
నాలోని ఒక భాగం అంతా జీవించి వుండాలని కోరుకుంటున్నది!
Lind Gregg రాసిన Part of Me Wanting Everything To Live కవితకు తెలుగు రూపం
మూలం: లిండా గ్రెగ్
తెలుగు - గీతాంజలి
ఈ కొత్త ఇంగ్లాండ్ లాంటి ప్రేమ..
ఒకప్పుడు నా సహచరుడు
నాకు కానుకగా ఇచ్చిన పూలకుండీని జ్ఞప్తికి తెస్తున్నది.
నిజానికి..నేను దాన్ని చాలా ప్రేమతో సాదాను!
ప్రతీ రోజూ కుండీ ఒక పావు వంతు పూలతో వెడల్పుగా పాకేలా ఉంచాను.
ఎంత అంటే అది
కిటికీదగ్గర దాకా సాగేలా అన్నమాట! అయినా..
ఎండిన కొమ్మలపైన వాడిపోయిన పువ్వులు మెడలు వొంచి వాలి పోయేవి !
ఆ ఎండిన పూలని కత్తిరించాను..
ఆ కొమ్మల పైన మళ్ళీ ఆకు పచ్చని తాజా ఆకులు మొలకెత్తటం కూడా చూసాను.
కొత్త మొగ్గలు కూడా వికసించాయి.
ఇక ఇప్పుడు నేను దాన్ని అనుమతించనివ్వనంత వరకూ...
పూల మొక్క మరణించదు అనే అనుకున్నాను!
కానీ., విచిత్రంగా కొత్త పూలన్నీ మెల మెల్లిగా రాలిపోసాగాయి!
రాలిన ఆ పూలు.. చీకటిలోవొంటరిగా...
తమదైన ఏకాంతంలో మెలకువగా ఉండే చిన్ని,చిన్ని కళ్లలా ఉన్నాయి.
కానీ ఇలా పూలు రాలి పోతూ కుండీలో తక్కువ అయిపోవడం ..
వాటిని మళ్ళీ కృత్రిమంగా పెంచడం నాకేమీ నచ్చడం లేదు !
ఏదో ఒక చిన్న సంఘటనతో
మహత్వ పూర్ణమైనదాన్ని కోల్పోతూ..వదిలేస్తూ ఉన్నట్లుగా ఉన్నది !
ఇదంతా చాలా భిన్నంగా ఉంది!
అసలు ఇదంతా ఇలా కాదు కానీ... నేనిప్పుడు చాలాదగ్గరితనంతో..
ఎక్కువ సామీప్యతతో ఉండే .. అత్యధికమైన ఆఖరి అంతాన్ని కోరుకుంటున్నాను !
అది వణికించే చలికాలం అయితే..పూర్తిగా వొట్టి చలి కాలమే కానివ్వు మరి !
Next Story