శుక్రవారం కవిత ‘కలసి ఉంటే కలదు సుఖం’
x

శుక్రవారం కవిత ‘కలసి ఉంటే కలదు సుఖం’

ఐక్యత,సహకారం గురించి చక్కని మాటల్లో చెప్పిన చిక్కటి కవిత. నేటి కవి ఆకురాతి శంకర్రావ్





కలసి ఉంటే కలదు సుఖం


-ధ్యాన రత్న ఆకురాతి శంకరరావు

నువ్వు వెనక్కి తిరిగి చూడాలన్నా
రెండు కళ్ళు ఒకటై చూడాలి.
అడుగు ముందుకు వేయాలన్నా
పాదానికి పాదం తోడవ్వాలి.
చేతి వేర్లన్నీ కలిపితేనే మెతుకులు ముద్దయ్యేది
పది అంగలు వేస్తేనే దూరం దగ్గరయ్యేది.
అవయవాలు సహకరిస్తేనే చలనం నీకుండేది.
సహకారముంటేనే సమస్య పారిపోయేది
కాబాట్టి అందరితో కలిసికట్టుగా ఉంటేనే
నిన్ను విజయం వరించేది...
ఇంట్లోనూ మరి బయట పరస్పర సహకారంతోనే
ఏదైనా సాధించగలము,
అనుభవించగలము,
ఆనందించగలము,
కలసి ఉంటే కలదు సుఖం


Read More
Next Story