ఉస్మానియా గేట్ దగ్గిర ‘మన చద్దన్నం’ ఎపుడైనా రుచి చూశారా?
x

ఉస్మానియా గేట్ దగ్గిర ‘మన చద్దన్నం’ ఎపుడైనా రుచి చూశారా?

మన మూలాలు గుర్తు తెచ్చుకుందాం


-పుష్యమీ సాగర్

ఆదివారం రోజు ఒక ఈవెంట్ కోసం నేను మా ఇంటి నుంచి నారాయణగూడ కి బయలుదేరాను . అయితే అంతకు ముందు సంస్కృతం పరీక్ష రాయడం కోసం అనంతపూర్ నుంచి వచ్చిన మారుతీ గారిని కలుద్దాం అని అనిపించింది. అంతకు ముందే ఫోన్ చేసి ఉండడం వలన ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ దగ్గర కి వచ్చాను. (శివమ్ రోడ్ నుంచి) వారిని కలవడం అక్కడే ఉన్న చిన్న బండి పై న టిఫిన్ చేసాం .అయితే నాకు దాని పక్కనే ఉన్న ఒక చిన్న స్టాల్ పై కన్ను పడింది. "మన చద్దన్నం" అని ఒక చిన్న ప్లేస్ లో ఔట్లెట్ పెట్టారు.


నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ...మన చద్దన్నం" అని పేరు పెట్టడం. ఈ అబ్బాయి పేరు బుచ్చి బాబు, ఊరు నల్గొండ జిలా లో ని హాలియా దగ్గర. ఊరి లో ఉన్న ఉపాధి దొరకలేదో, లేక మన ఊరి అన్నాన్ని సిటీ కి రుచి చూపిద్దామని ప్రయత్నం ఏమో ఇక్కడికి వచ్చాడు. ఈ ఔట్లెట్ పెట్టి కేవలం వారం రోజులే అయ్యింది అట. ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రెన్స్ దగ్గర అన్ని టిఫిన్ సెంటర్ లు ఉన్నా కూడా ఇది ప్రత్యేక మైనది గా కనిపిస్తుంది. ఈ మన చద్దన్నం లో ఏమి దొరుకుతాయో చూద్దాం. మాములు గా పెరుగు అన్నం లో అన్ని మసాలాలు అంటే అది కూడా ఆరోగ్యకరమైనది. ఇది రెగ్యులర్ గా ..ఇంకా "మిల్లెట్ చద్దన్నం " ఇంకో ప్రత్యేకం.


జొన్నల పెరుగన్నం, కొర్రల పెరుగన్నం, అరికల పెరుగన్నం, రాగి సంగ టి, సజ్జల పెరుగన్నం దీనితో పాటు గా మిరియాలు నువ్వుల కారం, సాంబార్ . అబ్బో ఇంకా ఏమి చెప్తాము సూపర్ అసలు. నాకంటే అప్పటికే టిఫిన్ చేసాను కాబట్టి హెవీ అవుతుంది అని టచ్ చెయ్యలేదు . కానీ అవన్నీ చూసాక తప్పకుండ మరోసటీ రోజు వచ్చి చేసేస్తాను . ఇంకొక విశేషం ఏమిటి అంటే ...వీళ్ళు తాటి బెల్లం తో చేసిన నువ్వుల లడ్డు, ఇంకా ఓట్స్ లడ్డు కూడా అద్భుతం ...ఇది మాత్రం చక్కగా రెండు లాగించేసాను .. ఎంత బాగుందో ..కేవలం పది రూపాయలే.

సరే ఈ "మన చద్దన్నం" పెట్టడానికి గల ఉద్దేశం ఏమిటి అని అడిగాను. ఏమి లేదు అన్నా, ఇప్పుడు ఉన్న కాలం లో బయట తిందాం అన్నా ధరలు ఎక్కువ ఆరోగ్యం తక్కువ , మంచి ఆరోగ్యం ఇచ్చే ఆహారాన్ని తక్కువ ధర కె అందించాలి అని ఉద్దేశం అన్నాడు ఈ బుచ్చి బాబు. ఏమి చదువు చదివాడో తెలియదు గాని ఆరోగ్యం విషయం లో మాత్రం చాలానే స్టడీ చేసాడు అనిపించింది. నిజమే పెరుగు అన్నం డాక్టర్ లు కూడా తిననమని చెప్తారు ఎందుకంటే అది "ప్రో బయోటిక్" ఫుడ్ కాబట్టి. వీటిని ఇప్పుడు పెద్ద పెద్ద ఫుడ్ కంపెనీ లు కూడా ఎక్కువ ధరల కి పెట్టి అమ్మడం మనం చూస్తూనే ఉన్నాం. అంత ధర లు పెట్టలేని వాళ్ళు ఇక్కడికి వస్తే సరే ...

ఇది ప్రేగు ఆరోగ్యం మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహజ ప్రోబయోటిక్‌గా పనిచేస్తుంది . ఈ వంటకం సాంప్రదాయకంగా దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రా వంటకాల్లో తయారు చేయబడుతుంది, కానీ ఇది భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో విస్తృతంగా స్వీకరించబడింది.


చద్దన్నం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం, అధిక రక్తపోటు సమస్యలు తగ్గుతాయి మరియు శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. చద్దన్నం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది మరియు వేడిని తగ్గిస్తుంది.

చద్దన్నం ప్రయోజనాలు:

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చద్దన్నంలో ఉండే బ్యాక్టీరియా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. చద్దన్నం మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

అధిక రక్తపోటు తగ్గుతుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. చద్దన్నం రోజంతా శరీరానికి శక్తిని అందిస్తుంది. శరీరం తేలికగా ఉంటుంది. చద్దన్నం తినడం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. అల్సర్లను నివారిస్తుంది. చద్దన్నం కడుపులో అల్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. వేడిని తగ్గిస్తుంది. చద్దన్నం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చద్దన్నం త్వరగా జీర్ణమవుతుంది మరియు తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. మధుమేహం నియంత్రణకు సహాయపడుతుంది:

చద్దన్నం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

శరీరానికి కావాల్సిన బ్యాక్టీరియా లభిస్తుంది. చద్దన్నం శరీరానికి కావాల్సినంత బ్యాక్టీరియాను అందిస్తుంది. అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోతాయి: (subtitle)

చద్దన్నం శరీరంలోని అలర్జీ కారకాలు, మలినాలను తొలగిస్తుంది. ఇన్ని ప్రయోజానాలు ఉన్నాయి చద్దన్నం తో. ఇంతకీ ధర ఎంత అని అడిగితే కేవలం ఏది తీసుకున్నా కూడా నలభై రూపాయలు అని చెప్పాడు. అది కూడా అడిగినంత సాంబార్ ఇచ్చేస్తాడు. నిజానికి చదువుకున్న ప్రతీ వారికి గవెర్నమెంట్ జాబ్ లు రావాలి అంటే కష్టమే..ఎంత పెద్ద చదువు కున్నా కూడా ఉద్యోగం అది కూడా గవెర్నమెంట్ ఉద్యోగం రావాలి అంటే కష్టమే..అలా కాకుండా స్వయం ఉపాధి తో ముందుకు వెళ్లడం మంచిదే కదా..

మనం ఎన్నో ఫుడ్ ట్రక్ లు చూస్తాము కానీ ఇది మాత్రం వేరే...చిన్న మారుతీ వ్యాన్ లో ఆ రోజుకి కావాల్సింది తెచ్చుకొని, చిన్న టెంట్ లా వేసి అమ్ముతున్నాడు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం మన కర్తవ్యం.

మీరు ఎప్పుడైనా ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రెన్స్ వైపు గా వెళ్తే ఈ అబ్బాయి ని పలకరించడం మర్చిపోకండి ....పలకరించడమే కాదు ఇతని దగ్గర ఈ చద్దన్నం రుచి చూసి మీ ఆరోగ్యానికి కాస్త మెరుగులు దిద్దుకోండి ...

Read More
Next Story