భూమాయం కు నమూనా సిరిసిల్లా?
x

"భూమాయం" కు నమూనా సిరిసిల్లా?

గత ప్రభుత్వ షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందా?


-జూకంటి జగన్నాథం

భూమిని చాపగా చుట్టిన హిరణ్యాక్షుడు కథ ఇతిహాసాల ద్వారా విన్నాము . అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్ళపల్లి మండలంలోని ప్రభుత్వ భూములను స్థానిక బిఆర్ఎస్ శాసనసభ్యుని ముఖ్య అనుచరులు కొందరు ప్రభుత్వ భూమిని అప్పనంగా లావని పట్టాలు స్వీకరించారు . నాటి అధికార పార్టీ నాయకుడి మరియు అధికారుల అండదండలతో అక్రమ అక్రమాలకు తెరతీశారు . వీరు భూమి పొందడమే కాకుండా అట్టి భూములకు రైతుబంధు కూడా తీసుకున్నారు . ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఈ ప్రభుత్వ భూమి లావాదేవీలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నారు. అంతేగాకుండా అట్టి నాయకుల పైన రెవెన్యూ చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలకు స్థానిక శాసనసభ్యులు కేటీఆర్ అనుచరులు చేసిన అనేక అక్రమాలను వెనుక వేసుకొని వస్తూ, కలెక్టర్ సీట్లో.... కూర్చున్నాడని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ను అసభ్యకరంగా తూలనాడాడు. గత ప్రభుత్వంలో షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ విపరీతమైన అహంతో అసహనంతో ఈ విధంగా మాట్లాడడం చర్చనీయ అంశమైన సంగతి తెలిసినదే. ఇది ఇలా ఉంటే కేటీఆర్ ఏమో తనయాయులను బాహాటంగా సమర్ధిస్తూ జిల్లా కలెక్టర్పై ఒ తీవ్రంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఒంటి కాలి పై లేచాడు . దీంతో అన్ని విలువలకు కేటీఆర్ అన్ని విలువలకు త తిలోదకాలు ఇచ్చినట్టు అయింది.

సిరిసిల్ల నియోజకవర్గం లో సుమారు 2000 ఎకరాల వరకు లావని పట్టాలు బిఆర్ఎస్ నాయకులు పొందినట్టు తెలుస్తున్నది. దీని విలువ వెయ్యికోట్లపైగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా ఈ భూమిని పొందిన లబ్ధిదారుల ఖాతాల్లోకి 10 కోట్ల వరకు రైతుబంధును పేరున అక్రమంగా పొందారని విశ్వసనీయ వర్గాలు ద్వారా ప్రజలకు తెలుస్తున్నది . రెవెన్యూ అధికారులు ఇట్టి లబ్ధిదారుల నుంచి రైతుబంధు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని నోటీసులు జారీ చేశారు .

2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ అధినాయకత్వం భూములపై ఒక కన్నేసి ఉంచింది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొదటి విస్తృతస్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు తెలంగాణ ప్రజలకు మనం కడుపు కట్టుకొని పనిచేయాలి సేవ చేయాలని ఆ పార్టీ అధినాయకుడు కొన్ని ఇలాంటి నీతి సూక్తులు చెప్పారని విశ్వాసీయ వర్గాల ద్వారా అప్పట్లో తెలిసింది. కానీ తెలంగాణ రాష్ట్ర లోని ముఖ్య నాయకులు అంటే వారి కుటుంబ సభ్యులు చుప్ చాప్ గా అడ్డగోలుగా వెనకేసుకుంటున్న తీరును గమనించి, ఇది అయ్యగారి ఉల్లిగడ్డ శాస్త్రంలా ఉందని ఆ పార్టీలోని మిగతా నాయకులంతా ఎవరి స్థాయిలో వారు అనేక అక్రమ మార్గాల ద్వారా డబ్బు భూమి ఎవరికి అందనంత వారు ఆస్తిపాస్తులను సంపాదించడం మొదలు పెట్టారు.. ఇందులో ప్రధాన నాయకులు ఉన్నారు. వారి నమ్మిన బంట్లు ఇప్పటికే భూమి కలిగి ఉన్న వారు అయిన అనుచరులు లావని పట్టాల పొందే అవతారం ఎత్తారు. రైతుబంధు ఆర్థిక సహాయాన్ని కూడా అట్టి భూమికి అందుకున్న వారు ఉన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గం కేంద్రంగా జరిగిన లావని పట్టాల భూ భాగోతం లో కేటీఆర్ వర్గానికి చెందిన ముఖ్య అనుచరులు కొందరు ఇప్పటికే అరెస్టు అయ్యారు. ఇంకా ఈ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో జరిగిన "భూమాయం "చేసిన నాయకుల చిట్టాను రోజుకు ఒక్కటిటొక్కటిగా రెవెన్యూ అధికారులు వెలికి తీస్తున్నారు. అందులో ముఖ్యుమైన ఘటన బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుని పైన, అతని భార్య పైన సిరిసిల్ల పట్టణ కేంద్రం యొక్క రగుడు వెంకటాపూర్ బైపాస్ రోడ్డులోని ప్రైమ్ ప్లేస్ లో ప్రభుత్వ భూమిని లావని పట్టాలు తీసుకున్నారనే సమాచారం తెలిసింది . ఇట్టి విషయం వివిధ మాధ్యమాల ద్వారా కూడా రూడీగా బయటకు వచ్చింది.

ఇదిలా ఉండగా రెవెన్యూ చట్ట ప్రకారం భూమిలేని నిరుపేదలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని ఉండగా భూమి ఉన్న వారే ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు లావని పట్టాల పేరు మీద పొందారు

ఇప్పటి వరకు సుమారు 240 ఎకరాల లావని పట్టా భూములను పొందిన వారు జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.

అయితే ఇక్కడ చర్చించవలసిన విషయం ఏమిటంటే ఈ లావని పట్టాల పట్టాల భూ బాగోతం సిరిసిల్ల నియోజకవర్గానికి పరిమితమైనదా లేక మిగతా అన్ని జిల్లాలకు ఈ అక్రమ భూముల మహమ్మారి ముఖ్య నాయకుల యొక్క నియోజకవర్గాలకు సైతం వ్యాపించిందో లేఖ జరిగిందో లేదో తేల్చవలసినది ప్రభుత్వ ప్రభుత్వంలోని ఉన్నత రెవెన్యూ అధికారులు సంబంధిత శాఖ మంత్రి.

ఈ విషయం పైన ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2014 నుండి 2023 డిసెంబర్ వరకు అక్రమంగా పంపిణీ జరిగిన లావని పట్టాల పైన విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

ప్రస్తుతం వివిధ జిల్లాలలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన తీరుతన్నులపై సమూలంగా పరిశీలన చేసి తేల్చాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వ భూములు అర్హులైన పేదలకు పంపిణీ చేయడానికి గాని ప్రభుత్వ పథకాలకు భూములను కేటాయించాలన్న ఇట్టి భూములను ఆయా జిల్లా కలెక్టర్లు స్వాధీనం చేసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా చేసుకున్న నాయకులపై చట్టపరమైన కఠిన చర్యలు ప్రజాప్రయోజనాల దృష్ట్యా అవసరం ఎంతైనా కలదు.

----జూకంటి జగన్నాథం, కవి ,రచయిత

Read More
Next Story