మంచు దారుల్లో...    (ఫోటో కవిత )
x

మంచు దారుల్లో... (ఫోటో కవిత )

పొగమంచు అవరించినపుడు, జీరో విజబిలిటిలో కళ్లింతచేసుకుని ముందుకు సాగిపోవడం గొప్ప అనుభతి. మంచుదారి మీద గూటం స్వామి కవిత




మంచు దారుల్లో...


-డా గూటం స్వామి


పొగలుకక్కే మనసుకు

మంచుదారులు ఒక ఉపశమనం!

కళ్ళముందు ఎన్ని దారులున్నా

మనసుకోరుకునేది ఇలాంటి దారులే!

ప్రకృతి అందాలకు పరవశించని

మనసు ఉంటుందా...?

రోజూ ఉదయమే నేను

నిద్రకళ్ళతో కళ్ళు నులుముకునేది ఇలాంటి దృశ్యాలనే!!

ఇలాంటి సుందర దారులు చూసినప్పుడు

ఒక తీయని ఆనందమేదో

మనసుపొరల్లో దూరి గిలిగింతలు పెడుతుంది!!

ఇక ఆ రోజంతా

స్వచ్చమైన ఆలోచనలే

పరిమళాలు వెదజల్లుతూ

తూనీరాలై చుట్టూ పరిభ్రమిస్తాయి!



Read More
Next Story