విజయవాడలో కెవిఆర్  స్మారకోపన్యాసం
x
కెవిఆర్, శారదాంబ

విజయవాడలో కెవిఆర్ స్మారకోపన్యాసం

తేది: 23.3.2025 ఆదివారం, సమయం: ఉదయం 10.30 ని, వేదిక: హెుటల్ స్వర్ణా ప్యాలెస్, సమావేశ మందిరం, చల్లపల్లి బంగ్లా వద్ద, విజయవాడ


2011 డిసెంబర్ 13 న ఏర్పడిన కె.వి.ఆర్. శారదాంబ స్మారక కమిటీ కె.వి.ఆర్. స్మారకోవన్యాసాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అలాగే ప్రతి సంవత్సరం కె.వి.ఆర్. సాహిత్యాన్ని ఒక సంపుటమైనా తీసుకురాదల్చుకున్నది. ఇందులో భాగంగా మొదటగా “మహెూదయం" గురజాడ జీవిత సాహిత్యాల గురించిన పరిశోధన గ్రంథాన్ని తీసుకొచ్చింది. ఇప్పటివరకు 'కె.వి.ఆర్. సాహిత్య వ్యాసాలు - 1,2,3,4 వ్యాస సంపుటాలు, 'డిటెన్యూ డైరీ' తీసుకొచ్చింది. ఇప్పుడు కె.వి.ఆర్. లేఖలు తీసుకొచ్చింది.

23.3.1998న అమరుడైన కె.వి.ఆర్. అర్థ శతాబ్దం పాటు కొనసాగించిన సాహిత్య కృషి పరిధి చాలా విశాలమైంది. కె.వి.ఆర్. కవిగా, విమర్శకుడిగా, పరిశోధకుడుగా, నాటక కర్తగా, తెలుగు సాహిత్య లోకంలో సుప్రసిద్ధుడు. మొదట అభ్యుదయ రచయితల సంఘంలోనూ, ఆ తర్వాత అఖిలభారత విప్లవ సాంస్కృతిక సమితిలోనూ కీలకమైన పాత్రను పోషించి, ఆ సంఘాలను ప్రగతిశీల పధంలో నడిపించిన కార్యశీలి.

కె.వి.ఆర్. జీవిత సహచరి శారదాంబ కేవలం గృహిణి మాత్రమే కాదు. కె.వి.ఆర్. సాహిత్య కృషికి ఆమె ఎంతగానో తోడ్పడిందన్న విషయం ఆ కుటుంబంతో పరిచయమున్న వాళ్ళకు తెలిసిందే. అందుకే ఇద్దరి పేర్లమీదా స్మారక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

మార్చి 23న జరిగే కెవిఆర్ సంస్మరణ కార్యక్రమంలో ‘సంసృతి-భావజాలం - కె.వి.ఆర్’ అనే అంశం మీద ప్రొఫెసర్ కాశీం కెవిఆర్ స్మారకోపన్యానం చేస్తారు. తర్వాత ఇటీవల అమరడైనా ఢిల్లీ యూనివర్శిటీ ఫ్రొఫెసర్, పౌర హక్కుల ఉద్యమ నేత సాయిబాబాతో తమకున్న అనుబంధాన్ని వసంత, మంజీరా, డాక్టర్ వసుంధర పంచుకుంటారు. సభకు ప్రముఖ కవి అరసవిల్లి కృష్ణ అధ్యక్షత వహిస్తారు. ప్రముఖ కవి వి. చెంచెయ్య పుస్తకావిష్కరణ చేస్తారు.

మార్చి 23న జరిగే ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ కోరుతున్నది.

Read More
Next Story