
శేషాచలంలో అడవుల్లో కోట్ల సంవత్సరాల నాటి జీవరాశులు
శేషాచలం తూర్పు ఘాట్ అత్యంత పురాతన జీవవ్యవస్థల్లో ఒకటి. ఇక్కడి సూక్ష్మ వాతావరణం అపారమైన జీవ వైవిధ్యాన్ని ఆకర్షిస్తోంది.
శేషాచలం జీవవైవిధ్యంలో కొత్త వెలుగులు –డైనోసార్ కాలం నుంచి జీవించి ఉన్న “లివింగ్ ఫాసిల్” (Cycas beddomii) , మాంసాహార మొక్కలు, గనోడెర్మా మరియు బయోల్యూమినిసెంట్ శిలీంద్రాల కనుగోలు వాటి శాస్త్రీయ విశ్లేషణ
తూర్పు కనుమలలో భాగమైన శేషాచల బయోస్ఫియర్ రిజర్వ్, అరుదైన జీవరాశుల సహజ నిల్వగా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజా అధ్యయనాల ప్రకారం ఈ ప్రాంతంలో మాంసాహార మొక్కలు, ఔషధ గుణాల కలిగిన గనోడెర్మా శిలీంద్రం, రాత్రివేళల్లో వెలిగే బయోల్యూమినిసెంట్ పుట్టగొడుగులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.
ఇక్కడి వాతావరణం, నేల ఆమ్లా స్వభావం, నెల తేమ స్వభావం ,ఇవన్నీ కలిపి ఈ అరుదైన జీవరాశుల పెరుగుదలకు అనుకూలంగా ఉండటం వలన ఈ జీవరాసులు ఇక్కడ ఎన్నో మిలియన్ సంవత్సరాలుగా మనగలుగుతున్నాయి. .
"సైకస్ బేఢోమీ (Cycas beddomei: పేరీత చెట్టు) డైనోసార్ కాలం నుంచి జీవించి ఉన్న “లివింగ్ ఫాసిల్” (కింది ఫోటో)
ప్రపంచంలో శేషాచలం–తిరుమల–కడప కొండలలో మాత్రమే సహజంగా కనిపించే అత్యంత అరుదైన వృక్షజాతి. ఇది Critically Endangered జాతిగా గుర్తించబడింది. 12–15 సంవత్సరాలకు మాత్రమే గింజలు వచ్చే ఈ మొక్క రాతిబండ నేలల్లో మట్టి తొలగిపోకుండా కాపాడుతుంది. దీని నరికివేత, వ్యాపారం చట్టపరంగా పూర్తిగా నిషేధించబడ్డాయి.
ఈ మొక్కకు మగ, ఆడ చెట్లు వేరువేరుగా ఉంటాయి. దీని ముడి గింజలు విషపూరితమైనవి కావడంతో గిరిజనులు శుద్ధి చేసిన తరువాత మాత్రమే వినియోగిస్తారు. తిరుమల కొండలు దీనికి ప్రపంచంలోనే అతిపెద్ద సహజ నివాస ప్రాంతంగా గుర్తింపు పొందాయి.
ఇక మాంసాహార మొక్కల ఉనికి , నేల పోషకాల లోపానికి సహజ సూచిక.
డ్రోసెరా
శేషాచలంలో కనిపించే Drosera (సండ్యూ) మరియు Utricularia (బ్లాడర్వోర్ట్) జాతులు, నత్రజని (Nitrogen) తక్కువగా ఉన్న నేలల్లో అభివృద్ధి చెందే మొక్కలుగా శాస్త్రీయంగా గుర్తింపు పొందాయి.
వీటి పెరుగుదలకి అనుకూల పరిస్థితులు అయినటువంటి అధిక తేమ, కానీ పోషకాలు లేని ఆమ్ల ధర్మం ఉన్న నేల,రాళ్ళపై ఏర్పడే పలుచని మట్టి పొర, నేరుగా సూర్యరశ్మి సోకని ప్రాంతాలు లేదా తగిలే అధిక ఉష్ణోగ్రతలు సమోదు కానీ ప్రాంతాలలో విరివిగా పెరుగుతాయి.
మాంసాహార మొక్కలు చీమలను, చిన్ని కీటకాలను పట్టుకుంటాయి. ఈ మొక్కలు నత్రజని రహిత ప్రదేశాలలో పెరుగుతుండటం వలన , నత్రజని కొరకు Drosera మొక్కల ఆకులపై ఉన్న రంగు రంగుల గ్రంధులు కీటకాలను ఆకర్షిస్తాయి అంటుకునే గుణం కలిగిన ఈ గ్రంథుల పురుగును చిక్కుకోనిస్తాయి. అవి చిక్కుకొన్నాక మొక్కలలో ఏర్పడే టచ్ స్టిములస్‌కు స్పందిస్తూ ఆకు నెమ్మదిగా ముడుచుకొని కీటకాలలోని నత్రజనిని శోషించడం ద్వారా ఈ మొక్కలు గ్రహిస్తాయి.
శేషాచలం లో వున్నా మరొక మాంసాహార మొక్క Utricularia, ఇవి నీటిలో బ్లాడర్‌లాంటి సంచులను ఉపయోగించి సూక్ష్మజీవులను లోపలికి లాగి జీర్ణం చేసుకొంటాయి. ఇ మొక్కలు పురుగుల నుండి తీసుకునే నత్రజని ద్వారా తమ పెరుగుదల అవసరాలను తీర్చుకుంటాయి. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, మాంసాహారి మొక్కల ఉనికి ఎకోసిస్టమ్‌లో పోషకాల సమతుల్యత లోపాన్ని సూచిస్తాయని పర్యావరణ ఆరోగ్యానికి ఇవి కీలక సూచికలని అన్నారు.
గనోడెర్మా – శేషాచలం అడవుల్లో ఔషధ శిలీంద్రాల పెరుగుదల
గానోడెర్మా లుసిడుమ్
ఫారెస్ట్ రేంజర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఫార్మా పరిశోధనలో ప్రత్యేక ప్రాధాన్యత పొందిన Ganoderma lucidum (Reishi mushroom) శేషాచలం అడవుల్లో ఎక్కువ తేమ కలిగిన ప్రాంతాలలో, చెట్ల దిగువ భాగంలో నీడ పుష్కలంగా ఉండే ప్రాంతాలలో, కుళ్ళిన చెట్ల కాండాలు, ఆకులు,దుంపలపై విస్తరంగా పెరుగుతోందని అన్నారు.
శిలీంద్రం యొక్క శాస్త్రీయ ప్రాముఖ్యత
వీటిలో ట్రైటర్పెన్ కాంపౌండ్స్, పాలిసాకరైడ్స్, గ్లైకోప్రోటీన్లు అధికంగా ఉండటం, కణాల్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించే శక్తి, ఇమ్యూన్ రెగ్యులేషన్‌పై ప్రభావం ఉండటం తో ఫార్మా విభాగంలో వివరివిగా ఉపయోగిస్తున్నారు.క్యాన్సర్ పరిశోధనల్లో ఉపయోగిస్తున్న జాతుల్లో ఒకటి
గానోడెర్మా విస్తరణ శేషాచలంలో ఆరోగ్యమైన చెట్ల వయస్సు నిర్మాణం మరియు సమృద్ధమైన మైక్రోబయోటా వ్యవస్థ ఉండటానికి సూచికగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఫంగస్, ఆల్గీ కలయికతో ఏర్పడిన సూక్ష్మ జీవ సముదాయం
రాత్రివేళల్లో వెలిగే బయోల్యూమినిసెంట్ పుట్టగొడుగులు – శేషాచలం అడవులకు శాస్త్రీయ గౌరవం
ఇటీవలి పరిశోధనల్లో శేషాచలంలో అనేక ప్రాంతాల్లో బయోల్యూమినిసెంట్ ఫంగస్ జాతులు నమోదయ్యాయి. వీటిలో Mycena, Neonothopanus, Panellus వంటి జాతులు ముఖ్యమైనవి.
ఇవి వెలుగు ఎందుకు ఇస్తాయి?
రసాయనికంగా లూసిఫెరిన్ – లూసిఫెరేజ్ ప్రతిచర్య: లూసిఫెరిన్ ఆక్సిజన్‌తో కలిసినపుడు శక్తి కాంతి రూపంలో విడుదలవుతుంది. ఇది కీటకాలను ఆకర్షించే ఒక సహజ పరిణామ కౌశలంగా భావిస్తున్నారు. శిలీంద్రం స్పోర్లు వ్యాపించడానికి ఈ ప్రకాశం ఉపయోగపడుతుందని తాజా అధ్యయనాల సూచన
ఇవి పెరుగే ప్రాంతాలు
తేమ అధికంగా ఉండే లోతైన అడవి ప్రాంతాలు, కుళ్లిన చెట్ల తొక్కలు, కుళ్ళిన దుంపలు అడవి నేలలోని చీకటి పూరిత ప్రాంతాలలో పెరుగుతాయని Prabhakar reddy గారు తెలిపారు.
ప్రస్తుతం శేషాచలంలో లభ్యమవుతున్న బయోల్యూమినిసెంట్ శిలీంద్రాలపై పరిశోధనలు జరిగితే భారతదేశంలో మైకాలజీ రంగానికి కొత్త అంచులను తెరుస్తాయని అన్నారు.
లైకెన్లు, స్కార్లెట్, కారల్ మష్రూమ్స్ – అడవి ఆరోగ్యానికి సహజ సూచికలు
శేషాచలంలో విస్తరంగా కనిపించే పార్మోట్రేమా పెర్లాటమ్ (Parmotrema perlatum ) లాంటి లైకెన్లు వాతావరణ పరిశుభ్రతకు సూచిక. ఇవి గాలిలోని కాలుష్యానికి అత్యంత సున్నితమైనవి. స్కార్లెట్ & కారల్ మష్రూమ్స్ అడవిలోని సజీవ పదార్థాలను విచ్ఛిన్నం చేసి నేల సారాన్ని పెంచుతాయి.
శేషాచలం శాస్త్రీయ విలువ – సమగ్ర దృష్టి
ఈ మూడు విభాగాల జీవరాశులు — మాంసాహార మొక్కలు, ఔషధ శిలీంద్రాలు, బయోల్యూమినిసెంట్ పుట్టగొడుగులు — ఒకే ప్రదేశంలో కనిపించడం శేషాచలాన్ని బయోసైన్స్, ఎకోసిస్టమ్ రీసర్చ్, క్లైమేట్ స్టడీస్లకు ప్రత్యేక నమూనాగా మార్చింది.
శాస్త్రవేత్తల అంచనా
శేషాచలం తూర్పు ఘాట్‌లో అత్యంత పురాతన జీవవ్యవస్థల్లో ఒకటి. ఇక్కడి సూక్ష్మ వాతావరణం (Microclimate) అపారమైన జీవ వైవిధ్యాన్ని ఆకర్షిస్తోంది. ఈ ప్రాంతం సంరక్షణ అత్యవసరం—మానవ చర్యలు, తవ్వకాలు, రోడ్డు విస్తరణ వంటివి దీని జీవ వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం
శేషాచలం ప్రకృతిచే నిర్మించబడిన ఒక శాస్త్రీయ విస్మయం అని మాంసాహార మొక్కలు నేలలోని పోషక లోపాన్ని తెలియజేస్తే, గనోడెర్మా శిలీంద్రాలు అడవి ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తాయని అలాగే బయోల్యూమినిసెంట్ పుట్టగొడుగులు జీవరసాయన శాస్త్రంలోని అత్యంత అరుదైన ప్రక్రియలకు ఉదాహరణ అని .
ఈ జీవరాశులన్నీ మనకు ప్రకృతి ఎంత సంక్లిష్టం, ఎంత సున్నితమైనదో గుర్తు చేస్తున్నాయని శేషాచలాన్ని కాపాడటం అంటే శాస్త్రాన్ని, జీవనాన్ని, భవిష్యత్తును కాపాడినట్లే అని అన్నారు.
Next Story

