ఐసియు (ICU) ( Sunday Poem)
x

ఐసియు (ICU) ( Sunday Poem)

మంచికైనా, చెడుకైనా ఆసుపత్రిలో అంత్యంత మానసిక అశాంతి కలిగించే చిన్న గది ఐసియు మీద రాము కొమ్ము కవిత


- రవి కొమ్ము


***


ఇదో అంతు చిక్కని రహస్య గోపురం...

ప్రాణాన్ని తీస్తుంది...

ప్రాణాన్ని పోస్తుంది...

కన్నీళ్లను తెప్పిస్తుంది...

చిరునవ్వులను పూయిస్తుంది...

మరణ మృదంగం వాయిస్తుంది...

మరుజన్మను ప్రసాదిస్తుంది...

అంతుచిక్కని రహస్యం దాగుంది I.C.U.లో...

లోపలున్నోడికి దేహంలో ఏదో లోపాల బాధ...

బయటోన్నోడికి బ్రతుకుతాడా లేదా అనే బాధ...

కన్నీళ్ళ విలువెంతో తెలియజేసే క్షణం...

ఆస్తులున్న కాసులెంట రావాని తెలిసే క్షణం...

బంధుమిత్రుల బంధం బద్దలయ్యే క్షణం...

మిత్రుడేవాడో,శత్రువేవాడో తెలియజేసే తరుణం...

నిద్రలేని రాత్రులు...

తిండి దిగాని గొంతులు...

డబ్బులతో తగ్గే జబ్బులు...

కడుపునిండా మాత్రల గబ్బులు...

డబ్బు లేనోడికి అప్పులు...

లేకుంటే జబ్బులే జబ్బులు...

I.C.U అంటేనే యమలోకంలా కనిపిస్తుంది నాకు మా అమ్మ దూరమైన దగ్గర్నుంచి.


Read More
Next Story