యాపిల్ ఐ ఫోన్ 16 సీరీస్ పై ఎందుకింత ఆసక్తి.. ధర ఎంతంటే..
x

యాపిల్ ఐ ఫోన్ 16 సీరీస్ పై ఎందుకింత ఆసక్తి.. ధర ఎంతంటే..

"యాపిల్ ఐ ఫోన్ అంటే ఎలా ఉండాలంటే ఎవరైనా చూసిన వెంటనే నాలుకతో నాకేలా ఉండాలన్నది" ఆ కంపెనీ సీఇవో మాట.


"యాపిల్ ఐ ఫోన్ అంటే ఎలా ఉండాలంటే ఎవరైనా చూసిన వెంటనే నాలుకతో నాకేలా ఉండాలన్నది" ఆ కంపెనీ సీఇవో మాట. దానర్థం దాని ఫినిషింగ్ అంత మృదువుగా ఉండాలన్నది అంతసూత్రం. అందువల్లనే ఏమో ఐ ఫోన్లకు అంత గిరాకీ ఉంటుంది. తాజాగా యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐ ఫోన్ 16 సీరీస్ పట్ల ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా మోజు వ్యక్తమవుతుందనే దానికి నిదర్శనమే నిన్న ఒక్కరోజులోనే భారతదేశంలో సుమారు మూడు కోట్ల మందికి పైగా ఐఫోన్ ప్రియులు ఈ కొత్త ఫోన్ పై ఆరా తీశారట. ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఈ 16 సీరీస్ ను యాపిల్ కార్పొరేషన్ నిన్న మార్కెట్ కు విడుదల చేసింది. ఇందులో నాలుగు కొత్త మోడల్స్ ఉన్నాయి: iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max. ఈ ఫ్లాగ్‌షిప్ పరికరాలతో పాటు Apple ఆపిల్ వాచ్ సిరీస్ 10, అప్‌డేట్ చేసిన AirPods లైనప్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇవన్నీ iOS 18కి సంబంధించినవే. ఈ సందర్భంగా యాపిల్ కంపెనీ మరికొన్ని ఆఫర్లను కూడా కస్టమర్లకు అందిస్తున్నట్టు ప్రకటించింది.

ఆఫర్ వివరాలు

యాపిల్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం తాజా ఐ ఫోన్లు సెప్టెంబర్ 13 సాయంత్రం 5:30 నుంచి భారతదేశంలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించే కొనుగోలుదారులు తక్షణమే 5 వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఐఫోన్ 16 సిరీస్ విక్రయాలు సెప్టెంబర్ 20న ప్రారంభమవుతాయి. ఈ పరికరాలు ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, యాపిల్ అధికారిక వెబ్‌సైట్, యాపిల్ సాకెట్, యాపిల్ బీకేసీ సహా యాపిల్ రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంటాయి.

భారతదేశంలో ఐఫోన్-16 సీరీస్ ధర ఎంతంటే...

బేస్ ఐఫోన్ 16 మోడల్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందిస్తున్నారు. ఐదు రంగుల్లో ఈ ఫోన్లు ఉన్నాయి. వాటి ధరలు.. 128GB వెర్షన్ ధర రూ.79,900, 256 GB వేరియంట్ రూ.89,900, 512GB మోడల్ రూ.1,09,900గా ఉన్నాయి. అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ రంగుల్లో ఉండే ఐ ఫోన్ 16 సీరీస్ బాగా అమ్ముడవుతాయని కంపెనీ భావిస్తోంది.

ప్రామాణిక మోడల్ మాదిరిగానే ఐఫోన్ 16 ప్లస్ 3 స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. 128GB వెర్షన్ ధర ₹89,900, 256GB ఎంపిక ₹99,900, 512GB వేరియంట్ ₹1,19,900. ఇది ఐఫోన్ 16 మాదిరే అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ లలో ఉంటాయి. ఎక్కువ కాలం మన్నిక కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ ఈ సీరీస్ ఫోన్లు విడుదల అయ్యాయి. iPhone 16 Pro స్టోరేజీ అద్భుతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. 128GB వెర్షన్ ధర రూ ఒక లక్షా 19వేల 900. 256GB వేరియంట్ ధర రూ.1,29,900, 512GB ఎంపిక రూ.1,49,900, టాప్-టైర్ 1TB మోడల్ ₹1,69,900కి అందుబాటులో ఉంది.

ఈ మోడల్ డెసర్ట్ టైటానియం, వైట్ టైటానియం, నేచురల్ టైటానియం, బ్లాక్ టైటానియంతో సహా ప్రత్యేకమైన రంగులలో ఉంటుంది. ఫోన్ ఫినిషింగ్ లో యాపిల్ కి మించింది లేదన్నది సుదీర్ఘ కాలంగా ఆ కంపెనీ ఫోన్లను వినియోగిస్తున్న వారు చెబుతున్నారు. ప్రీమియం iPhone 16 Pro Max మోడల్ 3 స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. 256GB వెర్షన్ రూ.1,44,900, 512GB వేరియంట్ రూ1,64,900, 1TB మోడల్ ధర రూ.1,84,900. డెసర్ట్ టైటానియం, వైట్ టైటానియం, నేచురల్ టైటానియం, బ్లాక్ టైటానియం రంగుల్లో ఈ ఫోన్లు ఉన్నాయి.

Read More
Next Story