మనిషి విలువ తెలుస్తుంది ‘మేక బతుకు’ చదివితే
x

మనిషి విలువ తెలుస్తుంది ‘మేక బతుకు’ చదివితే

మూడు ముక్కలో భూమన్ ‘మేక బతుకు’ పరిచయం



మేక బతుకులు చదివి రెండు రోజులైనా ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ ఉద్యోగం నుండి కుదుట పడలేకపోతున్నాను. ఏక బిగిన చదివించిన జీవన గాథ ఇది. అసలు పుస్తకాన్ని చదివినట్టే లేదు. అక్షరం అక్షరం వాక్యం వాక్యం వెంట అలుపు లేకుండా కళ్లు పరిగెత్తినట్టు గానే ఉంది. ఎంత అద్భుతంగా వుందీ అనువాదం. అస్సలు ఇది అనువాదం అంటే నమ్మ బుద్ధికాదు. అనువాదమని ముఖచిత్రంలో ఉండటం వల్ల ఇది అనువాదం. స్వర్ణ కిలారి గారు మూల రచనలోని ఆత్మని బంధించుకున్నాడు. సహవాసి, యం.వీ.ఆర్ అనువాదాలంటే బాగా ఇష్టపడే నేను ఇప్పుడే అనువాదాలంటే బాగా ఇష్టపడే నేను ఇప్పుడే అనువాదం ముందు అన్నీ దిగదుడుపేననిపిస్తున్నది. మేము అత్యవసర పరిస్థితి కాలంలో ముషీరాబాదు జైల్లో ఉండగా “ఘనతంత్రాలు – కుట్రలు” అనే అనువాదాన్ని చదివి భయపడిపోయినాము. THE GREAT CONSPIRACY కి అనువాదం అది. నేను, డా.ఎం.వి.ఆర్ ఆ అనువాదాన్ని తిరిగి అనువదించటం గుర్తొస్తున్నది.



బెన్యామిన్ ని చూసినాను. మాట్లాడినాను. ఈ అనువాదం చదివితే గాని అతడెంతటి గొప్పవాడో అర్థమయింది కాదు.

స్వేచ్ఛను కలిగిన ఒక పోరాటయోధుడి జీవితేచ్ఛ ఇది. ప్రాణం విలువ, బతుకు పోరాటం, జీవించాలనే ఇచ్ఛ, తపన, ఆకలి విలువ, మనిషి విలువ తెలుస్తాయీ ‘మేక బతుకు’ చదివితే.

నేను చదవటం చాలా ఆలశ్యమయింది. మీరింకేం ఆలశ్యం చేయకుండా చదివేయండి. మీకు మీరే దిగ్భ్రమకు గురవుతాడు. స్వర్ణ కిలారి లాంటి అద్భుత అనువాదకురాలిని కలగన్నందుకు బిత్తర పోతారు.మ


Read More
Next Story