
ఇప్ప పూలు ఆర్థిక శక్తిగా మారుతాయా? మహువా సారా చర్చ
ఇప్పపూలు, మహువా సారా చుట్టూ పెరుగుతున్న చర్చ. గిరిజన ఆర్థిక వ్యవస్థ, విధానాలు, అవకాశాలు, సవాళ్లు వివరంగా తెలుసుకోండి.
అడవుల్లో ముత్యాల్లా రాలిపడే ఇప్పపూలు గిరిజనుల జీవితాల్లో ఒక ఆర్థిక విప్లవానికి నాంది కావచ్చు. వేల ఏళ్లుగా ఈ చెట్టు వారి జీవన విధానంలో భాగమై ఉంది. పూలు ఆహారం, గింజలు నూనె, చెట్టు నీడ జీవనాధారం. కానీ ఈ ప్రకృతి ఇచ్చిన ఈ అద్భుతమైన వరం ఇప్పటికీ సరైన గుర్తింపు, మార్కెట్, పాలసీ లేక నిస్సహాయంగా ఉంది.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ఒక సభ్యుడు ఇప్పసారా, ఇప్పపూలలో పోషకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాక ఇంత వరకు ప్రభుత్వాలు ఇప్ప చెట్టు విలువను నిజంగా అర్థం చేసుకోలేక పోయాయి అనే దిశగా ఇప్ప పూల మీద సర్వత్రా చర్చ మొదలైన సందర్భంలో
ఇప్పపూలు , సారా మీద పరిశోధన చేస్తూ వైవిద్యమైన ఉత్పత్తులతో విదేశాలను సైతం ఆకట్టుకుంటున్న చత్తీస్ ఘడ్ కి చెందిన షేక్ రజియా తో సంభాషణ.
జర్నలిస్టు శ్యాంమోహన్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న షేక్ రజియా
అటవీ ఉత్పత్తులకు విలువను జోడిస్తూ
‘ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఇప్ప చెట్టు గిరిజనుల ఆరోగ్యానికి ‘ఆర్థిక అస్త్రం’గా మారింది. అయితే దాన్ని ఆధునిక మార్కెట్‌తో సమన్వయం చేయడంలో మనం వెనుకబడ్డాం. ఇప్ప పూలతో తయారయ్యే సారా ఒక సంప్రదాయ పానీయం మాత్రమే కాదు , అది ఒక ఉపాధి అవకాశమూ. కానీ ఇప్పటికీ ఇది ‘ చట్టబద్ధం కాదు’ అనే ముద్రతోనే కొనసాగుతోంది. సరైన ప్రభుత్వ విధానాలు లేకపోవడం వల్ల ఈ విలువైన అటవీ సంపదను ఉపయోగించుకోలేక పోతున్నాం. వీటి అమ్మకాల్లో గిరిజనులు మధ్యవర్తుల చేతిలో నష్టపోతున్నారు. ఇది గమనించిన నేను బస్తర్ ఫుడ్స్ అనే సంస్ధను ప్రారంభించి బస్తర్ లోని మహిళలను ఐక్య పరిచి వారు అడవుల్లో సేకరించిన సహజ ఉత్పత్తులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి మార్కెట్ చేస్తున్నాం.’
ఇప్పపూల సేకరణలో చెట్లకు చీరెలు కట్టి సేకరిస్తున్న బస్తర్ ఫుడ్ సంస్ధ మహిళలు
మధ్యప్రదేశ్ చెప్పే పాఠం
‘ మన దేశంలో ఇప్ప (మహువా) పూలతో తయారు చేసే సారా అంటే ఇప్పసారా ను ప్రభుత్వ నియంత్రణలో చట్టబద్ధంగా ఉత్పత్తి చేసి విక్రయిస్తున్న ప్రధాన రాష్ట్రం మధ్య ప్రదేశ్. ఈ మోడల్ దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది, మా మహిళా సభ్యులు సేకరించిన ఉప్పపూవును మధ్య ప్రదేశ్ ఇప్ప సారా తయారీ కోసం వాడుతున్నారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం “ష్ట్రవతీఱtaస్త్రవ శ్రీఱనuశీతీ”గా మహువా సారాను గుర్తించింది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తయారు చేసిన ఇప్పసారా బాటిల్స్. ఇవి ఎయిర్ పోర్ట్స్‌లో విక్రయిస్తున్నారు.
గిరిజన ప్రాంతాల్లో (ప్రధానంగా బస్తర్ ప్రాంతం, మండ్లా, డిండోరి జిల్లాలు)
ఇప్ప (మహువా) పూలను సేకరిస్తారు మహిళా సంఘాలు, గిరిజన రైతులు పూలను ఎండబెట్టి నిల్వ చేస్తారు ప్రభుత్వ అనుమతితో ఉన్న యూనిట్లలో:
ఫెర్మెంటేషన్ (పులియబెట్టడం) డిస్టిలేషన్ (సారా తయారీ) చేసి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ బాటిళ్లలో ప్యాక్ చేస్తారు . ఇది సంప్రదాయ విధానాన్ని సంస్థాగతీకరించిన మోడల్ అని అటవీ ఉత్పత్తుల పై అధ్యయనం చేస్తున్న నిపుణుల అంటారు.’
ఈ పరిశ్రమలో ఎవరు భాగస్వాములు?
ఇది పూర్తిగా మల్టీ-స్టేక్‌హోల్డర్ మోడల్ . దీనిలో ముఖ్య భాగస్వాములు,గిరిజన మహిళా సంఘాలు . పూల సేకరణ, ప్రాథమిక ప్రాసెసింగ్ అటవీ సహకార సంఘాలు చేస్తాయి.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ లైసెన్సింగ్, నాణ్యత నియంత్రణ ను చూస్తాయి.
ఇప్పపూలను సోలార్ డ్రైయర్‌లో ఎండ పెడుతున్న మహిళలు
ప్రైవేట్ డిస్టిలరీలు (పర్మిట్‌తో) శుద్ధి, ప్యాకేజింగ్, మార్కెటింగ్ నిర్వహిస్తాయి’ అని వివరించారు రజియా.
ఇప్పసారా ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా?( సబ్ )
సానుకూల ఫలితాలు: 1. గిరిజనులకు ఆదాయం పెరిగింది, ఇప్ప పూలకు మంచి ధర లభిస్తోంది, మధ్యవర్తులు తగ్గారు.
2. సంప్రదాయానికి గౌరవం వచ్చింది. ముందు “అనధికార మద్యం”గా భావించినది ఇప్పుడు “హెరిటేజ్ ప్రాడక్ట” అయింది
3. ఎక్సైజ్ రెవెన్యూ రూపంలో ప్రభుత్వ ఆదాయం పెరిగింది.
4. నాణ్యత మెరుగైంది. ప్రభుత్వ నియంత్రిత ఉత్పత్తి వల్ల విషపూరిత మద్యం ప్రమాదం తగ్గింది.
ప్రతికూల అంశాలు:
1. మద్యం వినియోగం పెరిగే ప్రమాదం
గ్రామీణ ప్రాంతాల్లో వ్యసనం పెరిగే అవకాశం
2. సంప్రదాయ జ్ఞానం కమర్షియలైజేషన్
కార్పొరేట్ మోడల్ వల్ల గిరిజనుల అసలు హక్కులు తగ్గే ప్రమాదం
3. లాభాల అసమాన పంపిణీ
డిస్టిలరీలు, వ్యాపారులు ఎక్కువ లాభం పొందే అవకాశం
4. మహిళలపై సామాజిక ప్రభావం
ఆదాయం పెరిగినా, కుటుంబాల్లో మద్యం వినియోగం వల్ల సమస్యలు రావచ్చు
మధ్యప్రదేశ్‌లో ఇప్పసారా ప్రాజెక్ట్ రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది.
ఒక వైపు: గిరిజన ఆర్థిక వ్యవస్థకు బలం, అటవీ ఉత్పత్తులకు విలువ పెరిగి
గ్రామీణ ఉపాధి కలుగుతుంది.
మరో వైపు: మద్యం వ్యసనం ప్రమాదం, సామాజిక ఆరోగ్య సమస్యలు
ఇదీ ఇప్ప చెట్ల మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రయోగం మంచి చెడులు.
ఇప్ప సారాను “హెరిటేజ్ లిక్కర”గా గుర్తించి, గిరిజనులతో కలిసి ఉత్పత్తి చేసి, ఒక నిర్మాణాత్మక దిశగా అడుగులు వేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న తెలంగాణ, ఆంధ్రాలో అక్కడున్న ఇప్ప వనాలను పరిశీలించి అనుసరించవచ్చు..
ఇప్ప సారాలో ఏముంది?
ఇప్ప సారా ఆరోగ్య పరంగా కెమికల్ లిక్కర్ కంటే మెరుగైనదని కొందరు భావిస్తున్నారు. ఇది సహజ ఫర్మెంటేషన్ ద్వారా తయారవుతుందని నిపుణులంటారు కానీ ఇది కూడా ఆల్కహాల్ అన్న విషయం మర్చిపోవద్దు. కాబట్టి దీన్ని “హెల్త్ డ్రింక”గా కాకుండా, నియంత్రిత వినియోగంతో కూడిన సంప్రదాయ ఉత్పత్తిగా చూడాలి. ఆరోగ్యంపై దాని ప్రభావం కంటే, గిరిజనుల ఆర్థిక స్థితిపై దాని ప్రభావం చాలా ముఖ్యమైనది.
నిజానికి ఇప్ప చెట్టు చుట్టూ ఒక సంపూర్ణ ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చు. పూలతో సారా మాత్రమే కాదు, జ్యూస్, సిరప్, జామ్, గింజల నూనె, బయోఫ్యూయల్ వంటి అనేక ఉత్పత్తులు తయారు చేయవచ్చు. ఎకోటూరిజంతో కలిపితే “ట్రైబల్ ఎక్స్‌పీరియెన్స”గా ప్రపంచానికి పరిచయం చేయవచ్చు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే మార్గం.
అంతిమంగా ఒక ప్రశ్న మనం ఇప్ప చెట్టును కేవలం “సారా చెట్టు”గా చూసుకుంటామా? లేక “గిరిజనుల ఆర్థిక స్వావలంబనకు ప్రతీక”గా గుర్తిస్తామా? సరైన పాలసీలు, మార్కెటింగ్, బ్రాండింగ్ ఉంటే ఇప్ప చెట్టు గిరిజన ప్రాంతాల్లో బంగారు భవిష్యత్తును నిర్మించగలదు. లేకపోతే అది అడవుల్లోనే నిశ్శబ్దంగా ఎండిపోయే మరో కోల్పోయిన అవకాశంగా మిగిలిపోతుంది.

