మరణానికి ముందు ఓ మంచి మాట రాయండి!!
x

మరణానికి ముందు ఓ మంచి మాట రాయండి!!

ఆత్మకథలు రాసుకుంటాం.. వీలునామాలు రాస్తుంటాం.. జీవిత కథలు రాపిస్తాం.. మరెందుకో మన నివాళి మనం రాసుకోవడానికి వెనకాడతాం..


"ఏ ట్రైన్ టూ పాకిస్తాన్" రచయిత కుష్వంత్ సింగ్ తన నివాళి తానే రాసుకున్నట్టు, "ఈనాడు' గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీ రావు బతికుండగానే సమాధి కట్టుకున్నట్టు, అమెరికా మాజీ అధ్యక్షుడు Henry G. Freeman Jr. తన భార్య “First Lady” కడచూపు ఖర్చులకు డబ్బు దాచుకున్నట్టు.. మన శ్రద్ధాంజలి మనమే రాసుకుంటే తప్పేంటీ!?


పుట్టుక లాంటిదే మనిషి చావు కూడా.. భయపడాల్సిన పనేముందీ!? గుసగుసల అవసరమేముందీ? మరయితే మన నివాళి మనమే రాసుకుంటే తప్పేంటీ?

ఇప్పుడీ ట్రెండ్ మెల్లిమెల్లిగా మనకీ వస్తోంది.

ఆ మధ్య ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు ఓ సభలో చావు గురించి భయం ఎందుకని ప్రశ్నిస్తూ చేయాల్సినవన్నీ చేసేసి 50 ఏళ్లకే చనిపోతే నష్టమా అంటారు.

ప్రముఖ టాక్ షో హోస్ట్ మర్వ్ గ్రిఫిన్ (Merv Griffin) తన సమాధిపై “I will not be right back after this message” (ఈ బ్రేక్ తర్వాత నేనిక తిరిగి రాను.. (మరణం అనేది చివరి బ్రేక్ అనే అర్థంలో) అనేనే సిగ్నేచర్ లైన్ ఉంటుంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ తన తుది సందేశంలో “I killed the Bank” అంటారు. అంటే దానర్థం బ్యాంక్‌ను చంపేయడం కాదు తాను సంపాయించిందంతా పాలసీల రూపంలో బ్యాంకులో ఉందని, ఇక దాని అవసరం లేదనే అర్థం వచ్చేలా ఒక లైన్లో చెప్పేశాడు.

ఇలా చాలామంది చావు గురించి భయపడకుండా చాలా రాశారు. ముందే శిలాఫలకాలపై చెక్కించారు.

2020లలో అనుకుంటా మెలినా జెరోసా బెల్లోస్ అనే వాషింగ్టన్ డీసీ జర్నలిస్ట్, రచయిత రాసిన 'మీ నివాళి మీరే రాసుకోండి (write your own Obitury)' బాగా ఫేమస్ అయింది.

నన్ను నమ్మండి, నేను చనిపోయాను...

“మంచి హోటల్ కి వెళ్లండి. మీకు నచ్చింది తినండి. మెచ్చిన సినిమాకో, షికారుకో వెళ్లండి, మనసారా నవ్వండి. కసిదీరా ప్రేమించండి. ఎప్పుడేమి జరుగుతుందో తెలియనపుడు మరణం కూడా యాదృచ్చికమే కదా” అని స్టేసీ లాయిస్ ఒలివర్ తన శ్రద్ధాంజలిలో రాసుకున్నారు. “నన్ను నమ్మండి, నేను చనిపోయాను” అనే ఆమె డైలాగ్ బాగా వైరల్ అయింది.

“మీ బరువు గురించి బాధ పడకండి, జీవించండి, నవ్వండి, ఏడుపొస్తే ఏడవండి, ఎందుకంటే మనుషులు తప్ప మరెవీ వాటిని అనుభవించ లేవు. ఈ క్షణాన్ని ఆస్వాదించండి, అది మళ్లీ రాకపోవచ్చు” అన్నది జీవిత సందేశం అయినపుడు చావు గురించి బెంగ ఎందుకన్నది వీళ్లందరి ప్రశ్న.

జోకులు పక్కన పెడితే – మీరెప్పుడైనా మీ గురించి మీరు ఆఖరి మాటలు చెప్పాలనుకున్నారా? ఉండిండుకపోవచ్చు. ఇప్పుడది సరైన సమయం కావొచ్చు. ఆ పని చేయండన్నది వీళ్ల సందేశం.


మీ జీవితంలోని గొప్ప సంఘటనలను రాయడం వల్ల విషాదంలో ఉన్న మీ స్నేహితులో, కుటుంబ సభ్యులో కొంత ఊరట చెందుతారన్నది వీళ్ల భావన.

అలాగే మీది మీరే రాసుకుంటే కథనాన్ని నియంత్రించగలుగుతారు. అది వ్యంగమైనా, తత్వమైనా.. మీ జయాపజయాలు, మీకోపతాపాలు, నైతికానైతికాలు, విలువలు హైలైట్ చేయడం వల్ల మీ స్మృతిని మీకు నచ్చినట్టుగా జరుపుకోగలుగుతారు.

దీనివల్ల జరిగే మేలు ఏమిటంటే – మీ గురించి మీరు తప్ప మరెవ్వరూ బాగా చెప్పలేరు. ఆ అనుభవాలు లేదా ఘటనలు ఇతరులకు ఒక ప్రేరణగా మిగలవచ్చు. మీ శేషజీవితాన్ని జంకూగొంకూ లేకుండా జీవించడానికి ఓ మేలుకొలుపు కూడా (వేక్-అప్ కాల్) కావొచ్చు.

మన నివాళి మనం రాసుకోవడానికి న్యూయార్క్ టైమ్స్ రచయిత కేటీ హాఫ్‌నర్ మూడు సూచనలు కూడా చేశారు. అవి

1. మీ ఎపిటాఫ్‌తో ప్రారంభించండి...

మరణించిన వ్యక్తి సమాధి రాయి (tombstone) మీద రాసే చిన్న వాక్యం ఎపిటాప్. (సమాధి రాళ్లు పెట్టేవాళ్లకి) మిమ్మల్ని ఎలా గుర్తు పెట్టుకోవాలనుకుంటారో స్పష్టత తెచ్చుకోండి. మంచి తండ్రిగానా, తల్లిగానా, క్రీడాకారునిగానా, ధనవంతునిగానా లేక హాస్యప్రియునిగానా.. ఇలా ఏదైతే అది.

స్పష్టత లేకపోతే పాత ఫొటోలు, లేఖలు తిరగేయండి. మధుర క్షణాలు ఏవో గుర్తుకుతెచ్చుకోండి. ఏ మార్పులు ధైర్యంగా చేశారో? ఏ సంబంధాలు విలువైనవిగా భావించారో? మననం చేసుకోండి.

మీ జీవితంలోకి వచ్చిన పాత్రలను పరిగణనలోకి తీసుకోండి. స్నేహితుడో, తిరుగుబాటు వీరుడో, మరో నాయకుడో, ఇంకో ప్రేమికుడో, పిల్లలో, తల్లులో, తండ్రులో.. ఎవరో ఒకరు మీ జీవితాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు.

అలా కాదనుకుంటే మీరు ఇతరులపై ఎలా ప్రభావం చూపారో రాయండి. మీరు రాసేటపుడు గుర్తు పెట్టుకోవాల్సిందల్లా.. 'భావితరాలకు మీరో గతాన్ని వదిలిపెడుతున్నారు' అనేది.

2. మీపై మీరు జాలి పడకండి (Self-compassion)

జీవితం ఎవ్వరికీ వడ్డించిన విస్తరి కాదు. ఎంతో కొంత గందరగోళం ఉంటుంది. కోపతాపాలు, పశ్చాత్తాపాలు సహజం. అయితే అవి మిమ్మల్ని దారి తప్పనివ్వకూడదు. “ఇలా ఉండాల్సింది, అలా ఉండాల్సింది” అనే ఆలోచన సహజమే కానీ సాయపడేది కాదు. మీ బలాలను, బలహీనతలను గుర్తుంచుకోండి. నిరాశ, నిస్పృహలు ఎదుగుదలకు అవకాశాలుగానే భావించండి.

3. మీ పాఠకులను పరిగణనలోకి తీసుకోండి.

మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడుతున్నట్లుగా రాయండి.

మీరు నేర్చుకున్న పాఠాలను పంచుకోండి, కృతజ్ఞత తెలియజేయండి.

నిజాయితీగా సలహాలు ఇవ్వడానికి వెనకాడకండి.


'నేను పెద్దవాణ్ణీ కాదు, చిన్నవాణ్ణీ కాదు'. పొద్దున్నే కప్పు కాఫీ ఇచ్చిన మేడం నుంచి మొదలుకుని రోడ్డు మీద చిరునవ్వు నవ్విన బాటసారి వరకు, ప్రతి ఒక్కరూ మనల్ని మలిచిన వారే.

'ఒకాయన 'నా బరువు తగ్గించుకోమని సలహా ఇచ్చారు'. కానీ నేను తిండిబోతుని, తగ్గించుకోలేదు.

'ఇంకోయన.. 'Time waste చేయవద్దని' చెప్పారు. నాకలా ఆకాశంలో ఎగిరే పక్షిని చూస్తూ ఉండడమే ఇష్టం. దాన్ని వృథా అనలేను.


'మరోయన.. 'సొసైటీలో గొప్పగా నిలవాలని సలహా ఇచ్చారు' కానీ నేనో చిన్నవాడిగానే మిగిలాను. చిన్ని చిన్ని ఆనందాల్లో తేలిపోయాను. పెద్దపెద్ద పదవుల్లో కంటే, పుస్తకాల్లోనో, పార్కుల్లోనో, మంచి మిత్రులతోనో తలమునకలు కావడమే నాకు పెద్ద హోదా అని తెలిసింది. చిరునవ్వులు చిందించే చిన్న పిల్లలు ఇష్టం. ఎరుపంటే ఇష్టం, ఎదుటివాడి కష్టమంటే కష్టం.

మరణం అనేది చివరి స్టేషన్ కావచ్చు కానీ మధ్యలోని ప్రతి స్టాప్ మీరు ఆస్వాదిస్తే చాలు.

“నేను చనిపోయాను” అని కాదు,

“నేను బాగా జీవించాను” అని చెప్పడానికి వీలుగా మీ నివాళి మీరే రాయండి.

మళ్లీ అవకాశం వస్తే, మీరు వస్తువులకన్నా, మనిషి అనుభవాలపైన్నే ఎక్కువగా డబ్బును, సమయాన్ని ఖర్చు చేస్తారా? స్వీట్స్ కి బదులుగా విందులు, వినోదాలపై మక్కువ చూపుతారా? అని ప్రశ్నించుకోండి.

రాసే దాన్ని కాస్త సరదాగా రాయండి. హాస్యం జోడించండి. మీ తత్వాన్ని ప్రతిబింబించే సరదా సంఘటనను పంచుకోండి. కన్నీళ్ల మధ్యా చిరునవ్వులు పూయించగలిగితే అదే గొప్ప నివాళి అవుతుంది.

ఒకవేళ మీరు ఒక్కరే అలా రాయడం కుదరకపోతే మిత్రులతో కలిసి ప్రయత్నించండి.

డిన్నర్ పార్టీ లేదా వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసి, స్నేహితులతో కలిసి నివాళి లేదా శ్రద్ధాంజలి ఎలా రాయాలో కసరత్తు చేయండి. నా స్నేహితుడొకరు ఏమన్నారంటే.. "ఇద్దరు, ముగ్గురు స్నేహితులతో ఓ సరస్సు పక్కన క్యాంప్ వేసి “వైన్, డైన్ మధ్య రాతప్రతుల్ని ఇచ్చిపుచ్చుకుంటాం" అని చెప్పారు. “నేను చేయలేకపోయిన కొన్ని పనులు కూడా రాసి, అవి ముందే చేరేటట్లు చూసుకుంటాను” అని చెప్పారు.

ఇలా చేస్తే మీకు నచ్చిన హ్యాపీ ఎండింగ్ ఖాయం అవుతుంది.

“నేను చనిపోయాను” అని కాదు,

“నేను బాగా జీవించాను” అని చెప్పడానికి వీలుగా మీ నివాళి మీరే రాయండి.

నేను రేపే చనిపోతే, ముఖం ముడుచుకుని ఏడవొద్దు. నేను జీవితంలో ఆస్వాదించిన అర్థంలేని సరదాలకు పరదాలు కప్పండి.

మెల్ బ్లాంక్ (Mel Blanc) అనే Looney Tunes (వార్నర్ బ్రదర్స్ ఫేమస్ కార్టూన్ సిరీస్) వాయిస్ ఆర్టిస్ట్ సమాధిపై ఇలా ఉంటుంది..“That’s All Folks “ఇంతే మిత్రులారా!”)

Read More
Next Story