ఇల్లు లేని రమదాన్ !
x

ఇల్లు లేని రమదాన్ !

యుద్ధంలో చిక్కుకున్న పాలస్తీనాలో ఏమీ మిగల్లేదు. ఇల్లు లేదు, డైనింగ్ టేబుళ్లు లేవు. పడకల్లేవు. రాత్రిపూట చంద్రడూ కనిపించడంలేదు. పై నుంచి కురుస్తున్నబాంబులు తప్ప
ఇల్లు లేని రమదాన్ !


-మోసబ్ అబు టోహా (పాలస్తీనా కవి)

-తెలుగు అనుసృజన: గీతాంజలి


ఎప్పటి లాగే డిన్నర్ టేబుల్ చుట్టూ ఉండాల్సిన కుర్చీలు లేవు.

అమ్మా.. అబ్బూ ,చిన్న తమ్ముడూ కూర్చునే కుర్చీలు అవి !
పండక్కి వచ్చే మామా,అత్తా..వాళ్ళ పిల్లలూ అక్కడే కూర్చుని వాళ్ళకి ఇష్టమైన మఫతుల్,చికెన్ సూర్యాస్తమయపు సాయంత్రం వేళ తినేవాళ్ళు .
కానీ ..ఇప్పుడిక్కడ ఎవరూ లేరు .
కనీసం అస్తమించే సూర్యుడు కూడా రాలేదు.
వంటింట్లో ..భోజనాల టేబుల్ మాయం అయింది.
ఇంట్లో వంటగది మాయం అయింది.
ఒకప్పుడు ఇంట్లో ఉన్న ....ఇల్లే ఏకంగా మాయం అయిపోయింది !
శిథిలాలు.. రాళ్ళు రప్పలు మాత్రమే..సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయిప్పుడు.
ఇల్లే లేనప్పుడు ఇక రంజాన్ ఎక్కడిది చెప్పండి ?
ఈ మొత్తం మాసాన్ని రంజాన్ మాసం అని ఎలా పిలవగలం ?
ఈ రోజు రంజాన్ రోజు అని కూడా చెప్పుకోలేము కదా..
ఇల్లే లేని వాళ్ళం..శిథిలాలు మాత్రమే మిగుల్చుకున్నవాళ్ళం !


Read More
Next Story