‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’  విశ్వనాథ ‘వేయి పడగలు’  పోలిక
x

‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ విశ్వనాథ ‘వేయి పడగలు’ పోలిక

ఓ 30-35 ఏళ్ళ తేడాలో ఇద్దరు ఖండాంతర రచయితలు ఎంతో దగ్గర పోలికలున్న రచనలు చేశారు.


-రామ్. సి

నేను చదివిన సాహిత్యం తక్కువ. నేను కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ (Viswanatha Satyanarayana) 'వేయి పడగలు' (Veyi Padagalu) చదివాను, కొలంబియా నోబెల్ రచయిత గార్షియా మార్క్వెజ్ (Gabriel García Márquez) రాసిన One Hundred Years of Solitude ((OHYS) సినిమా రూపాలన్ని OTT లో చూసాను. ఓ 30-35 ఏళ్ళ తేడాలో ఇద్దరు ఖండాంతర రచయితలు ఎంతో దగ్గర పోలికలున్న ఓ విశిష్ట రచన రాయడం, అలా జరగడం వెనుక ఎదో సంబంధం ఉంటుందని నా నమ్మకం. రెండూ మనిషి కథలే.

గేబ్రియల్ గార్షియా మార్క్వెజ్, విశ్వనాథ సత్యనారాయణ

OHYS, 'వేయి పడగలు' రెండు అద్భుతమైన బహు తరాల కుటుంబ గాథలు, కాలం, భౌగోళికం, సాంస్కృతిక పరిమితులను అధిగమించి నిలిచే సాహిత్య కథా ఆణిముత్యాలు. 20వ శతాబ్దపు లాటిన్ అమెరికా (Latin America) లో వలసీకరణ (colonolisation)ని మార్క్వెజ్ , తొలినాళ్లలోని స్వాతంత్ర అనంతర భారతదేశం గురించి విశ్వనాథుడు రచించిన తీరు తమ సొంత సంస్కృతులకు ప్రామాణికంగా ఉంటూనే, మానవ జీవితపు సాధారణ పోరాటాలను ప్రతిబింబిస్తాయి.తరాలకు అద్దమై నిలిచిన నిధి.

రెంటిలోనూ నేను చుసిన కొన్ని పోలికలు

-బహు తరాలకు సంబంధించిన కుటుంబ కథలను చెప్పడం ద్వారా, వారి సంస్కృతుల్లోకి లోతుగా వెళ్లి ,తాత్విక, సామజిక, కాల్పనిక ప్రక్రియలను సాహిత్యంలో చెప్పిన శైలి ఒక్కటే.

-వేయి పడగలు, బ్రిటీష్ కాలనీయ భారతదేశంలో గ్రామీణ కుటుంబం ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సంక్షోభాలను సుబ్బన్న పేటలో ఆవిష్కరిస్తుంది. అదే విధంగా, OHYS, లాటిన్ అమెరికాలోని మాకండో (Mocando) అనే సామాజిక -రాజకీయ పరిణామాలకు ప్రతీకగా బుయేండియా(Buendía family) కుటుంబ కథను చెబుతుంది.

-రెండింటిలోనూ కుటుంబాలు శ్రేయస్సు, సాంస్కృతిక సంపదను ఆస్వాదిస్తాయి, కానీ చివరికి దిగజారుతూ ఎలా పతనమౌతాయి,కాలం సమాజంలో విస్తృతమైన మార్పులను ఎలా సూచిస్తుందని

-సంప్రదాయాలు vs ఆధునికతను, వేయి పడగలు కనుమరుగవుతున్న రాజరికాలు, విస్తరిస్తున్న కాలనీల పాలన ద్వారా ప్రవేశపెట్టిన ఆధునికత శక్తుల తో కలిసి ప్రాచీన భారతీయ సంప్రదాయాల మధ్య ఉద్రిక్తతను ప్రతిబింబిస్తుంది. OHYS ప్రభుత్వాల ప్రభావాన్ని విమర్శిస్తుంది, మాకోండో యొక్క సమతౌల్యాన్ని భంగం చేయడంలోనే కథ మొత్తం సాగుతుంది. రెండు నవలలోను తమ మూలాలను కాపాడుకునే క్రమంలో సమాజం ఎదుర్కొనే పోరాటాలను స్పష్టంగా చూపిస్తాయి.

-పౌరాణికత ప్రాతినిధ్యంతో, వేయి పడగలు భారతీయ పౌరాణికత సంప్రదాయ పూజలతో మిళితమై, కథనానికి ఆధ్యాత్మిక వెనుక బలాన్ని అందిస్తుంది. OHYS మ్యాజికల్ రియలిజం (magical realism) తో కూడిన అద్భుతమైన లాటిన్ అమెరికన్ జానపద చారిత్రిక కథలను ఉపయోగించి సాధారణ జీవితంతో ఎలా మిళితమయ్యాయో చెబుతుంది. రెండు రచనల్లో శాపాలు, చరిత్ర భారాన్ని, మరియు కర్మతో ముడిపడిన పరిణామాలను సూచిస్తాయి.

-పతనం మరణంలను , వేయి పడగలు, సాంస్కృతిక మూలాలను, ఆధ్యాత్మిక విలువలను కోల్పోవడం కుటుంబానికి విడిపోడం వంటి పరిణామాలను ప్రతిబింబిస్తుంది. OHYSలో మాకోండో నాశనంతో ముగుస్తుంది, చరిత్ర శక్తుల ముందు మానవ ప్రయత్నాల బలహీనతను ప్రదర్శిస్తుంది.

-ఇద్దరు సాహిత్య దిగ్గజాలు, రెండు వేర్వేరు ప్రపంచాలు అయినప్పటికీ

వేయి పడగలు, OHYSల సమకాలీన చరిత్రల నుండి విభిన్నమైన కాలాలలో మరియు ప్రపంచాలలో రాసినప్పటికీ, వాటి రచయితల అద్భుతమైన ఒకే పోలికలున్న ప్రతిభను ప్రతిబింబిస్తాయి.

విశ్వనాథ సత్యనారాయణ, తెలుగు సాహిత్యంలో జ్ఞ్యాన్ పీట్ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత, భారతీయ సంప్రదాయాల ఆత్మను కాలనీల ఆధునికత వల్ల వచ్చిన ఉద్రిక్తతలను ఆవిష్కరించారు. Gabriel García Marquez, నోబెల్ బహుమతి పొందారు, లాటిన్ అమెరికా శక్తివంతమైన చరిత్రను, ప్రభుత్వాల పాలన, అస్థిరతలను, సంస్కృతిలో మార్పులను మ్యాజికల్ రియలిజం ద్వారా సమర్థంగా చూపించారు.

నాకు చాల ప్రత్యేకంగా తోచినవి ఇందులో పాత్రల ఒంటరితనం; Marquez, ఒంటరితనాన్ని మానసిక మరియు ఆత్మీయ స్థితిగా చూపిస్తారు, విశ్వనాథుడు, ఒంటరితనాన్ని సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని కోల్పోవడంలో చూపిస్తారు.

చరిత్రను చూపిన వైనం, Marquez చరిత్రను cyclicగా చూస్తారు, కానీ విశ్వనాథుడు కర్మ ద్వారా నైతిక క్షీణతను స్పష్టం చేస్తారు.

సాంస్కృతిక విమర్శలు చేయడంలో ఇద్దరు ఒకే ఫందాను తలపించారు, Marquez లాటిన్ అమెరికా సామాజిక అస్థిరతను విమర్శిస్తారు, విశ్వనాథుడు, కాలనీయ సమాజంలో వ్యవస్థల ఆధ్యాత్మిక పోరాటాలను సూచిస్తారు.

నాకు ఈ పోలిక చేయడం మరపురాని ప్రభావం, ఈ అనుభవం నాలో నిలిచిపోతుంది. ఈ రెండు రచనలు సాంస్కృతిక , సాహిత్య వారసత్వాలను ప్రతిబింబిస్తాయి. ఇవి కుటుంబ కథల ద్వారా సమాజపు విజయాలు ,పతనాలు, మార్పులు, లోతుపాతులు, నైజాలు, మానవ ఆత్మ బలహీనతలను చాటి చెబుతాయి. వేయి పడగలు మరియు OHYS వంటి రచనలు చరిత్ర, సంస్కృతి మరియు మానవత్వానికి సంబంధించిన అజరామరమైన సత్యాలను వెలుగులోకి తీసుకువస్తాయి.

Read More
Next Story