కృష్ణా తీరం.. జీవన సౌందర్య దృశ్య కావ్యం!!
x

కృష్ణా తీరం.. జీవన సౌందర్య దృశ్య కావ్యం!!

పొద్దున్నే లేచి బెజవాడ కృష్ణమ్మ వారధివైపు వెళితే మనసు మురిసిపోతుంది. ఉత్సాహం ఉరకలేస్తుంది.


ఒక్క నది.. పెక్కు ప్రయోజనంబు.. మన జీవితానికి ప్రతిబింబం. సమస్త జీవకోటికి ప్రాణాధారం. శ్రమ జీవన సౌందర్యానికి ప్రతిరూపం. మానవ మనుగడకు జీవనాధారం.

కృష్ణానది మన సొంతం.. మెలికలు తిరిగిన కృష్ణా తీరం మన పర్వతం. పొద్దున్నే లేచి బెజవాడ కృష్ణమ్మ వారధివైపు వెళితే మనసు మురిసిపోతుంది. ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆకాశ రంగులు హరివిల్లు కురిపిస్తాయి.

చెమట చుక్కల సౌందర్యం కనిపిస్తుంది. అలల మీద ఎగిసిపడే సూర్యకిరణాలు.. దృశ్య కావ్యంలా కనిపిస్తాయి. మన జీవితానికి అద్దం పడతాయి.

కళ్ల ముందు ప్రకృతి సౌందర్యం కదలాడుతుంది. తడిలో చెమట చుక్కల ఆనందాన్ని అనుభవించవచ్చు. పక్షులు కిలకిలమంటూ ఆకలేసి కేకలేసే తీరును చూడవచ్చు. పొట్టకూటి కోసం సామాన్యుడు పడే తాపత్రయాన్ని కనులారా వీక్షించవచ్చు.

బతుక్కోసం పిట్ట చేసే ఆరాటాన్ని ఒడిసిపట్టవచ్చు. సువాసనలు వెదజల్లే సుమాలను ఆస్వాదించవచ్చు. బతుక్కోసం మొక్క చేసే పోరాటం కనిపిస్తుంది. ఆఖరి క్షణంలోనూ బతకడానికి మనిషి పడే ఆరాటాన్ని తిలకించవచ్చు.

నదితో మనిషి బంధాన్ని గుర్తుచేసుకోవచ్చు.

అందుకే నది బహురూపం. కవులకు స్వర్గధామం.
కార్తీక పౌర్ణమి వెన్నెలలు, చైత్రమాసపు చిరు జల్లులు.. ఇలా ఎన్నో, ఎన్నెన్నో..
(ఫొటోలు- పిండిపోలు రవి, ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్)
Read More
Next Story