అడవి నుంచి అమ్మకు ఉత్తరం!
x

అడవి నుంచి అమ్మకు ఉత్తరం!

రచయిత ఆలూరు రాఘవశర్మ ‘అమ్మ’ కి రాసిన లేఖ



అమ్మా..నీకు తొలి సారిగా ఉత్తరం రాస్తున్నాను. అడవిలో కూర్చుని మరీ ఈ ఉత్తరం రాస్తున్నాను.
అడవంటే అమ్మ ఒడే కదా!
అమ్మ ఒడిలోనే కూర్చుని అమ్మకు ఉత్తరం రాయడం చాలా తమాషాగా లేదు!

'రేపు ఆదివారం అమ్మల దినోత్సవం' అని గీతాంజలి గారు అడవికి బయలుదేరే ముందు శనివారం సాయంత్రం చెప్పారు.
అందుకే అడవి నుంచే ఈ ఉత్తరం రాస్తున్నాను.

గీతాంజలి గారంటే నీకు తెలియదు కదా! నువ్వు ఉన్నంత కాలం నాకూ తెలియదు. నేను రాసిన నీ ముచ్చట్లను మురిపంగా భావించి లోకానికి చాటి చెప్పిన వారు.

నీ కడుపులో పడిన్నప్పటి నుంచి, ఈ అరవై ఎనిమిదేళ్ళుగా రోజూ నీతో మాట్లాడుతూనే ఉన్నాను.
ఇంత కాలం నాకు ఎన్ని కబుర్లు చెప్పావని!
నువ్వు చెప్పినవి ఏవీ ఊసుపోనీ కబుర్లు కావు. జీవిత పాఠాలు, నీ అనుభవ సారాలు.

ఏడాది క్రితం నువ్వు ఈ లోకం నుంచి నిష్క్ర మించి నప్పటి నుంచి నీలా నాతో మనసు విప్పి మాట్లాడేవాళ్లే కరువయ్యారు.
అమ్మ లేని అనాధనయ్యాను.
ఒంటరినై పోయాను.

నీ మాటలు, పాటలు, పలుకు బళ్ళు, జాతీయాలు ఎలా మర్చి పోగలను చెప్పు! నడక, నడత, భాష, భావం అన్నీ నీ నుంచి నేర్చు కున్నవే కదా!

ఈ మానవ లోకానికి ఇవన్నీ నేర్పింది అమ్మలే కదా! అసలు నువ్వే లేక పోతే ఈ నేల పైకి నే నెలా రాగలను చెప్పు!

ఈ కుటుంబాన్ని నిలబెట్ట డానికి ఎంత కష్టపడ్డావో కదా! ఎన్ని త్యాగాలు చేశావో కదా! అసలు ఎన్ని సార్లు ప్రాణాలను పణంగా పెట్టి ఇంత మందికి జన్మ నిచ్చావు!?ఎన్ని సార్ల ని ఈ జీవిత వైతరిణి నదిని ఈదావు!

నీ త్యాగాలను, సాలను మెచ్చి నీకు ఎవరేమిచ్చారని?
పోనీ ఒదిలేయమ్మా. ఒక ళ్లు ఇవ్వా లా నీకు? ఎప్పుడైనా ఇచ్చే దానివే కానీ , పుచ్చుకు నే దానివి కావు కదా!

అయినా ఈ ఉత్తరం లో కొన్ని విషయాలను గుర్తు చేసుకుం దాము.

" ఏమిటి రా! మా వియ్యంకుడు వాళ్ళమ్మను తీసుకు వెళ్ళి అనాథ శరణాలయంలో పడేశాడు! చీర కట్టుకునే నాకు నైటీలు తొడిగారని, తలలో పేలు పడ్డాయని గుండు కొట్టించారని కుళ్ళి కుళ్ళి ఏడ్చేదే!ఆమె చచ్చి పోయాక, అమ్మ పైన ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. దశ దిన కర్మ లు, వాళ్ళ పిండాకుళ్ళు అన్నీ పెడుతున్నారు. బతికుండగా అమ్మ ను చూడకుండా, ఇప్పుడు అందరి ముందరా అమ్మ గురించి ఈ
ఏడవడం ఏమిటి? వీళ్లు నాకు అర్థం కావడంలేదురా! మా చిన్నప్పుడు పిల్లలు లేక, గతి గడవక, ముసలి తనంలో వారిని అనాథ శరణాలయంలో పడేసే వారు" అని ఎంత బాధ పడ్డావో కదా!

"ఆడ పిల్లలికి ఇవ్వకుండా ఆస్తి రాయించు కున్న కొడుకులు అవసాన దశలో నయినా చూడక పోతే ఎలా?" అన్నావు. "అట్లాంటి వాళ్ళ మొహం చూస్తే పాపం వస్తుందని శాపనార్థాలు పెట్టావు గుర్తుందా అమ్మా!

"తొంభై ఏళ్ళు దాటితే అమెరికా కు రానివ్వరట నిజమే నా బాబు " అని అడిగావు. "అలాంటిది ఏమీ లేదమ్మా. మన ప్రేమావతి మేడం వాళ్ళ మేడం రాజేశ్వరి మూర్తి గారికి నూట మూ డేళ్ళు. అమెరికాలో నే ఉంది కదా!" అన్నాను.

"అయితే మా అక్కయ్య కు తొంభై ఏళ్ళు దాటాయని, అమెరికాకు రానివ్వరని, వచ్చినా అక్కడ చలికి తట్టుకోలేవని నమ్మించి తమ తో పాటు అమెరికా కు తీసుకు వెళ్ల కుండా, ఇక్కడ 'ఓల్డ్ ఏజ్ హోమ్' లో చేర్పించారు ఇదేమిటి రా! " అని అడిగావు.

" అసలు ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఏమిటి రా బాబూ " అని ప్రశ్నించావు గుర్తుందా !?
"మనం డబ్బులు కడితే ముసలాళ్లను వాళ్లే చూస్తారమ్మా" అన్నాను. పిల్లలకు దూరంగా ఉండాలననుకునే వాళ్ళు , అమ్మకు దూరంగా ఉండాలననుకునే వాళ్ళు ముసలి వాళ్ళ అంతిమ నివాసం అది.

"ఓల్డ్ ఏజ్ హోమ్ కు, అనాథ శరణాలయానికి తేడా ఏమిటి రా నాన్నా" అని అడిగావు గుర్తుందా అమ్మా!? "డబ్బులు కడితే 'ఓల్డ్ ఏజ్ హోమ్', కట్ట లేక పోతే అనాథ శరణా లయం. తేడా అంతే "అన్నాను.

"ఆహా .."అని ఆలోచనలో పడ్డావు.
"వాటి గురించి ఆలోచించవలసిన అవసరం నీకెందుకు చెప్పు!? వాటి అవసరం నీకు రానివ్వను" అన్నాను. "నా గురించి కాక పోయినా అసలు నవ మాసాలు మోసి కని, పెంట లెత్తి, ఉచ్చ లెత్తి పెంచిన వాళ్ళ గురించి ఆలోచించాలి కదా " అన్నావు. "అవును ఆలోచించాలి " అన్నాను.

ఒక సారి మన ఇంటికి బంధువులు వచ్చారు. "ఈ పూట ఇక్కడే భోజనం చేసి వెళ్లండి" అన్నావు.
వెనుక వీధిలో ఉన్న నీ కోడలిని పిలిచి "ఈ పూట ఇక్కడే వంట చేయమ్మా " అన్నావు.

"అయ్యో బయట చేరానండి అత్తయ్య గారు" అన్నది."స్నానం చేసి వచ్చెయ్యమ్మా " అన్నావు.
"మీ అబ్బాయి ఒప్పుకోరండి" అన్నది నీ కోడలు.

నేను వంట చేస్తానం టే, వచ్చిన బంధువులు వద్దంటే వద్దన్నారు.
ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్ట కుండా పంపించా నని ఎంత బాధ పడ్డావో నేను గమనించాను.

అంతా వెళ్ళి పోయాక , "కంప్యూట ర్ మనుషులు " అన్నావు.
వెంటనే నాకు బల్బు వెలగ లేదు.
తరువాత అర్థంచేసుకున్నాను. కంప్యూటర్ లో మనం ఫీడ్ చేసిన వే వస్తాయని.

ఏ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పాలి? అని ముందు గానే మెదడు కంప్యూట ర్ లో ఫీడ్ చేసి పెట్టుకుంటారు.అమ్మా..నువ్వు ఎంత సూక్ష్మం గా గ్రహిం చావు!
నా బుర్రకు అంత తట్ట లేదు.

నేను బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నప్పుడు ఆశ గా చూసే నీ చూపులను గమనించి "నీ చీర లే మైనా ఇస్త్రీ చేయ మం టా వా?" అని అడిగాను.
"జరీ చీర లకు అంచులు చేస్తే చాలు. రోజూ కట్టుకునే చీరలకు ఇస్త్రీ ఎందుకు బాబూ?" అనే దానివి.

జరే చీరలు పూర్తిగా ఇస్త్రీ చేసి ఇస్తే, చీరలను నిమురుతూ ఎంత ముచ్చట పడే దానివో, నాకు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడు తునే ఉంది .

చీరలు అంటే గుర్తొచ్చింది.
నా చిన్నప్పుడు నీకు మూడే మూడు చీరలు ఉండేవి.
ఎరుపు, నీలం, ఆకుపచ్చ.
ఆ మూడు రంగు లే నీకు సప్త వర్ణాలు.

నీ కొంగు పుచ్చుకుని నీతో పేరం టా నికి వస్తే, అంతా నగలు, రంగు రంగుల పట్టు చీరలతో వచ్చి కూర్చునే వారు. వాళ్ళ లో నీవు ప్రత్యేకంగా కనిపించే దానివి.
అంత మంది ఉన్నా " విమ లమ్మ గారు ఒక పాట పా డం డి" అని అడిగే వారు.

నగలు, పట్టు చీరలు లేక పోయినా తెల్లగా మిసమిస లాడుతూ అందంగా వెలిగి పోయే దానివి!
నువ్వు మా అమ్మ వై నందుకు ఎంత గర్వంగా ఉండేదో తెలుసా!

నీ పిల్ల లంతా సంపాదన లోకి వచ్చాక నీవు నగలు ఇష్ట పడక పోయినా బీరువా నిండా నేత జరీ చీరలే! నా బట్టల కోసం బీరువా తెరిస్తే చాలు, ఇస్త్రీ చేసిన జరీ చీరలు అన్నీ నా పాదాల పైన పడిపోయేవి.

అయ్యో.. నిన్ను అలంకరిం చే చీరల పాదాల పైన పడ వలసిన నేను, అవే నా పాదాల పైన పడడ మేమిటి!? అని ప్రతి సా రీ బాధ ని పించేది.

"పండు సార్ వాళ్ళమ్మ పోయాక కాస్త లావయ్యారు." అని అడవిలో ఒకరిద్దరన్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. అడవిలో నన్ను 'పండు సార్' అని పిలుస్తారు.
ఈ విషయం నీకు తెలియదు కదా!
నీకే కాదు నా తో అడవి కి వచ్చే వాళ్ళకు తప్ప బయట ఎవరికీ తెలియదు.

వాళ్ళు చేప్పే వరకు నేను లావయ్యానని గమనించ లేక పోయాను. "నిజమే అన్నయ్యా, అమ్మ పోయాక కాస్త లావయ్యా వు" అంది మా చెల్లెలు.

నువ్వు పోయాక నిజంగా నేను జీవించడం లేదు. పని చేస్తే నే కదా జీవించి నట్టు ఉండేది!
నువ్వు ఉన్నప్పుడు నా పొట్ట అంటుకుని పోయి ఉండేది. నువ్వు నిద్ర లేచి నప్పటి నుంచి పడుకునే వరకు నీ పనుల్లో బొంగరంలా తిరిగే వాణ్ణి.

నువ్వు మొహం కడుక్కోవడానికి వరండాలో పైపు దగ్గర కుర్చీ వేసే వాణ్ణి. పేస్ట్, నాలిక బద్ద పెట్టే వాణ్ణి.
కాఫీ తాగాక కబుర్లు చెపుతూ, నేను చదువు తున్న పేపర్ లాక్కు ని మ రీ చదివే దానివి.

స్నానానికి వేడి నీళ్ళు సిద్ధం చేస్తే, " ఆ గవర్నర్ గారు ఎప్పుడు వస్తారు? నాకు నీళ్ళు ఎప్పుడు పోస్తారు?" అనే దానివి భాను గురించి.

ఒక సారి అన్నావు కదా " ఆడ పుట్టుక పుట్టి చచ్చానే. స్నానం కూడా వాడి చేత ఎక్కడ చేయిం చుకు చచ్చే ది" అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తు.

స్నానం చేయందే మందులు వేసుకుని టిఫిన్ తినే దానివి కాదు.
స్నానం చేయక పోయినా టిఫిన్ తినే యమ్మా అంటే , వినే దానివి కాదు.

టిఫిన్ కు ముందు, తరువాత మందులు ఇచ్చే వాణ్ణి. ఒక్క మందుల విషయంలోనే నన్ను కూడా నమ్మే దానివి కాదు.
మందులను గుడ్డిగా గుర్తు పెట్టు కు ని నిర్ధారించుకునే దానివి.

ఇక నా పని నేను చేసుకుంటూ ఉంటే నీకు తోచేది కాదు.
కొబ్బరి నీళ్ళు ఇచ్చే వాణ్ణి.
"రోజుకు రెండు కొబ్బరి బొండాలు తాగు తున్నా. అసలు ఎంత అవుతోంది?" అని చాలా సార్లు అడిగావు.ఎంత అయితే నీకు ఎందుకు అని మందలించి నట్టు మాట్లాడే వాణ్ణి. అలా అన్నందుకు తరువాత బాధ పడే వాణ్ణి.

వరండా లోకి ఎండ రాగానే కుర్చీ వేస్తే వచ్చి కూర్చునే దానివి.
పొరపాటున ఒక ఇన్సులిన్ బదులు మరొకటి తెచ్చు కొం టే, "నల్ల ఇంజక్షన్ బదులు తెల్ల ఇంజక్షన్ తెచ్చు కున్నావేమిటి రా?" అని ఎన్ని సార్లు గుర్తు చేయలేదు!
నీ జ్ఞాపక శక్తి అమోఘం.

మధ్యాహ్నం భోజనం చేశాక నడుము వాల్చే దానివి.
నీ మంచం ఎదురుగా ఉన్న చెక్క ఉయ్యాల లో నేను కూడా నడుము వాల్చే వాణ్ణి.

సాయంత్రం లేవ గానే మళ్ళీ కాఫీ తాగుతూ కబుర్లు. ఊళ్లో నే ఉన్న నీ పిల్లలం తా వచ్చి అటెండెన్స్ వేసుకుని తీరాలిసిందే.
ఏ ఒక్కరు రాక పోయినా నా దే బాధ్యత అన్నట్టు ఫోన్ చేసే వరకు నా ఊపిరి తీసే దానివి.

రాత్రి కి నా పడక గదిలో కి వెళ్ళి పడు కుంటే , " భయం వేస్తోంది రా బాబూ ఉయ్యాలలోనే పడుకో రాదా " అని ఎన్ని సార్లు అడగ లేదు. నీ మాట కాదన లేక కొన్ని సార్లు పడుకు ఉన్నాను.

ఉయ్యా ల్లో రాత్రి అంతా వెల్ల కి లా పడుకోవడం కష్ఠం. పక్కకు ఒత్తిగిలి పడుకో డానికి సాధ్యం కాదు.

అమ్మా..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కబుర్లు! నీతో గడిపిన కాలం మాత్రమే నాకు నిజమైన జీవించిన కాలం.

నా మిత్రుల తో కలిసి అడవిలో పునర్జన్మ విమోచన తీర్ధా నికి వచ్చాను. జీవన కష్టాలు భరించలేక, మరొక జన్మ వద్ద ని కోరుకునే ఈ తీర్థం లో మునుగు తారు.అలా పుట్టు కొచ్చిందేపునర్జన్మ విమోచన తీర్థం పేరు.

లేని పునర్జన్మ ను ఉన్న దని ఊహిం చు కుని, తమని తాము ఇలా ఓ దార్చు కుంటారు పాపం.

నేను బతికి నంత కాలం నిన్ను బతికి స్తానని నీ కొక మాట ఇచ్చి నిల బెట్టు కో లేక పోయాను.
అమ్మా..నన్ను క్షమి వస్తావా?
లేని పునర్జన్మ ఉంటే ఎంత బాగుంటుంది!మళ్ళీ నీ కడుపున పుట్ట డానికి. నీ కిచ్చిన మాటను నిలు బెట్టు కో డానికి.

నువ్వు నన్ను వదిలి వెళ్లి పోయిన దుఃఖం నుంచి నన్ను నేను ఓదా ర్చు కో డాని కే ఈ మాటలు.
ఈ ఉత్తరం ఇంక రాయ లేను.
అమ్మల దినోత్సవం అంటే దినాలు పెట్టడం, తద్దినాలు పెట్టడం అనుకొంటారు పాపం.
నేను మాత్రం అమ్మల దినోత్సవం అంటే నీ గుండె ల పై చెవి పెట్టి నీ గుండె ఘోష ను విన డం.
నా ఆత్మ ఘోష ను నీకు వినిపించ డం. ఇదిగో ఇలా.

అమ్మా.. దుఃఖం వస్తోంది.
సెలవా మరి.
నీ కడుపున పుట్టిన
రాఘవ శర్మ


Read More
Next Story