
అరకు లోయలో తెేనెె ఉత్పత్తి ఎలా సాగుతుందంటే....
అరకు పరిసర ప్రాంతాల్లో తేనెటీగల పెంపక కేంద్రాలు పర్యాటకులకు విజ్ఞానం అందించడమే కాక గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి.
ఎప్పటి నుంచో అరకులో గల తేనే ఉత్పత్తి కేంద్రాలపై ఒక వ్యాసం వ్రాయాలనుకుంటున్నాను. ఈవాల్టికి ఆ కేంద్రాలకు వెళ్ళి సమాచారం సేకరించగలిగాను. అరకు దాటి డుంబ్రిగుడ వెళ్ళే దారిలో జంగిడివలస రైల్వే క్రాస్ కి అటు ఇటు, అలాగే చాపరాయికి దగ్గరలోను, అరకు, సుంకరమెట్ట, పెదలబుడు ప్రాంతాలలో ఈ తేనెటీగల పెంపక కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి సీతా రామ రాజు మన్యం జిల్లా మొత్తం మీద ఈ పెంపక కేంద్రాలు ఒక్క అరకు పరిసర ప్రాంతాలలోనే కనిపిస్తాయి.
తేనే ఉత్పత్తికి ప్రధానం పువ్వులు. ఇక్కడ తెేనెటీగల పెంపక కేంద్రాలు రమా రమి ఒక ఇరవై వరకు ఉన్నాయి. ఒక్కో కేంద్రం వద్ద ప్రక్కనే గల బహిరంగ ప్రదేశంలో 200-300 తేనే ఉత్పత్తి పెట్టెలు ఉన్నాయి. ఒక్కో పెట్టెలో ఒక రాణి ఈగ ఒక మగ తేనెటీగల (మగ తేనెటీగలను డ్రోన్ లు అంటారు) అలాగే 400-500 ఆడ తేనెటీగలు ఉంటాయి. ఆడ తేనెటీగలును కూలి తెేనెటీగలు అంటారు. రాణి ఈగ గుడ్లు పెడుతుంది. మగ తేనెటీగ పని కేవలం రాణి ఈగతో కలవడమే.
రాణి ఈగకి గుడ్లు ద్వార తయారైన ఈగలలో ఒకటో రెండో మగ తేనెటీగలు ఉంటాయి. మిగిలినవన్నీ ఆడ తేనెటీగలు. రాణి ఈగ మగ తేనెటీగల పని కేవలం mating మాత్రమే. ఆడ తేనెటీగలన్నీ (కూలి తెేనెటీగలు) బయటకు పోయి పగలంతా పూల నుంచి మకరందాన్ని సేకరించి, తాము ఏ పెట్టెకు చెందినవో ఆ పెట్టె లోకి చీకటి పడ్డాకనే వస్తాయి. అప్పుడే తేనెను తయారు చేస్తాయి. పెట్టెకు ఒక ప్రక్క దిగువన ఒక చిన్న opening ఉంటుంది.
ఈ కూలి తెేనెటీగలు దీంట్లో నుంచే బయటకు వెళ్ళి తిరిగి దీని ద్వారానే పెట్టె లోపలగల తమ అరలలోకి వెళ్తాయి. ఇవి కచ్చితంగా తాము ఏ పెట్టెకు చెందినవో తిరిగి ఆ పెట్టె వద్దకు రాగలవు. ఒక రకమైన వాసన సహాయంతో పసిగట్టి తమ పెట్టెల వద్దకు ఇవి చేరుకోగలవని తెలిసింది. పొరపాటున వేరే పెట్టెలోకి చొరబడితే ఆ పెట్టె లోని గల కూలి తెేనెటీగలు ఎంట్రెన్సు వద్దనే ఈ ఈగలను చంపేస్తాయి. కూలి తేనెటీగలు 41 రోజులే జీవిస్తాయి.
మగ తేనెటీగలు (డ్రోన్ లు) 90 రోజులు, రాణి ఈగ 2 సంవత్సరాలు జీవించి ఉంటాయి. కూలి తెేనెటీగలు జీవన కాలం తక్కువ కావడం చేత వాటిని ఎప్పటికప్పుడు ఉత్పత్తి చేయడానికి రాణి ఈగ తరచూ మగ తేనెటీగలతో కలిసి ఒక్కో ట్రిప్పుకి 500ల గుడ్లు పెట్టి పొదిగి కూలి తెేనెటీగలను ఉత్పత్తి చేస్తుంది. మకరంద సేకరణ, తేనే ఉత్పత్తి పని భారమంతా కూలి తెేనెటీగలదే. పూల సీజన్లో ఒక పెట్టె నుంచి ఒక నెలకు 5 కేజీల తేనే ఉత్పత్తి అవుతుంది. సీజన్ కానీ రోజులలో 2 కేజీల వరకు మాత్రమె తేనే ఉత్పత్తి జరుగుతుందని తెలిసింది.
ఇక తేనే పలు రకాలుగా ఉన్నాయి. రోజ్ హనీ, జామూన్ హాని, ఆమ్ల హాని, గార్లిక్ హాని ఇలా ఉంటాయి. రోజ్ హనీ ఆయుర్వేద ఔషదంగా ఉపయోగ పడుతుంది. దీనిని శరీరంలోని అధిక ఉష్ణోగ్రతను నివారించుటకు, కంటి కలకల నివారణకు, కడుపులో యాసిడ్ లక్షణాల నివారణకు వాడుతారు. జామున్ హనీ చక్కెర వ్యాది నివారణకు, శరీరంలో రక్తం ఎక్కుటకు, అజీర్తి సమస్యల నివారణకు పని చేస్తుంది. ఆమ్ల హనీ గొంతు వాపు, గొంతు నొప్పి, మలద్దకం, జలుబుల నివారణకు మంచి ఔషదం.
గార్లిక్ (వెల్లుల్లి) హనీ గుండె రక్షణకు, రక్తంలో కొలస్ట్రాల్ తగ్గించుటకు, రక్తపోటు తగ్గించుటకు బాగా ఉపయోగ పడుతుంది. అట్లాగే కీమో తెరపి చేయించుకొనేటప్పుడు ఇది మంచి ఔషదం. అంతే గాక ఇది జలుబు ఇతర నొప్పులను నివారించి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జింజర్ హనీ కూడా శరీరంలోని ఇమ్మూనిటి వ్యవస్థను పెంచుటలో తోడ్పడుతుంది. శుద్ధమైన తేనేను గుర్తించడానికి రెండు మూడు పద్దతులు ఉన్నాయి. ఒకటి – ఒక గ్లాసులో సగం వరకు నీరు పోసి అందులో తేనెను వేస్తె శుద్ధమైన తేనే గ్లాసు అడుగుకి చేరిపోతుంది.
బెల్లంతో కల్తి చేసినదైతే అది నీటిలో కరిగిపోతుంది. ఇంకొకటి – అగ్గిపుల్లని తీసుకొని శుద్ధమైన తేనెలో ముంచి బయటకు తీసి వెలిగిస్తే అది వెలుగుతుంది. కల్తిది అయితే వెలగదు. ఇక మన ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా తేనే ఉత్పత్తికి సంబంధించి చాలా ప్రసిద్ధి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిదాలయానికి అనుబంధంగా ఉన్న గుంటూరు లోని విజ్ఞాన్ కేంద్రం Bee keeping course లు నిర్వహిస్తునారు. ఈ కోర్సు లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ జారి చేస్తారు.
దీనికి భారత ప్రభుత్వ కేంద్ర వ్యవసాయ, శక్తీ వనరుల శాఖ ఆద్వర్యంలో నడుస్తున్న SKILL TRAINING OF RURAL YOUTH (STRU), National Mission on Agriculture and Energy పధకాల ద్వార ఆర్ధిక మద్దతు లభిస్తున్నది. ఇక్కడ అరకు ప్రాంతంలో Bee keeping సెంటర్స్ అన్నిటిని నడుపుతున్నది గుంటూరుకు చెందినవారే. వీరందరూ Bee keepersగా సర్టిఫికేట్ పొందిన వారు. స్థానిక గిరిజన యువతను సహాయం గా పెట్టుకొని వీరు ఈ సెంటర్స్ ను నడుపుతున్నారు. కొంతమంది గిరిజన యువకులకు వీటిద్వార ఉపాధి లభిస్తున్నది. అరకు పర్యాటకులకు ఈ తేనే పెంపక కేంద్రాలు విజ్ఞానాన్ని పంచె స్థలాలు.

