తెలంగాణలో మరోసారి బయటపడ్డ పాతరాతియుగం గొడ్డలి
x
రాతి గొడ్డలిని చూపుతున్న పురావస్తు పరిశోధకులు

తెలంగాణలో మరోసారి బయటపడ్డ పాతరాతియుగం గొడ్డలి

కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు పాతరాతియుగానికి చెందిన రాతి గొడ్డలిని కనుగొన్నారు. ఆ గొడ్డలికి సంబంధించిన మరిన్ని వివరాలు


మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాకు 19 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ నిజామాబాద్‌ను, ఛత్తీస్‌గడ్ జగదల్పూర్‌ను కలుపుతూ పోయే జాతీయ రహదారి NH63పై వడ ధామ్ శిలాజాలతోట ఉంది. రాళ్ళుగా మారిపోయిన కోట్ల సంవత్సరాల వయస్సు గల రాకాసి బల్లులు, అవి తిని జీవించిన చెట్ల శిలాజాలను ప్రదర్శించే ‘‘వడ ధామ్ శిలాజాల పార్క్’’ దేశంలోనే ప్రత్యేకం. ఈ శిలాజాల పార్క్ పక్కన పారే చిన్న సెలయేటి ఒడ్డున కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నజీర్ తొలి పాతరాతియుగం నాటికి చెందిన రాతిగొడ్డలిని గుర్తించారు.




ఈ చేతి గొడ్డలి 1లక్ష సంవత్సరాల కిందటి రాతి పరికరమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ప్రాణహిత నది పరీవాహ ప్రాంతంలో పురామానవాసాలు సమృద్ధిగా కనిపిస్తాయి. డైనోసార్ల అవశేషాలు, బండబారిన చెట్ల శిలాజాలున్న ప్రాంతంలో ఈ రాతిగొడ్డలి లభించడం విశేషం. పురా సాంస్కృతిక ప్రదేశాలను క్షుణ్ణంగా సర్వేచేసి పురావస్తు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది.

Read More
Next Story