ఆశ్రిత కులాల జీవన్మరణ వేదన
x

ఆశ్రిత కులాల జీవన్మరణ వేదన

ఆశ్రిత కులాలు అంటే ఏమిటి? ఉనికి కోసం అవి పడుతున్న వెతలేమిటి? డాక్టర్ పాండు కామ్టేకర్ రిపోర్టు


-పాండు కమ్టేకర్


“దళిత బాహుజన కళారూపాలు రాజ్యాంగా విలువగా అందె గౌరవం”(Subaltern Art Forms And Dignity As A Constitutional Value) అనే అంశంపై యక్షి పేలోషిప్ లో భాగంగా ‘చావడి’ డా బి ఆర్ అంబేద్కర్ విశ్వ విద్యాలయం, ‘యక్షి’ సంయుక్తంగా “ చావడి” పేర జులై 14, 2025, ఉదయం 10.30 టో సా 6. 00 వరకు ఇక చర్చ గోష్టి జరిగినది.

తరతరాలుగా ప్రధాన కులాలకు వారి వారి కుల పురాణాలు, పుట్టు పూర్వోత్తరరాలను, వారి వారి దేవుళ్ళను, దేవతలను, వారి మూల పురుషులను కథల రూపములోనూ, పాటల రూపములోనూ చెప్పే వారిని ఉప కులాలు లేదా ఆశ్రిత కులాలుగాను పిలుస్తున్నారు. వీరిలో మందెచ్చు, బీర్ల, ఒగ్గులు యాదవ,కురుమ కులనికి, జెట్టి గౌడ, గౌడ కులానికి, కాకి పడగల తెలుగు లేదా ముదిరాజు కులముకు ,అడ్డపు వారు మంగలి కులానికి, డక్కలి వారు మాదిగ కులానికి ఇలా దుబ్బులు, దొలి, కలికో, బయిండ్ల ఇలా ఎన్నో తదితర కులాల ఆశ్రిత కులాల, ఉపకులాల వారు ఉన్నారు.

వీరు చెప్పే కథలలో సాంస్కృతిక, సాంప్రదాయక, నైతిక విలువలతో కూడిన విషయాలు మేళవిస్తూ, మత సంబంధ , కుల దేవతల గురించి ప్రత్యేకంగా తయారుచేసిన సంగీత పరికరాలు ఉపయోగించి లయ బద్దంగా చెప్పుతారు.మధ్య మధ్యన హాస్యం పండిస్తూ ఉల్లాసాన్ని, సందర్బనుసారంగా నవ రసాలను పండిస్తూ అభినయం చేస్తూ ప్రదర్శిస్తారు.

ఇవన్నీ కూడా మౌఖికంగా ఆశువుగా చెప్పుతారు. కొందరు ఈ కథలను ముందే తాయారు చేసిన బొమ్మలతోను కొందరు, ఒక వెడెల్పాటి బట్టపై రంగు రంగుల బొమ్మలను కుట్టి లేదా అంటించి వాటి ద్వారా కథలను చెప్పుతారు. ఈ బొమ్మలు గల బట్టను పటాలు అంటారు.ఈ ఆశ్రిత కులాల వారు ఒక నిర్ది ష్ట ప్రధాన కులానికి లేదా కులాలకు ‘కుల పురాణాలు’ చెప్పుతారు.

ఇంకా కొందరు గ్రామం మొత్తం ఉమ్మిడిగా చేసే పండుగలలో ముఖ్య పాత్ర పోషిస్తారు. మరి కొందరు వేషాలు వేసుకుని పాట పాడుతూ ఈ కథలు చెప్పుతారు. ఇందులో పాత్రకు అనుగుణంగా నవ రసాలను వ్యక్త పరిచే భంగిమలతో, శైలులతో కథనం సాగుతుంది. వీరి తామే కంపోజ్ చేసుకున్న గానము, తామ ప్రత్యేకంగా తయారు చేసుకున్న వాయుద్య పరికరాలు ఉంటాయి. వీటి తయారీ వీరికి మాత్రమే తెలుసు. ఇలాంటి కొన్ని పరికరాలు కాల గర్భములో కలిసి పోతున్నవి. ఇప్పటికే కొన్ని కనుమరుగు అయ్యాయి. వాటిని తయారు చేసే వాళ్లు, వాయించే వారు కూడా లేకుండాపోతున్నారు. వారి కళలు, వారి సంగీత స్వర ప్రక్రియలు అంతరించి పోయే దశకు చేరుకున్నాయనే బాధాకరమయిన వాస్తవం.

వీరు సమాజంలో ఆర్థికంగాను, రాజకీయంగా, ఎంత వెనుక బడి ఉన్నారో కార్యక్రమంలో తమ పరిచయ కార్య క్రమంలో గోడు చెప్పుకున్నారు. తమ కులం పేరు చెప్పాలని, తాము ఏమి పని చేస్తారని చిన్న చూపుతో తమను ప్రశ్నలను వేసే పరిస్థితి ఉందని , ఉబికి వస్తున్న దుఃఖాన్ని చాల బలవంతముగా ఆపుకుని , ఉద్వేగముతో ఒక మహిళా చెప్పినప్పుడు అక్కడ సమావేశములో కూర్చున్న అందరి ముఖాల్లోనూ, చూపుల్లోనూ తీవ్ర బాధ కలిగి మనసు కరిగించింది. కదిలించింది కూడా.

ఇంకొకరు తమ పరిచయంలో మాట్లాడుతూ “ఇప్పుడు తమ కులాలకు, కళలకు, వృత్తులకు ఆదరణ కరువు అవుతున్నదని, తరతరాలుగా కుల పురాణాలను, మా గానాలతోనూ, ఆటలతోనూ, మా సంగీత పరికారాలతోనూ చెబుతూ వచ్చిన సజీవ కుల చరిత్ర కారులమైన తమ ఉనికి మాయమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మా బతుకులను బాగు చేసి కనీసం మాకు పింఛన్ లాంటివి ఇచ్చి ఆదరించండి పెద్దలు,” అని కడు హీనంగా అడిగిన తీరు చాలా దయనీయం.



ఒక 80 సంవత్సరాలు పై బడిన వృద్దుడు తన వాయి ద్యపరికరం ‘12 మెట్ల కిన్నెర’ను తనతో పాటు తీసుకుని వచ్చి , తన కళ , తన వాయిద్య పరికరమే తన ప్రాణం, అస్తిత్వం అన్నట్టు చెప్పారు. తన తో పాటు చిన్న మనవడిని కూడా తీసుకు వచ్చి లయ బద్దంగా తన కిన్నెర వాయిస్తూ పాట పాడి, అందరినీ రంజీప జేసినాడు.

చివరగా “మాకు ప్రభుత్వ పరంగా అందాల్సిన ఫలాలు అందటం లేదు, మా కులములో చదువుకున్నా వాళ్ళు గాని , ఉద్యోగం చేస్తున్న వాళ్ళు గాని ఇప్పటి వరకు లేరు. మా బతుకులు బాగు చేసే ప్రయత్నం చేయండి” అంటూ రెండు చేతులెత్తి వేడుకున్న కున్న తీరు కూడా అందరినని కలిచి వేసింది.

ఇంకొక యువకుడు మాట్లాడుతూ “ మా కులం ప్రభుత్వం ఇచ్చిన జీవో లిస్ట్ లో లేకపోవడమేమిటో అర్థంకాలేదని అన్నాడు. అంటే తాము ఉనికిలో లేమని, అంతరించి పోయిన కులమని ప్రభుత్వం భావిస్తున్నదా అని ఆశ్చర్యపోయాడు. జాబితాలో నుంచి మాయమైయింది కనుక ‘మీకు కులం దృవీకరణ సర్టిఫికటే ఇవ్వడం సాద్యం కాదు,’ అని అధికారులు తప్పి పంపితే, ‘చదువుకు దూరం అయ్యాను. నా లాగా ఎందరో మా వారు చదువు సంద్యలకు చాలా దూరం అవుతున్నారు,’అని ఆవేదన వ్యక్త పరిచాడు.

ఇంకోకరు మాట్లాడుతూ “ కొత్తగా వచ్చిన జి ఓ మా దగ్గర లేదు. మా వద్ద ఉన్న జి ఓ ప్రకారం మీకులం లిస్టులో లేదు. అందువల్ల అది ఇక్కడ కాదు అంటూ ఒకరు తహశీల్దారు ఆఫీసుకు అని ఒకరు చెబితే, ఇంకొకరు ఆర్డీవో అంటూ, ఇంకొకరు వీఆర్వో అంటూ అక్కడ ఇక్కడ తిప్పించుకుంటున్నారు. తిరిగి తిరిగి విసిగి పోయి , చివరకు మా పిల్లలు చదువుకు దూరం అయ్యారు,” అని వాపోయాడు.



ఇంకొకరు మాట్లాడుతూ “ మా వూరి వారే శాసన సబ్యులు ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు. , వారికి కలిసి ఎన్నో సార్లు మా గోడు వినిపించాము, వారు సరే చూద్దాము చేద్దాం అంటారు.కాని చేసింది ఏమి లేదు.మా ఓటు బ్యాంక్ తక్కువగా ఉన్నందుకు కావచ్చును మా సమస్యల పై దృష్టి సారించ లేక పోతున్నారు,” అని తమ బాధను ఉక్రోషాన్ని వెల్ల గక్కినాడు.

ఇంకొకరు మాట్లాడుతు “ రంగ స్థలంపై ఎంత పెద్ద సీన్ అయిననూ ఒకే ట్టే క్ తో, ఒకే షాట్ తో వేదికపై పాత్రను , కథను రసవత్తరంగా నవ రసాలు పోషించి మెప్పించే నైపుణ్యం గల కళాకారులం మేము," అని గర్వంగా చెప్పాడు. "అందరు మా కళను చూసి, బేష్, అంటూ మెచ్చుకుంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు . కాని మా కళ నశించి పోకుండా కాపాడి, మా జీవన ప్రమాణాలు పెంచుటకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, “ అంటూ తమ గోడు వినిపించాడు.

ఇంకొకరు కల్పించుకుని “ మేము ఇంతకు ముందు మమ్ముల్ని ఎన్నెన్నో కార్య క్రమాలకు పిలిచి , మా చేత ప్రదర్శన చేయించారు., ఎక్కడెక్కడో మేము ప్రదర్శనలు చేశాము, జాతీయ, అంతర్జాతీయ స్తాయి కార్య క్రమాలలో కూడా మేము ప్రదర్శన చేశాము. ఎన్నో విశ్వ విద్యాలయ కార్య క్రమాలలో కూడా పాల్గొన్నప్పుడు అందరినీ కలిసి మా కళను , మా బతుకులను బాగుపరిచే దారుల గురిచి ఆలోచించమని చెప్పి చెప్పి విసుగు చెంది, నిరాశ నిస్పృహలకు లోనయ్యాము, అయినప్పటికీ కనిపించిన ప్రతివారికి, తారస పడ్డ ప్రతి ఒక్కరికి తమ గోడు వినిపిస్తున్నాము”అని వివరించిన తీరు మా అందరిర మనస్సుల ను కలిచి వేసింది.

కొందరు వక్తలు మాట్లాడుతూ “ మీరు ఆశ్రిత కులాలు కారు. మీరు తర తరాల కుల చరిత్రను సంస్కృతిని మౌఖికంగా ఒక తరం నుండి ఇంకొక తారనికి అందిస్తూ చరిత్ర, సంస్కృతి, అధ్యాత్మక, కుల పురాణములను సజీవంగా వుంచే సజీవ చరిత్ర కారులు, మీరే కళను సజీవంగా నిలుపు కోవాలి," అని చెప్పిన హితవులు, పలువురి మంచి మాటలు ఆ కాలే కడుపులకు, మండే గుండెలకు స్వస్థత చేకూర్చలేక పోయాయి.

వీరికి రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ విధానంలో గుండు గుత్త వ్యవహారంగా కాకుండా వీరిని అత్యంత వెనుక బడిన జాతులుగా గుర్తించాలి. వీరు ఒక షెడ్యూల్ కులాలోనే కాదు, షెడ్యూల్ తెగలలోనూ , వెనుకబడిన తరగతుల వారి కులాలలోను అన్ని ఆగ్రా వర్ణ, అల్ప వర్ణ అనే తేడా లేకుండా అన్ని సబ్బండ జాతులలో కూడా ఈ ఆశ్రిత లేదా ఉప కులాల వారు ఉన్నారా? ఉంటే వారి , వాటి కళల పరిస్థితి ఎలా ఉంది అనే వాటిపై ఇంకా లోతైన పరిశోధనలు జరుగ వలసి వుంది .

ఎక్కడ ఉన్నా దాదాపు అందరి పరిస్థితి ఇంతే దయనీయమైనది. ST లలో గల అత్యంత వెనకబడిన ఆదిమ గిరిజన తెగలను (PVTG) గుర్తించినట్టు వీరిని కూడా అత్యంత వెనుకబడిన దలిత బాహుజనజాతులుగా (Subaltern tribes) గుర్తించి, పత్యేక కార్యాచరణతో కూడిన భిన్నమైనా పథకాల కిందకు తీసుకు రావాలి. విద్య, ఉద్యోగ నియమాకాల్లోను, ఇతర అభివృద్ది పథకాలలో వీరికి తగిన ప్రధాన్యత ఇచ్చే ఆలోచకూ చేయాలి.

అంతే కాదు. కవులు రచయితలు, తమ రచనలలో వీరి శ్రామిక జీవన సౌందర్యాన్ని , సమాజములో వీరి పాత్ర గొప్ప ధనాన్ని ప్రతిబింబించే పా త్రలకు( Characters), కథలకు ప్రదాన్యత ఇవ్వాలి. అటువంటి రచనలను మరియు రచయితలను కూడా ప్రోత్స హించాలి . వీరి సాంస్కృతిక అంశాలను, ఆచార్య వ్యవహారాలను అందలి సమాజక, నైతిక , ఆర్థిక, ఆద్యాత్మికల గొప్ప ధనాన్ని తమ రచనలలో చూపి వారి ఆత్మ న్యూనత తగ్గించాలి.

వీరి జీవితను, కులమును, వేషమును, బాషను, యాస , తదితరాలను కించ పరిచే , వివక్షలతో అవమానపచే పాత్రలలో కాకుండా గౌరవ ప్రదమైన పాత్రలలో( Protagonist ) , వీరి పాత్రలను , జీవన శైలిలిని కేంద్రీకృతం చేసే రచనలు, సినిమాలు, కథనాలు రూపొందించి భిన్నమైనా సువిశాలమైన సంస్కృతిని సజీవంగా ఉంచె విదంగా ప్రయత్నం చేయాలి.

కాని ఇలాంటి సమావేశాలు లేదా సెమినార్ లాంటి వాటిలో శాసన నిర్మాణ కర్తలు, విధాన నిర్ణయాదాయిక వర్గం( Policy makers ) , ఉన్నత అదికారులు , ప్రభుత్వాన్ని స్పందింపజేసె పెద్దలు కూడా వస్తుంటారు, కాని మొట్ట మొదట వచ్చి జ్యోతిని వెలిగించి, మొక్కుబడిగా ఉపన్యాసం చేసి హడా విడిగా వెళ్ళి పోతారు. అందు చేత వీరి బాధలు , మానశిక వేదనను అర్థం చేసుకోలేక పోతున్నారు. ఇంకా కొందరు వారి వారి రాజకీయ, వర్గ, సామాజిక భావ చాపల్యమునకు అతుక్కు పోయిన వాళ్ళకు కూడా వీరి సమస్యలు సమస్యలుగా కనిపించక పోవచ్చు. పైవారిని కూర్చుండ బెట్టి వీరి బాధలు వినిపించాలి. కాని ఇది అంతా తేలికైన విషయం కాదు.



అట్టడుగు జాతులు( Subaltern) అనే మాటను మొట్ట మొదట (Antonio Gramsci )ఇటాలియన్ మేధావి ఉపయోగించాడు.గాయిత్రి చక్రవర్తి స్పీవాక్ లాంటి వారు కూడా ఈ రంగంలో కృషి చేసినారు. ఈ మాటకు అర్థం ఏమిటి అంటే “సమాజములో లెక్కలోకి తీసుకోలేని జనం , సమాజం నుండి దూరంగా నెట్టి వేయబడ్డ వారు, సామాజిక వివక్షకు , సమంజికంగా అణిచి వేతకు, నిర్లక్షానికి గురియైనవారు. సమాజం, పాలక వర్గం, ప్రభుత్వాలు విష్మ రించించిన జనాలు”గా చెప్పుకోవచ్చు.

E. H. Carr అనే చరిత్రకారుడు తన గ్రంధం (What is History) లో “అట్టడుగు స్తాయి నుండి చరిత్ర (History from Below)” అని అంటాడు. చరిత్ర అంటే రాజులు, రాజ బోగాలు, యుద్దాలు, పతనాలు అందలి సంఘటనలు వర్ణనలు కావు. అట్టడుగు ప్రజల చరిత్రే అసలైన చరిత్ర అనే బావం అతనిది. అంతే కాదు అందలి కళా రూపాలు , కళాకారుల పాత్ర, వారికి తర తరాలుగా సజీవంగా వచ్చిన మౌఖిక సాహిత్య , సంగీత , నాట్య విదానాల పపరంపర , సాంస్కృతిక , జీవన విదానాలు, కస్ట నష్టాలు, వాళ్ళు ఎదుర్కొని తమ మనుగదను నిలుపుకున్న సంక్షోబాలు మొదలగు ఇత్యాదులు కూడా చరిత్రలో బాగం కావాలి. వీరి గరించి గల చరిత్ర వీరే రాయడం అనే విదానం లేదా పద్దతి వలసవాద తదనంతరం ( Post-Colonization) రావడం జరిగినది

సరళీకరణ, ప్రైవే టీకరణ , గ్లోబలైజేన్ మరియు వైజ్ఞానిక మరియు సాంకేతిక రంగాలలో వచ్చే అభవృద్ది వల్ల ప్రపంచం అతి వేగంగా మార్పు చెందుతున్న ఈ తరుణములో వీరి, వీరి కళా రూపాల మనుగడ క్లిష్ట పరిస్థితిలో కొట్టు మిట్టాడుతుంది.

ఒకరి కళా రూపాన్ని , ఒకరి కళను వేరే ఇతరులు ఎవరో వచ్చి రక్షించరు, కాపాడరు. ఎవరి కళను వారే రక్షించుకోవాలి. వారి కళా రూపాల నేపద్యమును, కథలను కూడా గ్రంధస్థం చేసి బావి తరాలకు అందించే బాద్యత కూడా ఆయా కళా కారులలో గల విద్యావంతులు , మేదావులు పూనుకోవాలి. ఏ ప్రబుత్వం, ఏ విశ్వ విద్యాలయము కూడా ఆ పనికి పూనుకొనే పరిస్థితి కనిపించడం లేదు. ఒక వేళ పూను కుంటే చాలా సంతోషం. కాని అందు వల్ల వచ్చే సాహిత్యములో నాణ్యతా ( Quality), పరిమాణం ( Quantity), నమ్మిక (Reliability), కచ్చితత్వం (Adequacy) స్తాయిలు ఆశించి నంతగా ఉండక పోవచ్చును. ఇలాంటి కళా రూపాలను, కథలను గ్రంధస్థం చేయడం అంటే ఒక మహా సాంస్కృతిక క సాహిత్య ప్రపంచమును సృష్టించడమే!

అరిపోవడానికి సిద్దముగా ఉన్న తెలుగు సాహిత్య సంపదను వెలికి తీసి, వాఖ్యానాలు రాయించి, పండితుల చేత పరిష్కరించి , శుద్ద ప్రతులు తయారు చేసి, ఎన్నో తాళ పాత్ర గ్రంధాలను ముద్రణకు కృషి చేసి, అపారమైన తెలుగు సాహిత్య సంపదను మనకు అందించిన గొప్ప మహానీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ . ఆ మహానీయుని కృషిని, అతడు పోషించిన పాత్రను , అతడు అనుసరించిన విధానమును అధర్శంగా తీసుకుని అట్టడుగు దళిత బహు జనుల( subaltern ) కళా రూపాయలను , కథలను, సాంస్కృతిక సంపదను కనీసం గ్రంధ స్థం చేయడానికి పునుకోవాలి.



వీటితో పాటు ఆయా సంగీత వాయిద్య పరికరాలను, పటాలను మొదలగు తదితర వస్తువులు మరుగున పడి పోకుండా తయారు విధానం కూడా పరిశోదిన చేసి వాటిని కూడా గ్రంధ రూపములో బద్ర పరిచి బావి తరాలకు అందించాలి. ఆయా సంగీత స్వరాలు , వాయించే ( Play) నైపుణ్యం కల వారిని తయారు చేసే శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఆయా కళాకారులను తయారు చేసి కళను సజీవంగా కాపాడాలి.

దానితో పాటు ఆయా కళాకారులకు విద్య , ఉద్యోగం, ఉపాది, కూడు , గూడు గుడ్డ లాంటివి సమకూరే విదంగా సమాజం, మేదావులు,శాసన కర్తలు తమ వంతు బాద్యతగా ఆలోచించి, రాజ్యాంగం పరంగా గౌరవంగా(Dignity )జీవన ప్రమాణాలు పెంచే విదంగా ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను.

“దళిత బహుజన కళారూపాలు అనే అనే అంశం” పై సదస్సు నిర్వహించి , నన్ను మరియు అందరినీ ఆలోచింప చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు.

( *పాండు కమ్టేకర్ , క్లినికల్ సైకాలజిస్ట్, వరంగల్ , తెలగాణ)


Read More
Next Story