మనకు నేర్పిన విలువలను ‘శక్తిమాన్’ వదిలేశాడా?
x

మనకు నేర్పిన విలువలను ‘శక్తిమాన్’ వదిలేశాడా?

భారత బుల్లి తెరపై శక్తిమాన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 90 మంది పిల్లల్ని అడిగితే ఈ విషయాలను పూసగుచ్చినట్లు చెబుతారు. కానీ ప్రస్తుతం ఈ సీరియల్ ను..


(సంహాతి మహపాత్ర)

‘శక్తిమాన్’ గుర్తుందా.. 90 మంది కిడ్స్ ను అడగండి చెప్తారు.. కథకథలుగా.. అప్పటి బాల్య స్మృతులు గుర్తు చేసుకుంటూ.. ఆదివారం మధ్యాహ్నం వచ్చిదంటే చాలు దూరదర్శన్ లో ప్రసారం అయ్యే శక్తిమాన్ కోసం మేమంతా ఎదురుచూసేవాళ్లం. దేశంలో బాగా సూపర్ పాపులర్ అయిన సూపర్ మ్యాన్ సిరీస్ ఇదే.

1997లో ప్రారంభించిన కొద్ది రోజులకే విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. చెడు వ్యక్తులతో పోరాటం చేయడానికి సూపర్ మ్యాన్ చేసే పోరాటాలు అందరిని ఆకట్టుకున్నాయి. శక్తిమాన్ ప్రజలను కాపాడాటానికి ఎత్తైన భవనాలను కూల్చివేయగలడు. తనకు వ్యతిరేకంగా ఆయుధాలను ప్రయోగించే వారిని సమర్థవంతంగా ఎదుర్కోగలడు. అన్ని ఎపిసోడ్ లలో విలన్ లందరిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
భారతదేశంలోని చాలా మంది పిల్లల మాదిరిగానే, శక్తిమాన్ ప్రధాన విరోధి అయిన తమరాజ్ కిల్విష్ (చీకటి ప్రభువు), అతని దుష్ట సహచరులను సవాలు చేయడం కోసం శక్తిమాన్ చేసే పోరాటాలు దూరదర్శన్‌లో సీరియల్ ప్రసారం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లం.
పిల్లలంతా కూడా చీకటి ప్రభువులు బలంగా ఉండాలని కోరుకునే వాళ్లం. అయితే ప్రతి ఎపిసోడ్ చివరలో శక్తిమాన్ పిల్లల కోసం నైతిక, జీవిత పాఠాలు బోధించేవారు. నెట్ సర్వీస్ లేని ఆ కాలంలో పిల్లలకు టీవీ, ఆటలు ఆడటమే ప్రపంచం. వీటన్నింటిని అక్కడ ఆప్లై చేసేవాళ్లం.
అమాయకత్వానికి ముగింపు, అహంకార యుగం
ప్రస్తుతం 66 ఏళ్ల వయసులో ఉన్న ఖన్నా తన వివాదాలు, నోటి దురుసు ప్రకటనలతో ఆ జ్ఞాపకాలను తుంగలో తొక్కి మా లాంటి అభిమానులకు నరకప్రాయం కలిగిస్తున్నాడు. బిఆర్ చోప్రా తీసిన మహాభారతంలో భీష్మ్ పితామహ్ పాత్ర ద్వారా తరువాత సూపర్ హీరో సిరీస్‌లో శక్తిమాన్‌ పాత్రతో వచ్చిన గుర్తింపును ఆయన నాశనం చేసుకుంటున్నాడు.
ఇటీవల కాలంలో ప్రభాస్- దీపికా పదుకొణే నటించిన కల్కి 2898ఏడీ సినిమా పై ఆయన చేసిన వివాదాస్పద కామెంట్లు అన్నీ ఇన్నీ కావు. ఒడిశా, బీహార్ ప్రజలను కించపరిచేలా ఆ కామెంట్లు ఉన్నాయి. దీనితో ఆయన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ కు గురయ్యారు. తరువాత ఓదార్పుగా ఓ ప్రకటన చేయడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.
ఈ వివాదం ఇలా సద్దుమణిగిందో లేదో మరోసారి వివాదాస్పద ప్రకటనతో మీడియాపై విరుచుకుపడ్డాడు. పిల్లల్లో దేశ భక్తి నింపడానికి శక్తిమాన్ సిరీస్ ను మరోసారి రీబూట్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఆ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన శక్తిమాన్ డ్రెస్ లో వచ్చారు. తను తప్ప ఎవరూ శక్తిమాన్ కాదని శాపనార్థాలు ప్రారంభించారు.
నటుడు రణవీర్ సింగ్ తన కార్యాలయంలో రెండున్నర గంటలపాటు వేచి ఉండేలా చేశారనే పుకార్లు నిజమేనా అని మీడియా ప్రతినిధులు ఆయనను అడిగినప్పుడు, డొంక తిరగే సమాధానాలతో ఆయనకు ఓపికలో గొప్ప శక్తి ఉందన్నారు. "గొప్ప ఎనర్జీ" ఉన్న "అద్భుతమైన" నటుడిగా ఉన్నప్పటికీ 'శక్తిమాన్' సరిపోరని తేల్చిపారేశారు. అంతకుముందు రాజ్ పుత్ర రాజు పృథ్వీరాజ్ చౌహన్ చరిత్రపై అక్షయ్ కుమార్ ఎంపిక అయితే ఆ పాత్రకు ఆయన తగడని విమర్శించారు.
శక్తిమాన్ ఎందుకు అంత నార్సిసిస్టిక్?
ABP ఎంటర్‌టైన్‌మెంట్ లైవ్‌కి జరిగిన మరో ఇంటర్వ్యూలో, ముఖేష్ ఖన్నా బాలీవుడ్ టైగర్ ష్రాఫ్‌ను కించపరిచాడు . 2016లో ‘ఎ ఫ్లయింగ్ జాట్’‌లో సూపర్‌హీరో పాత్రను పోషించాడు. శక్తిమాన్ పాత్రకు కూడా టైగర్ ష్రాఫ్ సరిపోడని విమర్శలు గుప్పించారు.
“శక్తిమాన్ ఒక పిల్లవాడిని టాయిలెట్ ఫ్లష్ చేయమని అడిగినప్పుడు, అతను 'సారీ శక్తిమాన్' అని చెప్పేవాడు. అయితే ఇదే విషయాన్ని టైగర్ ష్రాఫ్ చెబితే 'నువ్వు కూర్చో' అని ఆ చిన్నారి అంటోంది. ఎందుకంటే అతను (ష్రాఫ్) పిల్లల్లో ఒక పిల్లవాడు. శక్తిమాన్ ఆనందించే స్థాయి అతనికి లేదు.

నన్ను క్షమించండి, ఇది నా వల్ల కాదు. శక్తిమాన్ కేవలం యాక్షన్ హీరో మాత్రమే కాదు. అతను యోగ పురుషుడు, మంచి ఆకర్షణ కలిగి ఉండాలి. అతను పంచభూతాలతో రూపొందించబడ్డాడు. అతను సాధారణ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్, ఐరన్ మ్యాన్ సూట్ లేదు లేదా క్రిప్టాన్‌కు చెందిన సూపర్‌మ్యాన్ కాదు. అతను తన బూట్లు భూమి నుంచి, అతని దుస్తులను నీటి నుంచి వచ్చాయి ... మీరు అతని శక్తిని ఊహించవచ్చు. మీరు వాటికి సరిపోలని ముఖంతో ఉన్నవారిని ఎంపిక చేసుకుంటున్నారు. దానికి నేను అంగీకరించను ” అని ఖన్నా ఇంటర్వ్యూలో చెప్పారు.
తను శక్తిమాన్ గా ఉన్నప్పుడు కోరిన నైతిక విషయాలను, ఇప్పుడు శక్తిమాన్ గా కొత్త పాఠాలు పిల్లలకు నేర్పకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు.
ప్రస్తుత తరాలకు దేశభక్తి, నైతిక పాఠాలను అందించాలనే ఖన్నా ఉద్దేశాలు నిజాయితీగా ఉండవచ్చు, కానీ ఇప్పటివరకు అతను ప్రవర్తించిన విధానం మాత్రం సరైంది కాదు. హిందూ మత పునరుజ్జీవనం కోసం ఆయన పిలుపులు, అతని యూట్యూబ్ ఛానెల్ 'భీష్మ్ ఇంటర్నేషనల్'లో చూడగలిగే స్నిప్పెట్‌లు ఒక రూపంలో లేదా మరొక రూపంలో అతని పాఠాల్లోకి చొచ్చుకుపోతాయని కూడా చెప్పనవసరం లేదు.
తదుపరి శక్తిమాన్ ఎవరు, అతను నేటి తరాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది పూర్తిగా వేరే విషయం. అయితే ప్రస్తుతానికి, ఖన్నా, శక్తిమాన్ రీబూట్ భవిష్యత్తు అవకాశాలను ప్రమాదంలో పడకుండా ఉండేందుకు కొన్ని విషయాలు పాటించాలి. ముఖ్యంగా మీడియా తో మాట్లాడుతూ.. నిశ్శబ్దంగా ఉండాలి. తన నార్సిసిస్టిక్ వాంగ్మూలాలను తగ్గించుకోవాలి. శక్తిమాన్ అభిమానులుగా, అతను తన ప్రదర్శనలో 90ల నాటి పిల్లలకు నేర్పించిన వాటిని స్ఫూర్తిగా ఆచరించాలని, మన చిన్ననాటి జ్ఞాపకాలను నాశనం చేయకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము.


Read More
Next Story