ఇది అబద్ధాల ఫ్యాక్టరీ   అని చెప్పక్కర్లేదు!
x
వైద్య వ్యాపారంపై రేఖా చిత్రం

ఇది అబద్ధాల ఫ్యాక్టరీ అని చెప్పక్కర్లేదు!

సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలు ఎన్నో.. అందరికీ అన్నీ తెలిసినా ఎవ్వరూ ప్రశ్నించక పోవడం, ప్రశ్నించే వారి నోరు మూయించడం ప్రస్తుతం రివాజుగా మారిందని ప్రముఖ కవి తమ్మినేని అక్కిరాజు ఆవేదన.


ఇది కులాల దేశమని

కుల వివక్షలెక్కువని
ఎవరో చెప్పక్కరలేదు!
కుల మతాలచుట్టూ
రాజకీయాలుంటాయని
ఎవరో చెప్పక్కరలేదు!
నాయకుల(MP,MLA,MLC)
ప్రజాసేవ విలువ వేల కోట్లని
ఎవరో చెప్పక్కరలేదు!
వీళ్ళ కార్లు టూర్లు దర్జాలు
సామాన్యుల కన్నీటి బొట్లని
ఎవరో చెప్పక్కరలేదు!
దేశందరిద్రంలోమొదటి స్థానం
అభివృద్ధికి ఆమడదూరమని
ఎవరో చెప్పక్కరలేదు!
విద్యలో దీని స్థానం
తీసికట్టు నాగంబొట్టని
ఎవరో చెప్పక్కరలేదు!
వైద్యం కోట్ల వ్యాపారం
సేవ అన్నమాటే లేదని
ఎవరో చెప్పక్కరలేదు!
ఇంక 'న్యాయం' అంటారా!
న్యాయమూర్తి ఇంట్లో కోట్లు
ఎవరో చెప్పక్కరలేదు!
విద్య వైద్యం న్యాయం ఇలా
అమ్ముడు బోతూ ఉంటే
ఈ'మట్టి'పవిత్రమని
ఇక్కడి ప్రవచన కర్త
గొంతు చించుకుంటాడు!
నిత్యం హింస అశాంతి
చెలరేగిపోతుంటే
శాంతి అహింసల దేశమని
పక్కదారి పట్టిస్తాడు!
అబద్ధాల ఫ్యాక్టరీని
నడపడంలో ఇక్కడి
మనువాదులు సమర్థులని
ఎవరో చెప్పక్కరలేదు!
సామాన్యుల రక్తంపీల్చే
నరరూప రాక్షసత్వం
ఇక్కడినాయకత్వం అని
ఎవరో చెప్పక్కర లేదు!
***
-తమ్మినేని అక్కిరాజు
హైదరాబాద్
Read More
Next Story