సాహిత్య చర్చలతో, ఆవిష్కరణలతో ముగిసిన రచయితల పిక్నిక్
94 మంది కధా రచయితలు , కవులు , నూతనంగా కలం పట్టి రాయాలని అనుకుంటున్న వారు హాజరు
పొత్తూరురాజేంద్రప్రసాద్ వర్మ
కథా చర్చలు , ఆవిష్కరణలతో సాగిన రచయితల పిక్నిక్ కధారచయితలు కవులు వందమంది వరకు ఒక దగ్గర కలిస్తే వారి సందడే వే రు. నేటి పత్రికల తీరుతెన్నులు కధా రచనలో వస్తున్న కొత్త కొత్త పరిణామాలు కవిత్వంలో నూతన పోకడలు వంటి అనేక విషయాలు వారి చర్చల్లోకి వ స్తాయి. అటువంటి అరుదైన ప్రయత్నం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో ఉన్న కళాసాహితి సంస్థ నిర్వహించింది.
డిసెంబర్ 1 ఆదివారం నాడు ముందస్తు సమాచారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న 94 మంది కధా రచయితలు , కవులు , నూతనంగా కలం పట్టి రాయా లని అనుకుంటున్న వారు హాజరయ్యారు. కథా రచయిత పిక్నిక్ పేరుతో జరి గిన ఈ సమవేశం రచయితల్ని ఆకట్టుకునే విధంగా ఆరు చిరు నమావేశాల తో జరిగింది వచ్చిన వారందరికీ కళాసాహితి సంస్థ ఎటువంటి ప్రవేశ రుసుం లేకుండా ఉదయం సాయంత్రం అల్పాహారం టీలు మధ్యాహ్న భోజనాన్ని అందించి వారికి సాహిత్యంపై ఆసక్తిని అనురక్తి కలిగించింది.
శ్రీకాకుళం విజయ నగరం విశాఖ జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా రచ యితలు కవులు హాజరయ్యారు వివిధ ప్రాంతాల నుంచి భీమిలికి ఉదయం 9 గంటలకే చేరుకున్నారు. మొదటి కార్యక్రమం ఎం. కోటయ్య స్వాగతంతో ప్రారంభమైంది. ఈ మొత్తం కార్యక్రమం కళాసాహితి వ్యవస్థాపక అధ్యక్షులు పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ అధ్యక్షతన జరిగింది.
నాలుగు విడతలుగా జరిగిన ఈ సమావేశంలో రయితలు తమ ఆలోచనలు అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు. ఈకార్యక్రమంలో కొత్త పరిచ యాలు పలకరింపులతో ఆనందాలు వెల్లివిరిసాయి. మొదటి విభాగంలో ర చయితల పరస్పర పరిచయ కార్యక్రమం చేసుకున్నారు. పెనుగోండ నుంచి వచ్చిన ఎం.ఆర్.వి సత్యనారాయణమూర్తితో ప్రారంభించి శ్రీకాకుళం నుంచి వచ్చిన కుదుమ తిరుమలరావుతో ముగిసింది.. రెండవ సమావేశంలో కొత్త ర చయితలకు ఉపయోగపడే విధంగా ఉపన్యాస చర్చా కార్యక్రమాన్ని నిర్వహిం చారు. రచయిత్రి పి.ఎన్.ఎస్ లక్ష్మి నేనెందుకు రాస్తున్నాను. అనే విషయంలో చాలామంది కధారచయితలు పేరు కొసం డబ్బు కోసం రాస్తుంటారని కానీ సమాజంలో కోసం రాయాలని వివిధ విషయాలను చెప్పారు.
అనకాపల్లికి చెందిన మాధవీ సనారా, కధా రచనలో ఇతివృత్తం ఎలా ఎంపిక చేసుకుంటారు అనే అంశంలో నిత్య జీవితంలో జరుగుతున్న సంఘటనలు పత్రికావార్తలు క ధలుగా ఎవరెవరు ఎలా మార్చారన్న విషయాలను తెలియజేసారు. డా. ఎం సుగుణారావు కధా రచనలో మెలకువలు , చెబుతూ తెలుగు సాహిత్యంలో చా లామంది రచయితలు రాసిన కధల్లో ఎటువంటి మలుకువలు ఉన్నాయో వా టిని వివరించారు. మరువాడ భానోజీరావు మొదటి కధ అనుభవం ఎలా ఉం టుంది అనే విషయాలను తెలియజేసారు అనేక మంది రచయితలు తమ మొ దటి కధలను ఎలా రాసారన్న విషయాలను కూడ తెలిపారు.
కొయిలాడ రా మ్మోహనరావు రచనా శైలి , కధా రచనా పద్ధతులు , గురించి చెప్పగా బండి సత్యనారాయణ నేటి కధలు తీరుతెన్నులు అనే అంశాలపై వివిధ రచయితల రచనా పద్ధతులను తెలియజేసారు. ఈ కార్యక్రమం పలువురు కొత్త రచ యితలను ఆకట్టుకుంది చాలామంది తమ సందేహాలను తీర్చుకున్నారు. ఉప న్యాస కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆర్ అప్పలనర్సయ్య , ఎ సన్యాసిరాజు సంధాన కర్తలుగా వ్యవహరించారు.
పలువురు రచయితలు తమ అనుభవాలను సందేహాలను తెలియజేసారు. మూడవ విభాగ సమావేశం లో నలుగురు రచయితలు రాసిన రచనలను పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ ఆవిష్కరించారు. ఎం. సుగుణారావు రాసిని ఫైనల్ డయాగ్నెసిన్ , నవ ల కె. రామ్మోహనరావు రాసిన ఎదురులేని ఏడు , నవల బి. లక్ష్మీ గాయత్రి రాసిన పెళ్లి పుస్తకం నవలలను ముందు ఆవిష్కరించారు. అనంతరం పోలి పల్లి శ్రీనివాసరావు రాసిన పూలబాట శతకాన్ని వర్మ ఆవిష్కరిస్తూ నవల ప్రా రంభం ఆకట్టుకనేలా ఉండాలని చెబుతూ... నేను పుట్టకముందే నామీద హ త్యాయత్నం జరిగింది అనే వాక్యంతో నవల ప్రారంభం అయితే చదవడానికి ఉ త్కంట కలగుతుందని ఇంకా చదవాలని అనిపిస్తుందని అన్నారు. భోజన వి రామం అనంతరం భీమిలిలో చారిత్రక ప్రాంతాలు కట్టడాలను సందర్శిం చే కార్యక్రమాన్ని ఎ. కిషోర్ , శ్రీనివాసరావు తంబిల ఆధ్వర్యంలో నిర్వహించారు.
13 ప్రాంతాలలో ఈ సందర్వన జరిగింది అతి పురాతన దేవాలయాలు గంటస్థబంభం , లైట్ హౌస్ , డెచ్చి సమాధులు , సౌరీశ్ ఆవ్రమం , ఎస్.ఓ.ఎస్ అనా ద శరణాలయం , ఇంపీరియల్ బాంకు పురాతన భవనం వంటివి రచయితలు చూసి వాటి చారిత్రక నేపథ్యాలను తెలుసుకున్నారు. అనంతరం ముగింపు సమావేశం మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించి రచయితలందరికీ పత్ర్యేక బేగ్లో కధా సంకలనాలను కళాసాహితి తరుపున అందజేసారు. ఈ కార్యక్రమం మంచి అనుభవాన్ని మిగిల్చిందని దామరాజు విశాలాక్షి అనే రచ యిత్రి అరపల్లి గోవిందరాజులు , కోనే నాగ వెంకట ఆంజనేయాలు , కుదుమ తిరుమలరావు , లంక అప్పలస్వామి గంపా శ్రీదేవి , మళ్లీశ్వరి , రేపల్లి ఈశ్వరరా వు , కోరాడ అప్పలరాజు , విజయారావు , మరువాడ భానోజీరావు , కుదుమ తి రుమలరావు ఎంఆర్వి సత్యనారాయణరావు , నిర్మలరాజు తదితర రచయిత
లు పేర్కొన్నారు.