
నల్లమలలో మన్ననూర్ జంగిల్ : ప్రకృతి ఒడిలో మరిచిపోలేని అడవి యాత్ర
పచ్చని అడవులు, జలపాతాలు, పులుల సఫారీ… మన్ననూర్ జంగిల్ రిసార్ట్ ప్రత్యేకత
చుట్టూ కొండలు, గుట్టలు...లోతైన లోయలు...జాలువారుతున్న జలపాతాలు...పచ్చని ఎతైన చెట్లు... చెంగుచెంగున దూకే జింకలు...పులులు, చిరుతల గాండ్రింపులు...ఇదీ నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో మన్ననూర్ జంగిల్ రిసార్టు పర్యటనలో కనిపించే ప్రకృతి రమణీయ దృశ్యాలు. నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో ఉన్న మన్ననూర్ జంగిల్ రిసార్ట్ పర్యటనలో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి.తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మన్ననూర్ జంగిల్ రిసార్ట్ పేరిట డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ అటవీ సందర్శన యాత్రలు నిర్వహిస్తోంది. ఈ అడవి యాత్రలకు ప్రకృతి ప్రేమికులు,పర్యాటకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.
ఇవీ ఆకర్షణలు
పెరుగుతున్న సందర్శకుల సంఖ్య
టైగర్ సఫారీ: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో జరిగే అటవీ టైగర్ సఫారీ.చీతల్ జింకలు, అడవి పందులు, నీల్గాయ్, సాంబార్ జింకలు,చిరుతలు, అడవి కుక్కలు (డోల్స్) పులులు నివసిస్తున్నాయి. సందర్శకులకు ఈ అరుదైన వన్యప్రాణులను చూసే అవకాశం లభిస్తుంది.నల్లమల అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌లో పక్షుల కిలకిలారావాలు, అడవి జీవుల చలనం మధ్య ప్రత్యేకమైన అనుభూతి లభిస్తుంది.మన్ననూర్ జంగిల్ రిసార్ట్ లో చెంచు సంప్రదాయ మట్టి గుడిసె, ట్రీ హౌస్, ధ్రువ & సాంబార్ రస్టిక్ మట్టి గృహాలు, ఎరోకాన్ కాటేజీల్లో బస చేయవచ్చని అటవీ శాఖ అధికారి అఖిల్ చెప్పారు.

