Telangana Map
‘తెలంగాణ ప్రజల వాడుక భాషనే వాచకాల్లో ప్రవేశపెట్టాలి’
సంస్కృత పద భూయిష్టమతో కూడిన భాషనే అసలైన తెలుగు భాషనే భ్రమను ప్రజలలో కల్పించే ప్రయత్నం జోరుగా సాగుతున్నది
ఒక ప్రాంతం దేశం మీద పట్టు సాధించాలంటే ఆ ప్రజల భాషా సంస్కృతులను ముందుగా మార్చాలి.అప్పుడు ఆయా ప్రాంతాలను ప్రజలను దేశాలను సునాయాసంగా తమ ఆధీనంలోకి తీసుకు రావచ్చును.
---- మాక్సిమ్ గోర్కి
పైన చెప్పిన గోర్కి మాటలకు ఉదాహరణ బ్రిటిష్ కాలంలో భారతదేశ ప్రజలపై ఇంగ్లీషు భాష సంస్కృతిని బలవంతంగా రుద్దారు.. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో వివిధ భాషలపైన అనేక ప్రజా సమూహాల సంస్కృతుల పైన హిందీ భాషా సంస్కృతిలను బలవంతంగా ప్రవేశపెట్టే ప్రయత్నం అనేకసార్లు చేశారు. కానీ ప్రాంతీయ భాషలు మాట్లాడే నాయకులు హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకించారు.హిందీ మాట్లాడే ప్రాంతాల నుంచి కేంద్రంలో ఎన్నికైన ప్రధాన నాయకులు పదేపదే ఈ అంశాన్ని తెరమీదికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ భాషల నాయకులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.
ఇది దేశంలో ఇలా ఉండగా మరో వైపు ప్రామాణిక భాష వాచకాల్లోకి ప్రవేశించడం మొదలైంది. ప్రజాభాష పైన అనేకానేక రూపాలలో మనల్ని ముంచెత్తుతున్న ప్రపంచీకరణ, పీడిత ప్రజల పైన ఆధిపత్యాల సంస్కృతి నుంచి మనల్ని విడదీసే యత్నాలు నిరంతరంగా చేస్తున్నది. మన భాష నుంచి మన సంస్కృతి నుంచి మన ఉత్పత్తి నుంచి ప్రాంతం నుంచి మనల్ని "పరాయికరణ"గా చేస్తుందో చెప్పడానికి ఇటీవల జరిగిన రెండు సంఘటనలు ఆలోచనపరుల దృష్టికి తీసుకొస్తాను.
ఒకటి:- నేను ఒక దళిత సాహితీ మిత్రుడి పెళ్లికి హాజరయ్యాను. నాతోపాటు ఇద్దరు మిత్రులు వచ్చారు. ఆ మిత్రుడు బౌద్ధం అంబేడ్కర్ ప్రభావితుడు కారణంగా సాంప్రదాయ ఆచారాలకు వ్యతిరేకంగా పెళ్లి జరిగింది. నా వెంట వచ్చిన మిత్రులు అయ్యో అయ్యగారు వేదమంత్రాలు లేకుండానే పెళ్లి జరిగింది. ఆశ్చర్యంగా ప్రశ్నార్ధకంగా మాట్లాడారు. వేదిక మీద బుద్ధ విగ్రహం ఉంచి వచ్చిన బంధుమిత్రుల సాక్షిగా దండలు మార్చుకున్న అనంతరం కొత్త దంపతులు వారి వారి తల్లిదండ్రుల పాదాభివందనం చేశారు. అనంతరం చేసిన ఊరేగింపులో విందులో సినిమా పాటలు డీజే ఆర్భాటాలకు భిన్నంగా అంబేద్కర్ పూలే పాటలు మాత్రమే వినిపించాయి. వెంట వచ్చిన మిత్రులు ప్రధాన స్రవంతి పెళ్లి తద్దినాలు పుట్టినరోజులు వంటి వ్యవహారాలకు వ్యతిరేకంగా ఇలా కూడా పెళ్లిళ్లు ఉంటాయా అని తమలో తాము మల్లగుల్లాలు, తర్జనభర్జన పడుతున్నారు. ఒక్కింత ఆశ్చర్యపోతున్నారు.
మరొకఘటన:- వేర్వేరు అభిప్రాయాలు, వయస్సులు ఉన్న నలుగురైదుగురు మిత్రులతో పాటు అనేక సంవత్సరాల తర్వాత 'రాజు వెడ్స్ రాంబాయి" సినిమాకు పోయాము. ఆ సినిమా నిర్మాతలలో ఒకరు ఊడుగుల వేణు నాకు బాగా పరిచయం ఉన్న కవి. వరంగల్ జిల్లా నర్సంపేట వాసి. గతంలో "నువ్వే నేను" "విరాట పర్వం" అనే సినిమాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు నిర్మాతగా తను దర్శకుడు గా సాయిలు తెలంగాణ వాడే రాజు రాంబాయిలు హీరో హీరోయిన్ కూడా ఈ ప్రాంతం వారే. ఒక వాస్తవ కథకు సినిమా రూపం కల్పించారు.

సినిమాలు తీసిన ప్రాంతాలు పాటలు మాటలు భాషా సంస్కృతులు తెలంగాణకు చెందినవి. కావడం విశేషం. అందువలన కూడా సినిమాకి పోవడం జరిగింది. అబ్బాయి అమ్మాయి మంగలి నాయి బ్రాహ్మణ కులానికి చెందిన ప్రేమికులు. తెరమీద తెలంగాణ సహజ సిద్ధమైన భాష సంభాషణల రూపంలో వినవస్తుంటే, కోట్లాది రూపాయలు పెట్టి తీసే యాంత్రిక కృత్రిమ సినిమాలకు అలవాటు పడిన తెలంగాణ సామాన్య ప్రజలు యువకులు యువతులు తమ తమ నేల బిడ్డల మాటలు పాటలు సంస్కృతి తెరమీద గంభీరంగా చూస్తూ గర్వించే బదులు బహాటంగా నవ్వుకోవడం నాకు వినిపించింది. మిట్టపల్లి సురేందర్ రాసిన అర్థవంతమైన అద్భుతమైన పాటలకు ప్రేక్షకులు నుంచి పెద్దగా ప్రతిస్పందన రాలేదు. సినిమా సమాప్తం అయ్యేసరికి ఒక వేదన బాధ నన్ను వెంటాడి వెన్నంటి కురిపివేసింది. భూమిపుత్రుల సంస్కృతి పట్ల మన ప్రజల చిన్నచూపు చూసే పరిస్థితులు ఎందుకు ఏర్పడిని. ఎందుకు ఇలా జరుగుతుంది. ఇలాంటి ప్రశ్నలు నన్ను తీవ్రంగా కలిచి వేసినాయి.
తెలుగు సినిమాలు రాయలసీమ ప్రాంతం అనగానే ఫ్యాక్షనిస్టులు తెలంగాణ ప్రాంతం భాష హాస్య ప్రతి నాయకుడి పాత్రలకు పెట్టడం, కళింగాంధ్ర ప్రజల భాషను కించిత్తు అపహస్యం చేయడం లాంటి సినిమాలు చూసిన ప్రేక్షకుడు ఇలాగే ప్రవర్తిస్తాడు తప్ప అందుకు భిన్నంగా తన హావ భావాలను మరో విధంగా వ్యక్తీకరించడానికి ఆస్కారం లేకుండా పోయింది. తెలుగు సినిమా చుట్టూ ఒక ఆధిపత్య వర్గాల అసహజ అసమ సంస్కృతుల సమ్మేళనంతో వాతావరణ కలుషితంగా మారిపోయింది. అందుకని మాఫియాల చేతుల్లోంచి విముక్తి పొందాలి. కానీ తెలుగులో మంచి సినిమాలు రావడం రావాలని కోరుకోవడం ఎండమావుల్లో నీళ్లు వెతుక్కోవడం లాంటిది అవుతుంది. దీని కార్యాకారణ సంబంధాలను వెతికే తెలుసుకునే దిశగా ఆలోచించడం మొదలు పెట్టాను.
ఆదిపత్య ప్రాంతం రెండున్నర జిల్లాల వ్యవహారిక భాష
1956 నవంబర్ 1న తెలుగు వాచకాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ మూడు ప్రాంతాల సంస్కృతి, భాషలను క్రమక్రమంగా ఆక్రమించి, ఈ సంస్కృత పద భూయిష్టమతో కూడిన భాషనే అసలైన తెలుగు భాషనే భ్రమను ప్రజలలో కల్పించింది. ఆ కారణంగా మూడు ప్రాంతాల భాషా సంస్కృతుల వాచకాల్లోనే కాకుండా సినిమాల్లోని, టీవీలోనూ అదే భాషను వాడి ప్రజల భాషా సంస్కృతులను ధ్వంసం చేసింది. 58 ఏళ్ల పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకునే భాష మంచి సంస్కృతి నుంచి తమ నుంచి తామే పరాయికరణ చెందేలా చాప కింది నీరులా చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చి సెల్ ద్వారా ప్రజల జీవిత విధానాలను అతలాకుతలం చేస్తున్నది.
అందువలన ఇటీవల చూసిన సినిమాలో వాడిన భాష సంస్కృతి పాత్రల భావాలు ఈ ప్రాంతం వారే చూసి నవ్వుకునేలా చేయడమే విషాదం . దీన్ని ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రజల వాడుక భాష సౌందర్యాలను వాచకాల్లో ప్రవేశపెట్టాలి. అప్పుడు గాని ఒకటి రెండు తరాల తర్వాత నైనా మన సంస్కృతి భాష సజీవంగా ఉండే అవకాశం ఉంటుంది. విశ్వవిద్యాలయాలు తెలుగు సిలబస్ కమిటీలు చిత్తశుద్ధితో పని చేస్తే గాని ప్రజల సంస్కృతి భాషల పునర్జీవం పొందే అవకాశాలు మెరుగుపడతాయి.
Next Story