
Loner by Vane Kosturanov
నేనేనా ఈవేళా..!
నేడు ప్రపంచ కవితా దినోత్సవం
-వంగల సంతోష్
పున్నమి రాతిరి వెన్నెల కాంతుల్లో
ఒంటరిగా నిలబడ్డ వాడిని
నా ఛాయ నన్ను వీడకుండా
వెంబడిస్తూనే ఉన్నది
అయినా
నేను ఎప్పడు ఒంటరిని అని
నాకు అనిపించలేదు
నేను ఇలా ఉండడం
బహుశా ఇది మొదటి వేళ కావచ్చు ..?
ఇది నేనేనా ఈవేళా అనుకుంటున్న
నా మనసు ప్రశ్నల కొలిమికి
చిక్కటి అమావాస్య రోజులను
నా ఎదకు గుర్తు చేసింది
అప్పటి ఒంటరి బందీ ఖానాలో
ఎప్పడు నేను ఒంటరినని అనిపించలేదు
ఈ విశాల ప్రపంచమంతా
నా చుట్టూ ఉన్నదనిపించింది
కానీ
ఈరోజు ఎందుకో
నన్ను నేను కోల్పోయినా వ్యక్తిగా
ఈరోజు ఉన్నది
ఇది నేనేనా అనిపిస్తోంది..?
అక్షరాల అల్లిక పదాల్లో
ఓనమాలు దిద్దుతున్న చోట
ఆకలి ఆక్రందనలకు చలించే
తత్వాన్ని నేర్చుకున్న వాడిగా
అష్టవంకర్లుగా ఉన్న ఈ అస్తవ్యస్థ వ్యవస్థలో
మనిషిని మనిషిగా చూసే రోజు కోసం
కలలు కన్న నా స్వేచ్ఛా జీవితంలో నే
కదా
నేను నేనై జీవించేది..
Next Story