తుత రూపం ఫైనల్ చేసాము..

త్రివర్ణం పతాకం రూపొందడంలో ఎంత చరిత్ర పరిణామం వుందో తెలంగాణ తల్లి రూపకల్పన వెనక అంతకన్నా ఎక్కువ పరిణామం బహు ముఖీన తాత్విక సాంస్కృతిక చారిత్రక నేపథ్యం వుంది.

బతుకమ్మ కంకులతో మలి రూపం

కంకులు మాత్రమే తెలంగాణ తల్లి తొలి రూపం


2. తెలంగాణ ప్రభుత్వ లోగో రాజముద్ర ఏలె లక్ష్మణ్ రూపొందించాడు. ఆ చర్చ కు తెలంగాణ తల్లి చర్చతో సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాజముద్ర రూపొందింది.

3. ⁠తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా స్పూర్తి నిచ్చే దిగా తెలంగాణ తల్లి నిలిచింది. అందెశ్రీ పాట ఉద్యమ స్రూర్తి గీతం. తెలంగాణ తల్లి ఉద్యమ స్పూర్తి రూపం. ఆ వ్యాసం విశ్లేషణ అశాస్త్రీయం. అధ్యయన రాహిత్యం. తప్పుతోవ పట్టించేదిగా వుంది. అశాస్త్రీయంగా నాలుగు చేతుల భావన ఏమిటి? అన్నం కుండ, గరిటె ఏమిటి? ఇంకా నయం వేప మండలు నాలిక ముందుకు చాపిన కాళిక వలె ఓ చేత నరికిన తలతో బోనం ఎత్తిన మహిళలా తెలంగాణ తల్లి వుండాలని సూచించలేదు. చరిత్రకారుడు చరిత్రను అధ్యయనం చేయడం కనీస కర్తవ్యం. అందరం బతికే వున్నాము సంప్రదించవచ్చుగద! కనీసం గ్రూపు పరీక్షల పుస్తకాలలోని విషయాలైనా చూడాలిగద! వ్యాసకర్త తన పొరపాటును సరిదిద్దుకోవాలి.


Read More
Next Story