‘టెంపుల సిటీ ఆఫ్ ఇండియా’ లో ఒక రోజు...
x

‘టెంపుల సిటీ ఆఫ్ ఇండియా’ లో ఒక రోజు...

ఉప్పునీరు-నదినీరు కలయటంతో చిలికా సరస్సునీరు రుచిచూస్తే సముద్రపు నీరంత ఉప్పగా లేదు.


25.1.26 ఉదయాన్నే "జమిందార్' హోటల్ నుండి బీచ్ కి వెళ్ళాం.అక్కడనుండి బ్రహ్మగిరి ఊరిలో రంగనాథగుడి చూశాం.ఈ గుడిలో 'దైత చావెల్' పల్సటి బియ్యం కడిగిన నీళ్లలాంటి వాటర్,దాన్లో సన్నటి పచ్చిమిర్చి తేలుతూ ఉంది.పుల్లగా ఉప్పగా కారంగా భలే ఉంది.గ్లాస్ 10రు.ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇలా స్ట్రీట్ ఫుడ్ తినటం అంటే చాలా ఇష్టం.


చిలికా సరస్సువైపు మా ప్రయాణం. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ప్రపంచంలో రెండవది.చిలికా అంటే చిలక బడినది.మంచినీరు ఉప్పునీరు కలయిక వలన చిలికా అనే పేరు వచ్చిందట.ఇది మా పూదోట శౌరీ మేడంగారు చెప్పారు.

ఒడియా పదం 'చిలికా చిలికా' అంటే 'చిన్న సముద్రం లేదా సముద్రానికి అనుబంధమైన నీటి విస్తీర్ణం'అని అర్థమట.ఈ ప్రాంతంలో ఒకప్పుడు చిలికా అనే గిరిజన తెగ నివసించటంతో వారి పేరుతో చిలికా పేరు వచ్చిందని అంటారు. ప్రాచీన శాసనాల్లో 'చిలికా సరోవరగా' ప్రస్తావించబడింది.దయా,భార్గవి నదులు (మహానది ఉపనదులు) మరి కొన్ని నదుల కలయికతో 900 నుండి 1100చ.కి.(64km) విస్తరించి ఉందిట.ఒక సన్నని మార్గంద్వారా బంగాళాఖాతంతో కలుస్తుంది. అందుకే ఉప్పునీరు-నదినీరు కలయటంతో ఈ సరస్సునీరు రుచిచూస్తే సముద్రపు నీరంత ఉప్పగా లేదు.

రాజన్స్ దీవి (బర్హంపూర్ లో)చిలికా సరస్సు సముద్రంలో కలిసే చోట ఉన్నది. మొదట్లో ఈ దీవి లేదట.సముద్ర ఆటుపోటుల వలన ఇసుక మేటలు దిబ్బల దిబ్బలుగా ఏర్పడి ఈ దీవి ఏర్పడిందని హెమీస్ మేనేజర్ పవన్ కుమార్ వివరించాడు.ఆవులు బర్రెలు ఎక్కువగా కనిపించాయి.అంతా ఒరియా.ఒకవైపు చిలికా మరొకవైపు బంగాళాఖాతం మధ్యలో మేము. అదొక గొప్ప ఫీలింగ్. సముద్రంలో ఆటలు, సూర్యాస్తమయం బాగుంది.

26.1.26 ఉదయాన్నే డాల్ఫిన్స్ కోసం గంటన్నర ప్రయాణం.డాల్ఫిన్స్ ఇంకా స్వాగతం పలకట్లేదని నవ్వుకుంటూ వాటికోసం,సీఈగల్స్ ను రప్పించడం కోసం మా వాళ్ళందరూ, తీసుకొచ్చిన పాప్కాన్ లాంటివి నీటీపై వెస్తూన్నారు. సీఈగల్స్ గుంపులు గుంపులుగా వచ్చి నీటిపై పడుతున్న పాప్కాన్ ఠక్కున వాలి తినేయటాన్ని ఆస్వాదించాం.అదొక గొప్ప ఫీలింగ్.మాటలలో వర్ణించలేం.డాల్ఫిన్స్ ఈరోజు ఎక్కువగా రావడంలేదని శృష్టి (పడవ డ్రైవర్) చెప్పాడు.తిరిగి వచ్చి ఇండిపెండెన్స్ డే జరిపి మంగళ జోడి (Mangalazodi) పక్షుల కోసం బయల్దేరాము.

చిన్న పడవలో నలుగురు చొప్పున ఫోటోలు,బైనార్క్యులర్ లతో అదిగో అక్కడ, ఇక్కడ అంటూ సైలెంట్ గానే మాట్లాడుతున్నాం పక్షులకు డిస్టర్బెన్స్ లేకుండా.అప్పటికే చాలా పక్షులు వాటి సంతానంతో తిరిగి వెళ్లిపోయాయట.సైబీరియా,ఇరాన్,మంగోలియా రష్యా మొదలైన దేశాల నుంచి 160 రకాల పక్షులు వలస వస్తాయట.ఇది పక్షుల శీతాకాల (మంగళ జోడి)అభయారణ్యమట.వైట్ బిలీడ్, సిఈగల్స్, ఫ్లెమింగోలు,పెద్ద బాతులు,కొంగలు, పర్పుల్ హెరాన్స్,రకరకాల చిన్న,పెద్ద పక్షులు.ఈ పక్షుల వివరాలన్నిటినీ పడవ నడిపే వాళ్లు చెపుతారు.పెద్ద పెద్దబోర్డులు కూడా ఉన్నాయి. ప్రజల ప్రధాన వృత్తి చేపల వేట.కర్రలు పాతి, వాటికి వలలు చుట్టి ఉన్నాయి చేపల పెంపకం కోసం.ప్రకృతి పక్షులు నీరు- చిలికా సరస్సు ప్రత్యేకత. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (1985-88)ఈ సరస్సును సర్వే చేసి 800 జంతు జాతులను గుర్తించిందట.


మంగళజోడిలో పడవలు,వలలు తయారుచేయటాన్ని,చేపలు పట్టేవారి జీవన విధానం చూడాల్సిన లిస్టులో ఉన్నా సమయ భావన వలన చూడలేకపోయాము.మంగళ జోడి పట్టునేతకు కూడా ప్రసిద్ధమైనది.మాలో కొంతమంది చీరలు డ్రెస్సులు కొన్నారు.

భువనేశ్వర్ మొదట్లోనే గిరిజన పోరాట యోధుడు బీర్సాముండ విగ్రహాన్ని చూడగానే, స్వాగతం చెపుతున్నట్లు భలే సంతోషం కదా. ఒరిస్సాలో 30 జిల్లాలు, రూర్కెలా పరిశ్రమ, మహానదిపై హిరాకుడ్ డ్యాం ఉన్నప్పటికీ గ్రామాలలో పేదరికం బాగానే కనిపిస్తుంది.పేర్లు దాదాపు ఆంధ్ర లాగా కోమలి, రష్మీ,గాయత్రి,శర్మ పెద్దగ్రామాలలో పoతిక, రాజరాజేశ్వరి,నమాన్, మాలక్ష్మి అనే బోర్డులు కనిపించాయి.గ్రామాలలో భాష ఒక్క అక్షరం కూడా అర్థం కావడం లేదు. పట్టణాల్లో ఇంగ్లీష్ బోర్డులున్నాయి.ఒరియా తిరగేసి రాసిన హిందీలా ఉందనిపించింది.


ఒరిస్సాలోని భువనేశ్వర్,పూరి,కోణార్క్ లను(మూడు త్రిభుజాకారంలో ఉండటంతో) గోల్డెన్ ట్రయాంగిల్ అంటారని,ఈ మూడు జిల్లాలలో జనాభా ఎక్కువని హెమిస్ మేనేజర్ పవన్ కుమార్ చెప్పారు.ఒరిస్సా చరిత్రను, దేవాలయ కళను,సంస్కృతిని(లింగరాజ టెంపుల్- శైవ, పూరి- జగన్నాథ,కోణార్క్- సూర్య, ఉదయగిరి-జైన) ఈప్రాంతాలు ప్రతిబింబించటం వలన కూడా.

ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ ను టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారట.6 నుండీ 13శతాబ్దంల నాటి పురాతన హిoదు దేవాలయాలు ఐదు వందలు పైగా ఉండటం వలన.ఒరిస్సా వాస్తుశిల్పాలను 'యూనిక్ ఆర్కిటెక్చర్' అని కూడా అంటారు.దేవాలయాలు కళింగ శైలి,ఎత్తైన వృతాకార లేదా తేనెపట్టు ఆకార గోపురాలు,సున్నితమైన రాతి శిల్పాలు,ప్రత్యేక నిర్మాణ పద్ధతి వల్ల యూనిక్ ఆర్కిటెక్చర్ అంటారు.

27.1.26 ఉదయాన్నే లింగరాజ (శివాలయం)టెంపుల్ కు వెళ్ళాం.స్వయంభు లింగo.విష్ణువు కూడా ఉండటంతో హరిహరులుగా పిలవబడుతున్నారు.పార్వతి ఆలయ ప్రధాన దేవతగా,గిరిజగా పూజింపబడుతుంది.ఈ ఆవరణలో దాదాపు వంద గుడులు ఉన్నాయట.గుడి నమూనా పూరి,శిల్పం కోణార్కలా ఉంది.కాని లింగరాజు టెంపులే(11వ, పూరి 12వ కోణార్క్ 13వశతాబ్దాల లో) ముందుగా నిర్మించబడినది.కనుక ఈ గుడి నమూనానే పూరి,ఇక్కడి శిల్పమే కోణార్క్ లో ఉంది.ఏడవ శతాబ్దంలో చిన్న గుడిగా ప్రారంభమై 1136సo.రంలో సోమవంశి రాజైన యయాతి1 మొదలుపెట్టగా,తూర్పుగంగవంశ రాజులు విస్తరించారట. ఫోన్లు,ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధం.


లింగరాజా టెంపుల్, బిందుసాగర్ సరస్సు ఒడ్డున ఉంది. ఆలయ గోపురం 180అడుగుల(55మీ)ఎత్తున, గోపురములతో (గుండ్రంగా లేదా తేనెపట్టు ఆకారంలో)కూడిన గోపురంలా ఉంది.అఘోరాలు శివుడికి అభిషేకాలు చేస్తున్న శిల్పం అద్భుతంగా ఉంది.ఆలయ తలుపుపై గరుత్మంతుడు,నంది, డమరుకం,చిలుకలు, లతలు మామిడి పిందెలు మొ.నవి కళా నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయి. ఆలయ గోడలు ప్రతి అంగుళం శిల్ప సంపదతో, అతిచిన్న (కాలిపట్టీ పై ఉన్న)నగిచి కూడా స్పష్టంగా చెక్కి ఉంది.

పూరి జగన్నాథ ఆలయం కన్నా చాలా చాలా ప్రశాంతంగా ఉంది.పూరి ఆలయమే ఈ ఆలయాన్ని పోలి ఉంది.పూరీ కన్నా ఈఆలయం చుట్టుపక్కల చాలా గుడులున్నాయి.పూరి గురించి ప్రచారాలెక్కువ.లింగరాజా టెంపుల్ కు తగిన ప్రచారం ఉంటే గొప్ప పురాతన శిల్పకళా గుడిగా,పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెంది ఉండేది.పూరిలో చూడలేని,ప్రధాన గుడిపై జెండా ఎగర వేయడానికి ఎక్కుతున్న పూజారిని పూర్తిగా ఎక్కేంతవరకూ నేను,గోవర్ధన్ రెడ్డిగారు కళ్ళు అర్పకుండా చూశాం.ఏ ఆధారం లేకుండా ఎక్కుతారు అని చెప్పినది నిజం కాదు. ఎక్కడానికి గోపురాలతో కూడిన పక్క గోపురాలు మెట్లుగా ఉపయోగపడుతున్నాయి.విమానం పైకి గొలుసులు పట్టుకుని ఎక్కాడు.ఇలా చూడడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.హ్యాపీగా ఫీల్ అయ్యాను.వరిపేలాలతో చేసిన ఉండలాంటిది ప్రసాదంగా పెట్టారు.

గుడి బయటకు రాగానే దానికి ఎడమవైపు ముక్తేశ్వర్ టెంపుల్ (శివాలయమే)దుర్గ గుడి బాగుంది.దుర్గ గుడిలో పనస చెట్టుకు పూజలు చేయటం ప్రత్యేకత అనిపించింది.దుర్గ గుడికి పసుపు పచ్చ,గర్భగుడికి ముదురు ఎరుపు రంగు వేస్తున్నారు.కుడివైపున దీర్ఘ చతురస్రాకారపు కోనేరు ప్రశాంతంగా ఉంది.గుడి ముందు ఆర్చి ఉండడం ఈ గుడి ప్రత్యేకత.


కొద్దిదూరంలో ఉన్న రాజురాణి గుడికి వెళ్ళాం.గుడి అంటే విగ్రహాలు ఏమి ఉండవు.రాజు టెంపుల్ అంటే నల్లరాయితో కట్టినది,ఎత్తుగా ఉంది.రాణి టెంపుల్ అంటే కొద్దిగా గోపికలర్ లో రాజు టెంపుల్ కన్నా చిన్నగా ఉంది.లోకల్ పీపుల్ రాతి రంగులను బట్టి రాజు రాణి టెంపుల్ అంటారట.


ఒరిస్సా మ్యూజియం, జైనుల కాలం నాటి ఉదయగిరి, కందగిరి గుహల గురించి రేపు తెలుసుకుందాం.

Read More
Next Story