
వల్లకాటికి పూలబాట... కొత్త ట్రెండ్
కంపదాకా తొండ పరుగు, గాలిబోతే కట్టెవొరుగు, అన్ని పాటులు భంగపాటుకే, ఎల్ల బాటలు వల్లకాటికే...కొన్ని బాటలు ప్రత్యేకం. అందులో ఇదొకటి.
తగలేయటం, పూడ్చటం వల్లకాటిలో పద్ధతులు. మనుషులు తిరిగే ఊళ్ళోనే కాదు చివరకు పీనుగుల్ని పడేసే వల్లకాటిలో కూడా ఒక పద్ధతి లేదు. శ్మశానాన్ని శ్మశాన వాటిక, కాడు, వల్లకాడు, కాష్టం అని కూడా అంటారు. చనిపోయిన మనిషికి ఇక్కడ దహన సంస్కారాలు జరుగుతాయి. ప్రతి ఊరికి ఒకటి లేక అంతకంటే ఎక్కువ స్మశానాలు ఉంటాయి. ఇటీవల చాలా ఊర్లలో రియల్ ఎస్టేట్ పెరిగి స్మశానాల ఆక్రమణ మొదలైంది. అక్కడ మాకొక శ్మశానం కాావాలని ప్రజలు గొడవ చేస్తున్నారు. మమూలుగా స్మశనాలు ఊరికి దూరంగా ముళ్ల పొదల్లో విసిరేసినట్లుంటాయి. అయితే, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో వూరు పెరిగి స్మశానాలను అక్రమించుకున్నాయి.
చనిపోయిన వారికి గుర్తుగా కొందరు సమాధిని నిర్మిస్తారు. చనిపోయిన వారిని కాల్చేందుకు కట్టెలతో ఏర్పాటు చేసిన దానిని చితి అంటారు. చనిపోయిన వారిని పూడ్చేందుకు త్రవ్విన గుంతను గోయి అంటారు. చనిపోయిన మనిషి శరీరాన్ని శవం అంటారు. శవాన్ని శ్మశానాన్ని తీసుకు వెళ్ళేందుకు కర్రలతో ఏర్పాటు చేసిన చట్టాన్ని పాడె అంటారు. స్మశానం అంటే జుగుప్త్సకరమైన తలంపు. స్మశానం అంటే ఏహ్యభావం. స్మశానం వైరాగ్యం. స్మశానం మనిషి చివరి గమ ్యం. ఇలా స్మశానం అనే మాట మనల్ని వేదాంతం లోకి తీసుకుపోతుంది,. అందుకే స్మశానాలశుభ్రంగా ఉండవు. భయానికి సింబల్, స్మశానం నక్కల ఈలలు, తోడేళ్లు, దెయ్యాలు, భూతాలు, బేతాళుడ తిరిగే ప్రాంతం.అందుకే స్మశాన బాటలు నడిచేకి వీల్లేనంతగా కంపలతో మూసుకుపోయిా ఉంటాయి.
సాధారణంగా ప్రతి ఊరులో స్మశానం ఉంటుంది. ఎన్నాళ్లు బతికినా, ఎంత గొప్పగా బతికిన, ఎంత డబ్బున్నా, పేరున్నా చివరికి పోవాల్సింది వల్లకాటికి. కానీ స్మశానాలు ఎలా ఉన్నాయంటే చెప్పనలవి కాదు. చావులు ఎక్కువై స్మశాన స్థలాలు కరువై నెలకిందట పూడ్చిన చోటే మరో శవాన్ని ఖననం చేస్తున్నారు. అక్కడ వాతావరణం కూడా భయంకరంగా ఉంటుంది. కొన్ని చోట్ల కుక్కలు పీక్కుతిన్న కళేబరాలు. విపరీతమైన దుర్వాసన, శుచి శుభ్రత లేకుండా ఎక్కడ చూసిన ఎండిన పూలు, కుంకుమ, పసుపు, బొరుగులు, ఎండిన విస్తర్లు, తినుబండారాలు, సొగం కాలిన అగర్బత్తీలు దర్శనమిస్తుంటాయి.
పాతిపెట్టిన శవాల మీద డబ్బు కోసం విలువైన వస్తువుల కోసం వెలికి తీసి చిందరవందర చేసిన ఆనవాళ్లు కనిపిస్తుంటుంది. అక్కడికి వెళ్లిన వారికి వేలల్లో డబ్బు గుంజుతున్న బాపతు మరోవైపు. ఎక్కడా ప్రభుత్వ నిర్వహణలో శ్మశానాల ఏర్పాటు లేదు. తాము చనిపోయిన తర్వాత ప్రజా ప్రయోజనార్థం తమను ఖననం లేదా దహనం చేయకుండా వైద్య కళాశాలలకు ఇవ్వాలని కొందరు శరీర దాతలు కొన్ని చోట్ల సంఘాలు ఏర్పడ్డాయి.
అనంతపురంలో ప్రజాసైన్స్ వేదిక ఆధ్వర్యంలో అనంత శరీర దాతల సంఘం, నెల్లూరులో తిక్కవరపు సుకుమార్ రెడ్డి పినాకిని దేహ దాతల సంఘం అలాగే విశాఖ గూడూరు సీతామాలక్ష్మి నిర్వహిస్తున్న దేహదాతల సంఘం. మనిషి దేహంతో ఉన్నా దేహం చాలించినా నలుగురికి ఉపయోగపడాలనే వేదాంతం సీతామాలక్ష్మిది. చనిపోయి మట్టి పాలుకాకుండా మనిషి మేలు కావాలని ఆయన ఉద్యమం చేపట్టారు. గూడూరు సీతామహాలక్ష్మి అవయవదాన ఉద్యమ కారిణి, ఉపాధ్యాయురాలు . ఆంధ్రప్రదేశ్ ఉండి వాస్తవ్యురాలు. 180 శరీర దానాలు,1500 అవయవాదానాలు చేయించిన వ్యక్తి. ఆమె సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ (స్పెక్ట్) చైర్‌పర్సన్ గా పనిచేస్తుంది
ఇటీవల స్మశానం దృక్కోణం మారిపోతూ ఉంది. కొన్ని ఊళ్ళల్లో స్మశానాల ల్యాండ్ స్కేపింగ్ (Burial Ground Landscaping) మొదలయింది.చివరి యాత్ర ఆహ్లాదకరంగా సాగేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎకో ఫ్రెండ్లీ బరియల్ గ్రౌండ్స్ వస్తున్నామి. స్వర్గధామంలా నిలుస్తున్నాయి. అక్కడ నిర్వహిస్తున్న శ్మశానవాటికలు బొటానికల్ గార్డెన్ తలదన్నేలా ఉంటున్నాయి. ఇదిపుడు కొత్త ట్రెండ్.
గ్రామ పరిశుభ్రత కోసం పదేళ్లుగా చేస్తున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలో బాగంగా ఫలాపేక్ష లేకుండా పనిచేయడం తక్కువ మందికి సాధ్యమని, చల్లపల్లిలో వైద్య దంపతులు డా ప్రసాద్, డా పద్మావతి , అలాగే హైదరాబాద్ లో తిరుమలగిరి లో వెలసిన స్వర్గధామం స్వచ్ఛ కార్యకర్తలకూ మాత్రమే ఇది సాధ్యం. తిరుమలగిరి లో వెలసిన స్వర్గధామం 2013 నుంచి నిర్విఘ్నంగా పనిచేస్తున్నది. శ్రీ రజ్వంత్ సింగ్ గులాటీ ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లి శ్మశానవాటిక అందులో 108 అడుగుల శివుడి విగ్రహం ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తే తాము చనిపోయిన ఎలాంటి చోట అంత్యక్రియలు చేయాలని ప్రతి ఒక్కరూ తలుస్తారు.
అది కార్పొరేట్ కార్యాలయం లాగా ఉంటుంది. ప్రతి సంవత్సరం పదిహేను వందల పార్థివదేహాలకు పైగా అక్కడ దహనం చేస్తున్నారు. కేవలం 6500 రూపాయలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ రజ్వంత్ సింగ్ గులాటీ 2018 సంవత్సరంలో అన్నదాన వితరణ చేశారు. సుమారు లక్ష యాభై వేల మంది క్షుద్బాధను తీర్చేవారు. కరోనా మూలంగా అన్నదాన వితరణ విరమించారు. 2021లో ఆకస్మిక మరణం తరువాత అయన భార్య చరణ్జీత్ కౌర్, తేజిందర్ కౌర్, గులిస్తాన్ నాజ్, బలసుదన్ తదితరులు నిర్వహిస్తున్నారు.
హాస్పిటల్ లో ఉన్న అన్ క్లైమేడ్ బాడీస్, అనాధ శవాలకు ఉచితంగా దహనసంస్కారాలు చేస్తున్నారు. అలాగే వృద్ధాశ్రమాలు, నిరాదరణకు గురైన వృద్దులకు ఏమాత్రం డబ్బు తీసుకోకుండా అన్ని కార్యాలు నిర్వహిస్తున్నారు. స్వర్గధామం మంచి వాతావరణంలో ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మనిషి చివరి ప్రయాణం ఆహ్లాదకరంగా ఉండేందుకు వీళ్ళు చేస్తున్న సేవ ఆదర్శప్రాయం. మెరుగైన పౌరసేవలు చేస్తున్న ఇలాంటి సంస్థలు ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వం ఎకో ఫ్రెండ్లి శ్మశాన వాటికలు నిర్మించాలి.

