ఇడ్లీకి నెగెటివ్ మార్కులు పడ్డాయి...ఇలా
x

ఇడ్లీకి నెగెటివ్ మార్కులు పడ్డాయి...ఇలా

ఇన్ని రోజులు మాంసాహార వంటకాలే జీవ వైవిధ్యానికి నష్టం కలిగిస్తాయని అనుకునే వారు.. కానీ తాజాగా కొన్ని శాకాహార వంటలు కూడా పర్యావరణానికి నష్టం కలిగిస్తాయని తేలింది.


మనం తినే శాకాహారం జీవ వైవిధ్యానికి ముప్పును కలిగిస్తాయా అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా దక్షిణ భారతంలో ప్రజలు రోజూ ఎంతో ఇష్టంగా తినే ఇడ్లీ ఈ జాబితాలో ఉండడం ఆశ్చర్యం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 151 ఆహర పదార్థాలకు పరిశీలించిన పరిశోధకులు వాటిలో ‘జీవ వైవిధ్య’ పాదముద్రలను గుర్తించారు.

వీటి ద్వారా నే అవి పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి ఎంతటి ప్రమాదమే ర్యాంకులు కేటాయించారు. ముఖ్యంగా శాఖాహార పదార్థాల కంటే మాంసాహార పదార్థాలతోని జీవ వైవిధ్యానికి ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని వెల్లడించారు. వాటితో పాటు మనం పండించే వరి, చిక్కుడు వంటి పంటల వల్ల కూడా ఎక్కువ నష్టం సంభవిస్తున్నట్లు వివరించారు.

ప్రస్తుతం శాస్త్రవేత్తలు గుర్తించిన టాప్ 25 వంటకాల్లో మన దేశ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే ఇడ్లీతో పాటు, చనా మసాలా, రాజ్మా, చికెన్ జల్రేపీజీ వంటివి ఉన్నాయి. " భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తున్న బియ్యం, చిక్కుళ్లు వంటివి ఈ జాబితాలో ఉండడం కొంచెం ఆశ్చర్యం కలిగించే అంశమే. అయితే వాటిని లోతుగా పరిశీలిస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి" అని పరిశోధనలకు నేతృత్వం వహించిన సింగపూర్ నేషనల్ యూనివర్శిటి బయోలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ లూయిస్ రోమన్ కరాస్కో మీడియాతో అన్నారు.

అగ్రస్థానంలో ఉన్న వంటకం ఏంటంటే..

ఈ జాబితాలో అగ్రస్థానంలో స్పెయిన్ కు చెందిన రోస్ట్ లాంబ్ రెసీపీ అయినా లెచాజోకు కేటాయించారు. ఇది అత్యధిక బయోడైవర్శిటీ ఫుట్ ప్రింట్ స్కోర్ ను కలిగి ఉంది. తరువాత స్థానంలో బ్రెజిల్ దేశానికి చెందిన నాలుగు మాంసాహార వంటకాలు ఉన్నాయి. ఆరవ స్థానంలో మనం తినే ఇడ్లీ ఉన్నాయి. రాజ్మా ఏడవ ర్యాంక్ లో ఉంది. ప్రతి వంటకు జీవ వైవిధ్య పాదముద్ర స్కోర్ లను కేటాయించే ముందు ప్రతి పదార్థానికి ఉపయోగించే పంట భూములలో జాతుల సమృద్ధి, వన్య ప్రాణుల శ్రేణిపై అవి ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయనే అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.

అతిపెద్ద జీవ వైవిధ్య పాదముద్రలు కలిగిన టాప్ 25 వంటలలో అనేక బ్రెజిలియన్ మాంసం వంటకాలు ఉన్నాయి. తరువాత కొరియన్ మాంసం, కూరగాయల వంటకం, మెక్సికో నుంచి పంది మాంసం వంటకాలు ఉన్నాయి.

అత్యల్ప జీవ వైవిధ్య కలిగిన వంటకం

ఫ్రెంచ్ ఫ్రైస్ కు అత్యల్ప జీవ వైవిధ్య ర్యాంకు 151ను కేటాయించింది. అలాగే బాగెట్, ప్యూరీడ్ టామాటో సాస్, పాప్ కార్న్ అత్యల్ప జీవ వైవిధ్య సంభావ్యతను కలిగి ఉన్నాయి. ఇక భారత దేశం నుంచి ఆలూ పరాటా 96 ర్యాంకులో, దోస 103, బోండా చిక్ పా పేస్ట్ తో వేయించిన బంగాళదుంప చిప్స్ వంటకం 109 ర్యాంకులో ఉన్నాయి. ఇటువంటి ర్యాంకులు జీవ వైవిధ్య ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో పర్యావరణ స్పృహ కలిగిన వ్యక్తులకు ఉపయోగపడతాయి.

ఇండియా గుడ్

బియ్యం, పప్పు ధాన్యాల వంటకాలు అత్యధిక స్కోర్ కలిగి ఉన్నప్పటికీ అధిక జనాభా కారణంగా జీవ వైవిధ్యంతో సహజీవనం చేయడంలో భారతదేశం విజయవంతమైందని కరాస్కో చెప్పారు. దేశంలో అత్యధిక సంఖ్యలో శాకాహారులు ఉండడం కూడా జీవ వైవిధ్యం కాపాడటానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఒక వేళ వీరంతా మాంసాహారానికి మారితే జీవ వైవిధ్యానికి ప్రమాదమేనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే జీవ వైవిధ్యంపై ఒత్తిడి మాత్రం అత్యధికంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు పేర్కొన్నారు.


Read More
Next Story