దేశంలో ఎన్నడూ లేనంత సాంస్కృతిక సంక్షోభం
x
విజయవాడ విరసం సభల్లో ప్రసంగిస్తున్న జనసాహితి అధ్యక్షుడు దివికుమార్

దేశంలో ఎన్నడూ లేనంత సాంస్కృతిక సంక్షోభం

చట్ట వ్యతిరేకంగా సాగిన కోళ్ల పందాలను విస్మరించి రాజ్యాంగ పరంగా సాగుతున్న అంగన్ వాడీ సిబ్బంది సమ్మె మీద ఎస్మా ప్రయోగించడం ఏ రాజ్యాంగ పాలన అంటున్న దివి కుమార్


విజయవాడలో జనవరి 27,28 తెేదీలలో జరిగిన విప్లవ రచయితల సంఘం (విరసం) 29వ మహాసభలో సౌహార్ద్ర ప్రతినిధిగా హాజరయిన ప్రముఖ రచయిత దివికూమార్ మాట్లాడుతూ ప్రస్తుతం మనం అత్యంత సంక్లిష్ట సంక్షోభ సాంస్కృతిక వాతావరణంలో విరసం సభలు జరుగుతున్నాయని చెబూత 75 సంవత్సరాల క్రితం నిజమైన ప్రజాస్వామిక మార్పు సంభవించకపోవడం వల్ల కూడా దినదినం మరింత పతన విలువలను, మన సమాజం చవిచూస్తోందని అన్నారు.

ఆయన ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు

• గడచిన 50 ఏళ్లకు పైగా మన దేశంలో క్రైసిస్ మేనేజ్మెంట్ గవర్నమెంట్స్ (Crisis Management Governments) ని మాత్రమే చూస్తున్నాము. భారత రాజ్యాంగంలోని ప్రజా అనుకూలమైన హక్కులు, ప్రజాస్వామిక రక్షణలు, పౌర స్వేచ్ఛలు , ఆర్టికల్ 51 ఏ (హెచ్) లాంటి వాటి పట్ల పాలకులకు ఇసుమంత గౌరవం లేదు. తమకు అవసరమైనప్పుడు చట్టాన్ని ఉల్లంఘించడానికి పాలకవర్గాలు ఎప్పుడూ సిగ్గుపడలేదు. ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా గోదావరి జిల్లాల ప్రాంతంలో గత సంక్రాంతి కాలంలో చట్ట విరుద్ధంగా కోడి పందాలు విపరీతంగా సాగాయని ఏ రాజ్యాంగ పరిరక్షకులకు తెలియదు? పాలకవర్గాలు చట్టాన్ని ఉల్లంఘిస్తే పట్టించుకోని ప్రభుత్వాలు, వారి యంత్రాంగం... ఎస్మా చట్టాన్ని ప్రయోగించి అంగన్వాడి వర్కర్ల ఆందోళనను అణచివేస్తున్నారు.

• మెట్టు మెట్టుగా ఎన్నికల వ్యవస్థ దిగజారిపోవడం కొనసాగుతున్న వ్యవస్థీకృత ఆర్థిక, రాజకీయ సంక్షోభకు ఒకానొక ఫలితమే. ఎన్నికల సందర్భంలో నోట్లను నడిబజారుల్లో పరిచి, మద్యాన్ని కాలువలుగా పారించి ఓట్లను పొందే ప్రక్రియ బహిరంగ రహస్యమే!

• అంత: సత్యమేమిటంటే అప్రజాస్వామికమైన కులమత తత్వాలు ప్రజాస్వామిక రూపమైన ఎన్నికల ప్రక్రియ ద్వారా బలోపేతం కావడం!!

• రాజ్యాంగ నిర్ణయక సభ ముగింపు సమావేశంలో అంబేద్కర్ వెలుబుచ్చిన మౌలిక ప్రజాస్వామిక విలువలను, మొత్తంగా ఆయన స్ఫూర్తిని నిలువులోతు భూమిలో పాతిపెట్టి, ఆయన మూర్తిని మాత్రం ఆకాశమెత్తు ప్రదర్శిస్తున్నారు.

• ప్రజల నడుమ ఉన్న కుల మత ప్రాంతీయ వైరుధ్యాలను విద్వేషాల స్థాయికి పెంచి వారిని అనైక్యపరచి తాము సురక్షితంగా ఈ అసమానతల వ్యవస్థను కాపాడుకోవాలని చూస్తున్నారు.

• ప్రశ్నించే గొంతులను, అప్రజాస్వామ్యాన్ని ఖండించే కలాలను, జర్నలిస్టులను, కవులను, కళాకారులను మేధావులను, హక్కుల కార్యకర్తలను... భయోత్పాతానికి గురిచేస్తూ నిర్బంధాలపాలు గావిస్తున్నారు.

• ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా నిజమైన ప్రత్యామ్నాయం ఒక్కటే ఉంది! అది సంఘటిత ప్రజా ఉద్యమం మాత్రమే!!



Read More
Next Story