టాస్‌ గెలవకపోతే ఆ గుర్రపు బగ్గీ పాకిస్థానీయుల సొంతమయ్యేది..
x

టాస్‌ గెలవకపోతే ఆ గుర్రపు బగ్గీ పాకిస్థానీయుల సొంతమయ్యేది..

ఆంగ్లేయుల వాడిన ఈ గుర్రపు బగ్గీని మనం ఎలా దక్కించుకున్నామో చాలామందికి తెలియదు. ఈ బగ్గీ హిస్టరీ కూడా తెలియకపోవచ్చు.. రండి.. తెలుసుకుందా..


భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతా ఘనంగా జరిగాయి. మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి.ఇక ఢిల్లీ కర్తవ్యపథ్‌లో వందేభారతం - నారీ పేరిట నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను కట్టిపడేశాయి. బైకు విన్యాసాలు అబ్బురపరిచాయి. మహిళా జవాన్ల కవాతు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేశ చరిత్రలో తొలిసారి త్రివిధ దళాలకు చెందిన పూర్తి స్థాయి మహిళా కంటింజెంట్‌ మార్చ్‌పాస్ట్‌ అదరహో అనిపించింది.

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కర్తవ్యపథ్‌కు గుర్రపు బగ్గీలో చేరుకున్నారు.

దాదాపు 40 ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో కనిపించిన ఈ గుర్రపు బగ్గీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దానికో చరిత్ర ఉంది.

బ్రిటీష్‌ కాలం నాటిది..

స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషర్లు ఈ గుర్రపు బగ్గీని వినియోగించేవారు. అప్పట్లో ఇది ఇండియా వైస్‌చాయ్‌కు చెందినది. 1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇండియా నుంచి పాకిస్థాన్‌ విడిపోవాల్సి వచ్చినప్పుడు ఈ గుర్రపు బగ్గీ ఎవరికి చెందాలన్న సమస్య వచ్చింది. దీన్ని దక్కించుకునేందుకు రెండు దేశాలు పోటీపడ్డాయి.

ఇండియన్‌ లెప్టినెంట్‌ గవర్నర్‌ కల్నల్‌ ఠాకూర్‌ గోవింద్‌ సింగ్‌, పాకిస్థాన్‌ ఆర్మీకి చెందిన షహెబ్‌జాదా యాకుబ్‌ఖాన్‌ ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక నాణాన్ని తీసుకుని టాస్‌ (ఇప్పుడు క్రికెట్‌ ఆటలో వేసినట్లు) వేశారు. టాస్‌ గెలవడంతో గుర్రపు బగ్గీ మన సొంతమైంది. అప్పటి నుంచి అది మనవద్దే ఉండిపోయింది. బగ్గీని లాగేందుకు ఆరు గుర్రాలుంటాయి. ఇందులో ఇండియాకు చెందినవి మూడుకాగా, మరో మూడు అస్ట్రేలియాకు చెందినవి.

ఇందిరాగాంధీ హత్య తర్వాత..

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1984లో హత్యకు గురయ్యారు. తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ బగ్గీని పక్కనపెట్టారు. 2014లో రాష్ట్రపతి ప్రణభ్‌ ముఖర్జీ దీన్ని వాడారు. ఆ తర్వాత ఇదే సంప్రదాయాన్ని 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ గోవింద్‌ కొనసాగించారు.








దాదాపు ముఫ్పై ఏళ్ల క్రితం మాజీ రాష్ట్రపతి ఫకృద్దీన్‌ అలి ఈ బగ్గీని వినియోగించారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి బయటి గేటు దాకా ఇందులో ప్రయాణించి ఆ తర్వాత కారులో రిప్లబిక్‌ డే వేడుకలకు హాజరయ్యేవారు.

Read More
Next Story