భారతంలో ఎన్ని భగవద్గీతలు ఉన్నాయి?
x

భారతంలో ఎన్ని భగవద్గీతలు ఉన్నాయి?

మహాభారతేతిహాసంలో మహర్షి వేదవ్యాసుడు గీతామృతాన్ని అందిందించినారు, అయితే,ఎన్ని సందర్భాలలో, ఎన్నిరకాలుగా?


పిబతు - గీతామృతమ్

"పిబతి గీతామృతం" అంటే గీతామృతాన్ని (భగవద్గీత అనే అమృతాన్ని) త్రాగడం అని అర్థం.

మహాభారతేతిహాసంలో మహర్షి వేదవ్యాసుడు మనకు గీతామృతాన్ని అందిందించినారు.

భారతంలో భగవద్గీతాదిగీతలు
పదునారు (16) ఉన్నాయి.
వాటి క్లుప్తపరిచయం-----

1.భగవద్గీత : మహాభారతంలోని
భీష్మపర్వంలో25వ అధ్యాయంనుండి
42వ అధ్యాయం వరకు18అధ్యాయా
లలో విరాజిల్లుతోందిగీత.శ్రీకృష్ణభగవా
నుడు అర్జునుడికి చేసిన దివ్యోపదేశం
భగవద్గీత.ఇది శాస్త్రంగ ఉపనిషత్తుగ
కీర్తించబడుతున్న దివ్యభాగం.

2.ఉతథ్యగీత : మహాభారతశాంతి
పర్వంలోని2అధ్యాయాలలో(90-91)ఉతథ్యగీత ఉంది.బ్రహ్మజ్ఞానసంపన్ను
డైన ఉతథ్యమహర్షి మాంధాతృచక్రవ
ర్తికి ధర్మపరిపాలన ఆవస్యకతను ఉప దేశించిన భాగమిది.

3.వామదేవగీత : ఇదిశాంతిపర్వం
లో ఉతథ్యగీత తర్వాత 3అధ్యాయా
లలో(92-94)ఉంది.వామదేవమహర్షి
వనుమనుడికి ఉపదేశించి నాడని భీ ష్ముడు ధర్మరాజుకు చెప్తాడు.

4.ఋషభగీత : ఇదికూడ శాంతి పర్వంలోనే 4అధ్యాయాలలో(125-
128)వివరించబడింది 'ఆశ' విషయం
గ ధర్మరాజు అడిగిన ప్రశ్నకు భీష్ముడు
ఋషభుని ఉపదేశాన్ని వినిపిస్తాడు.

5.షడ్జగీత : ఇదికూడ శాంతిపర్వం
లోని ఉపపర్వమైన ఆపద్ధర్మపర్వంలో
ఒక (167) అధ్యాయంలో తెలుపబ డింది.ధర్మరాజు తన తమ్ముళ్లు మరి
యు విదురుడుధర్మార్థకామాలలోఏది
ఉత్తమమైనదో అనే అంశంగురించి చ
ర్చించబడిన విషయం కనుక దీనిని
షడ్జగీత అని పేర్కొన్నారు.

6.శంపాకగీత : శాంతిపర్వంలోని
ఒకే ఒక అధ్యాయం(176)లో విరాజి
ల్లుతోంది ఈ గీత.భీష్ముడిని ధర్మరాజు
ధనవంతులకూ నిర్ధనులకూ సుఖదుః
ఖాలు ఏ రూపంలో సంక్రమిస్తాయని
ప్రశ్నిస్తే శంపాకుడు చెప్పిన ఇతిహాస
న్ని వివరిస్తాడు.

7.మంకిగీత : ఇదికాక శాంతిపర్వం
లో శంపాకగీత తర్వాత ఉంది. ఇది
కూడ ఒక అధ్యాయం(177)లో ఉంది. ధనాశతోఎంతో ప్రయత్నంచేసినవాడు
దానిని పొందాలంటే ఎలా సుఖాన్ని పొందుతారు అన్న ధర్మరాజు ప్రశ్నకు
భీష్ముడుసమాధానంగఈగీత చెప్తాడు

8.బోధ్యగీత : ఒక అధ్యాయంలో (178) విరాజిల్లుతున్న గీత ఇది. ఎలా టి బుద్ధినికలిగిఉంటేశాంతినీ సుఖాన్నీ
పొందవచ్చు అన్న ధర్మరాజు ప్రశ్నకు భీష్ముడు ఈ గీతను చెప్తాడు.

9.విచఖ్నుగీత : ఇది శాంతిపర్వం లోని ఉప పర్వమైన మోక్షధర్మపర్వం
లో(265అధ్యాయం) ఉంది. దీనిలో
అహింస ప్రశంస ఉంది.

10.హారితగీత : శాంతిపర్వం 278
అధ్యాయంలోఉంది.పరబ్రహ్మను పొం
దేవారి ప్రవర్తన స్వభావం ఎలాఉండా
లనే హారితుని ఉపదేశం ఇది.

11.వృత్రగీత : ఇది ఒకఅధ్యాయం (279) లో ఉపవర్ణితం. కర్మఫలం గు రించి శుక్రాచార్యుడు వృత్రునికి బోధిం
చిన గీత ఇది.

12 పరాశరగీత : శాంతి పర్వం లోని 290-298అధ్యాయాలలో ఈ
గీత ఉంది. తొమ్మిది అధ్యాయాలున్న
దీనిలో--మానవుడుఏశుభకార్యాలను
ఆచరించి ఇహ పర లోకాలలో పరమ
శ్రేయస్సును పొందగలడనే విషయం
జనక పరాశర సంవాదరూపకంగఉంది

13.హంసగీత : ఇది శాంతిపర్వం లో 299వ అధ్యాయం. సత్య దమాది
ప్రశంస దీనిలో ఉంది.

14.బ్రాహ్మణగీత: అశ్వమేధపర్వం
లోని అనుగీతపర్వం లో15వఅధ్యా
యాలలో(206-346)శ్రీకృష్ణుడు అర్జు
నకు చేసిన ఉపదేశం ఇది.

15.అనుగీత : బ్రాహ్మణగీతానంత రం ఈ గీత 17 అధ్యాయాలలో(35-
51)ఉన్న అనుగీత గురుశిష్య సంవా
దరూపాత్మకం. అర్జునుడు తనకు శ్రీ
కృష్ణుడు చేసిన గీతోపదేశం మరిచా
నని చెప్పగా ఆ విషయ పరిజ్ఞానాన్ని
కలిగించే ఇతిహాసాన్ని భగవానుడు
ఉపదేశించిన ఇందలి విషయం.

16.యాజ్ఞవల్క్య గీత: భారత శాంతిపర్వంలోని 310అధ్యాయం నుండి 318 అధ్యాయం వరకూ ఈ
గీతను యజ్ఞవల్క్యమహర్షి జనకు
నకు చేసిన సృష్టివర్ణనాదులు కలిగిన
గీత ఇది.

ఇంతటి సద్విషయ సమాహార
గీతలు మహాభారత శాంతిపర్వం
మనకు అందిస్తుంది.
సంస్కృత మహాభారత శాంతిపర్వం తెలుగువ్యాఖ్యానంఉన్నదిగీతాసక్తులు
తప్పక అధ్యయనం చేయగలరు



Read More
Next Story