
‘కగార్ కల్లోలం’ మధ్య మేధోమథనంలో ‘పూర్వ పూర్వ విప్లవ విద్యార్థులు’
'భారతవిప్లవోద్యమం- సమకాలీన సందర్భం' సదస్సు విశేషాలు
డిసెంబర్, 7 2025 ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పూర్వ విప్లవ విద్యార్థి వేదిక (తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్) నిర్వహించిన సదస్సు విశేషాలు
అంచనాకు 400మంది మించి సభికులతో, ఉపన్యాసాలతో సభ జరిగింది. సదస్సులో పూర్వ విప్లవ విద్యార్థులు ప్రచురించిన (వ్యాససంకలనం) 'భారత విప్లవ పంథా - సమకాలీన సందర్భం' పుస్తకాన్ని రేణుక (మిడ్కో) తల్లిదండ్రులు,బాలకృష్ణ తల్లి ఆవిష్కరించారు. వేదిక కన్వీనర్ సభకు ఎం.సాంబమూర్తి అధ్యక్షత వహించారు . సెషన్ కు యాకయ్య, జయ అధ్యక్షత వహిస్తే రాజశేఖర్,వేణుగోపాల్ మాట్లాడారు.
ఆసదస్సు విశేషాలను అందించడానికి ప్రయత్నిస్తాను.
వాస్తవానికి గత 20 ఏళ్లలో సల్వాజుడుం దగ్గరనుంచి ఎన్నో తీవ్రమైన దాడులను ఎదుర్కొంటూ భౌగోళికంగానేగాక సామాజికంగా రాజకీయంగా కూడా దేశవ్యాప్తంగా విప్లవోద్యమం విస్తరించింది.కార్పోరేట్ వర్గాల ప్రయోజనాల కోసం గతప్రభుత్వాలు చేపట్టిన అణిచివేతవల్ల,ఇప్పటి బిజెపి ప్రభుత్వం నడుపుతున్న అంతిమయుద్ధం వల్ల కుదింపుకు లోనయింది. తీవ్రంగా నష్టపోతున్నది.ఈ యుద్ధకాలంలో విప్లవోద్యమం ముందున్న సవాళ్ళను,అభిమానులు వాస్తవదృష్టితో పరిశీలించాలి.ఆచరణలోకి ఎట్లా వచ్చిందో మాట్లాడుకోవాలి.సంక్షోభంలో చిక్కుకుపోయిన విప్లవోద్యమాన్ని కాపాడుకోవడానికి సిద్ధం కావాలి అంటూ..... పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ఇచ్చిన పిలుపుకు జవాబుగా,
వేదిక నిండుగా పెద్దబ్యానర్ తో,ఆదివాసి చిత్రాలతో,హాలంతా అర్థవంతమైన కొటేషన్లతో,బ్యానర్లతో, ప్లేకార్డ్స్ తో, అమరవీరులకు జోహార్లు చెబుతూ, ఏక్ హి రస్తా,ఏక్ హీ రస్తా నక్సల్భరీ ఏక్ హీ రస్తా నినాదాలతో, ఒకరికొకరు పలకరింపులతో,హగ్ లతో ఓ విప్లవ పండుగ వాతావరణం కనిపించింది. సభ ప్రారంభం కాగానే అమరవీరులకు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు.
సభను ప్రారంభిస్తూ అజిత్ (రచయిత,విప్లవోద్యమ మేధావి, కేరళ)దీర్ఘకాలిక ప్రజాయుద్ధపంథా ఈ దేశానికి సూట్ అవ్వదని,దేశంలో పరిస్థితులు మారిపోయాయని,అర్ధవలస,అర్ధభూస్వామ్య వ్యవస్థ పోయి పెట్టుబడిదారీ సమాజం వచ్చిందని చెప్పడం సరికాదు.కొద్ది మార్పులతో అర్థవలస అర్థభూస్వామ్య పరిస్థితులే కొనసాగుతున్నాయని అజిత్ అన్నారు. ఉద్యమం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.ఎదుర్కోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి. మల్లోజుల,వాసుదేవలు పాలకులకు లొంగిపోయి ఆయుధాలు అప్పగించడం, సిద్ధాంతం సరైనది కాదు అనటం చాలా దుర్మార్గమైనచర్య.
లొంగిపోయేవాళ్ళు ఆయుధాలతో కాకుండా వ్యక్తులుగా లొంగిపోయి ఉంటే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు.పార్టీ కేంద్రకమిటీ బాధ్యులుగా ఉంటూ ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటపంథా ఆచరణీయం కాదని ప్రచారం చేస్తూ,మిగిలినవారిని కూడా మా లాగా లొంగిపోండని ఫోన్ నెంబర్లు ఇచ్చి పత్రికలు,మీడియా ద్వారా ప్రకటనలు ఇస్తూ ఎన్నికల మార్గాన్ని అనుసరిoచడం సమర్థనీయమని ప్రచారం చేస్తున్నారు.ఇవన్నీ ప్రభుత్వం, మల్లోజుల ద్వారా మాట్లాడించింది తప్పితే నిజమైన సైధాంతిక విభేదాలు కావన్నారు.ఈమధ్యనే 'ఇండియన్ ఎక్స్ప్రెస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆదివాసులు చేస్తున్న "గనుల విస్తరణ వ్యతిరేక పోరాటం గురించి" ఏం సందేశం ఇస్తారని కోరగా పాలకులకు ఖనిజాలు అవసరం కదా అని,'గనుల విస్తరణను శాంతియుతంగానైనా అడ్డుకుంటాము అనకపోవడం'(తను అర్ధశతాబ్దం ఆదివాసులతో కలిసి చేసిన పోరాటాన్ని మరచి,ఆ పోరాటానికే 6 కోట్లు తీసుకుని-- ఇవి నామాటలు)పాలకులకు వత్తాసు పలకడం మరీ హీనమైన చర్య అన్నారు.
మల్లోజుల,సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళే పరిస్థితులు లేవు అంటున్నాడు అంటే ప్రభుత్వానికి వత్తాసు పలకడమే.నక్సల్భరీ, తెలంగాణపోరాటంలో అనేకమంది చనిపోయిన తర్వాత,చంపేసిన తర్వాత పోరాటం ఆగిపోయిందన్నారు.ఆనాటి పరిస్థితులకన్నా నేటి పరిస్థితులు, ప్రజాపునాదులు గట్టిగా ఉన్నాయని అజిత్ అన్నారు.తెలంగాణ సాయుధ పోరాట కాలంలో సాయుధ పోరాటాన్ని విరమించిన తరువాత ఏ గతిపట్టిందో చూసాం.ప్రస్తుత పరిస్థితిలోనూ కొంతమంది దీర్ఘకాలిక ప్రజాపంథా పునాది నుంచి, ప్రజలనుంచి దూరంకాలేదు,వారి గురించే,వారిమధ్యలోనే ఉండి మాట్లాడుతున్నారు అన్నారు.చారిత్రక కర్తవ్యానికి దోహదం చేసేటట్లు విప్లవం గురించి మాట్లాడాలంటే ముందు దాన్ని అర్థం చేసుకోవాలి అన్నారు.
మల్లోజుల,తక్కెళ్ళపల్లి వాసుదేవరావులు, పౌరహక్కుల సంఘాల పట్ల తీవ్రంగా స్పందిస్తూ మమ్మల్ని విమర్శించే హక్కు మీకెక్కడిదని,హద్దు మీరి మాట్లాడుతున్నారని,మేం చనిపోతే మాశవాలపై ఎర్రజెండాలు(ఎర్రజెండాలు ఇప్పుడు కప్పరని కూడా మర్చిపోయి--నా మాట)కప్పి ఊరేగించి కీర్తి పొందాలనుకుంటున్నారా?అనటం---అసలు సరైంది కాదన్నారు.
చరిత్ర గమనాన్ని పరిశీలిస్తే అర్థవలస,అర్ధభూస్వామ్య వ్యవస్థలే నేటికీ ఉన్నందున ఎప్పటికైనా దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా ద్వారానే మావోయిస్టులు నూతన ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించగలరని ప్రగాఢంగా నమ్ముతున్నాను.శ్రామిక ప్రజలు,మేధావులు,కవులు,కళాకారులు,ప్రజా సంఘాలవారు ఇతోదికంగా సహాయ సహకారాలు అందించడం ద్వారా ఉద్యమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాసంఘాలన్నిటికీ విజ్ఞప్తి చేస్తున్నాను అన్నాడు. అజిత్ ఉపన్యాసాన్ని నార్ల రవి తెలుగు చేశారు.
వేణుగోపాల్ మాట్లాడుతూ,విప్లవం నుంచి చాలామంది ఆరోగ్యం బాగాలేకా, శక్తిలేక,చేయలేక లొంగిపోయినవాళ్లు అనేకమంది ఉన్నారు.కాని ఏఒక్కరు కూడా ఇవాల్టి ప్రతిఘాతక శక్తులు చేస్తున్నట్లుగా,చెబుతున్నట్లుగా అబద్ధపు వ్యాఖ్యానాలు,విశ్లేషణలు,మాటలు చెప్పలేదు.చర్చను తప్పుదారి పట్టించలేదు.చివరి మెట్టుగా అసలు పంథానే తప్పని,అందుకే విజయాలను సాధించలేక పోతున్నామని అంటున్నారు.శాంతియుత పద్ధతులలో చేస్తామంటున్నారు.1992లోనే ప్రజాసంఘాలపై,పార్టీపై ప్రభుత్వమే స్వయంగా నిషేధం వధిoచి,శాంతియుత పద్ధతుల్లో చేయనీయకుండా చేసింది.అయినా శాంతియుత పద్ధతులను వాడుకోనిది ఎక్కడ?నిన్నకాక మొన్న అంబికాపూర్ లో శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఆదివాసీలపై భాస్పవాయువు ప్రయోగించారు.ఎక్కడా శాంతియుత పద్దతులు వాడుకోవడానికి అవకాశం లేదు.
ఈ శాంతియుత అనేది ఇప్పుడే కాదు 1956లో సోవియట్ పార్టీ నికితా కృచేవ్ వ్ ఇదే మాటలన్నాడు.వర్గాల పోరాటం అక్కర్లేదు,ఇంక ప్రపంచమంతా శాంతియుత పోరాటాలే ఉంటాయన్నాడు.ఈ మాటలన్న కృచేవ్ ఇప్పుడు ఎక్కడున్నాడు.ఈమాటలే ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్,తక్కెళ్ళపల్లి వాసుదేవరావులు అంటున్నారు.
ఈ క్రమంలో ఎంత తేలికపాటి మాటలు అంటున్నారంటే ఇన్నాళ్లు ప్రజలనుంచి దూరమయ్యాం.ఇప్పుడు ప్రజల్లోకి వస్తాం.ప్రజల్లో శాంతియుత పోరాటాలు చేస్తాం అంటున్నారు.అంటే ఆదివాసులు ప్రజలు కారు,వారిది జీవనము కాదు.పాలకవర్గo,మధ్యతరగతి ప్రజలు నమ్ముతున్నట్లుగా ఇవాళ, నిన్నటి వరకు విప్లవకారులమని చెప్పుకుంటున్నవాళ్లు కూడా ఆదివాసులు ప్రజలుకారు,వారిది జనజీవనంకాదు,మనుషులు కాదన్నట్లు మాట్లాడుతున్నారు.ఇదొక పెద్ద అబద్ద ప్రచారం.
కొన్ని వందల వేల అధ్యయనాలుచూడండి.భారతదేశంలో పెట్టుబడి దారి వ్యవస్థ ప్రవేశించినప్పుడు,గొప్ప ప్రగతిశీలమైన ఆలోచనలపై ఇక్కడికి రాలేదు.స్వతంత్ర పోరాటం తరువాత,చివరికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉన్న రాహుల్ గాంధీ బూటకపు ఎన్నికలు అంటే,పరకాల ప్రభాకర్ ఎలక్షన్లను బాయ్ కట్ చేయమన్నాడు.ఇటువంటి సందర్భoలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ఎప్పటికీ భారతదేశంలో సాధ్యం కాదు.
100 ఎకరాలు ఉంటే భూస్వామ్యం 50 ఎకరాలు ఉంటే అర్ధ భూస్వమ్యం అని కాదు.అంకెలు మాత్రమే వ్యవస్థ అనుకుంటున్నారా? అర్థవలస, భూస్వామ్యం,అర్థ భూస్వామ్యం అంటే ఏమిటి? సమాజంలో ఒక దశ నుండి మరొక దశకు మారుతున్న క్రమంలో కొత్త కొత్త ఉత్పత్తి సాధనాలు కనిపెడతారు.కొత్త ఉత్పత్తి సంబంధాలు ఏర్పడతాయి.ఉత్పత్తిసాధనాలపై యాజమాన్యంలేదా పెత్తనం ఎవరి (కార్మికుల కర్షకుల లేదాపెట్టుబడిదారుల, భూస్వాముల) అధీనంలో ఏర్పడుతుందో దానినిబట్టే అశేషప్రజల అనుకూలవ్యవస్థ ?కాదా? నిర్ణయించబడుతుంది.
ఇప్పటివరకు మానవ సమాజం హింసాయుతంగానే ఒకదశ నుంచి మరో దశకు(బానిస సమాజంనుండి గొప్ప స్వేచ్ఛాయుతమైన పెట్టుబడిదారి సమాజం వరకు)పోరాటాల ద్వారానే జరిగింది.గొప్ప స్వేచా కాంక్షతో ఏర్పడిన పెట్టుబడిదారి సమాజం నుంచి ద్రవ్య పెట్టుబడిదారి విధానం ఈ దేశంలోకి 'బోన్ సాయి మొక్కల్లా' యూరోపియన్ దేశాల నుండి ప్రవేశించింది.
లెనిన్ సూచనప్రాయంగా చేసిన దానిని మావో కార్మిక వర్గ నాయకత్వంలో సాధించారు. రైతాంగం ఏ వ్యవస్థలోకి చేరుతుంది. భూస్వామ్య వ్యవస్థ,పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలు, స్వభావం,ఏమున్నాయి? ఏమి లేవు? అని వివరంగా మాట్లాడారు. భారతదేశంలో ప్రస్తుత0 నడుస్తున్న వ్యవస్థ అర్థవలస,అర్థభూస్వామ్య వ్యవస్థే అని నిరూపించాడు.పెట్టుబడుదారివ్యవస్థ కుల,మత, స్త్రీ పురుష తారతమ్యాలు చూడకుండా కేవలం శ్రమ దోపిడీ,లాభార్జన మీదనే నడుస్తుంది.అందుకు విరుద్ధంగా మనదేశంలో కుల మత స్త్రీ పురుష వ్యత్యాసం తరతరాలుగా శ్రమలోభాగమై ఈనాటికీ కొనసాగుతుoదన్నాడు. కనుక దీనిని దీర్ఘకాలిక సాయుధ ప్రజాయుద్ధపంథా పోరాటంచేయడం సరైనదనన్నాడు.
నక్సల్బరి నుండి ఇప్పటిదాకా ఒకరు కాడి కింద పడేస్తే మరొకరు అందుకుంటున్నారు.అది ప్రజల అవసరం అని ముగించారు.
అజిత్, రాజశేఖర్, వేణుగోపాల్ ల ప్రసంగాల్లోని ముఖ్యాంశాలను తీసుకుంటే
1 దీర్ఘకాలిక విప్లవ ప్రజాయుద్ధపంథా---ప్రస్తుత కాలానికి సరిపోదు,కారణం దేశంలో ఉత్పత్తి శక్తులు-ఉత్పత్తి సంబంధాలు మారిపోయాయి అని వారు చేస్తున్న వాదన సరైంది కాదు.
2 ఈ దేశంలో భూస్వామ్య వ్యవస్థను కూల్చి దానికంటే అభివృద్ధికరమైన పెట్టుబడిదారీపార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థఏర్పడలేదు.
3 అయితే, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానిక,జాతీయ భూస్వామ్య,జాతీయ పెట్టుబడిదారి వ్యవస్థతో రాజీ చేసుకోవటంతో ఒక ఊడిగం చేసే,మిలాకత్ అయ్యే దళారీ వ్యవస్థ ఏర్పడింది.
4అందుకే పూర్తిస్థాయి పెట్టుబడిదారి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడకపోవడంతో ఆ కర్తవ్యం కూడా"నూతన ప్రజాస్వామిక వ్యవస్థను, కార్మిక కర్షక నాయకత్వంలో ఏర్పరచాల్సిన బాధ్యతకూడా" విప్లవ పార్టీ మీద పడింది.
ఈ దేశం--ఈ75 ఏళ్లలో కొన్నిరకాల సామాజిక,పెట్టుబడిదారి లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ,ప్రధానంగా కులం మతం రూపాల్లో ఉండే భూస్వామ్య లక్షణాలతో ఇంకా ఉంది కాబట్టి దీన్ని అర్థవలస అర్ధభూస్వామ్య వ్యవస్థ అంటున్నాo.కనుక కార్మికవర్గ పోరాటాలతో,యూరప్ దేశాల్లో జరిగిన విప్లవాల నమూనాల్లో కాకుండా "దీర్ఘకాలిక సాయుధ ప్రజాపోరాట మార్గంద్వారా కార్మిక రైతాంగ న్యాయకత్వంలో మాత్రమే నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం అవుతుంది.
మూడవ సెషన్ కు అయూబ్,విజయరామరాజు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.విజయరామరాజు మాట్లాడుతూ కగార్ అనేది దేశ ప్రజలపై దాడి చేస్తూ సమాజంలో ఒక ఐడియాలజీని ప్రేరేపిస్తూన్నారు.మనువాదానికి మావో వాదానికి మధ్య విధ్వంసాన్ని సృష్టిస్తూ,లొంగిపోతారా లేదా చచ్చిపోతారా అంటున్నారంటే దాన్ని అర్థం చేసుకోవాలి.కగార్ అనేదానికి మనసుండదు. దయ,జాలి,కరుణ,మానవత్వం,మానవీయకోణం ఉండవు.కేవలం మనిషిని భౌతికంగా నిర్మూలించడమే కగార్ అన్నారు. సశేషం.
Next Story

