ఊరంతా ‘ఫీవర్ హాస్పిటల్’ అయింది...
x

ఊరంతా ‘ఫీవర్ హాస్పిటల్’ అయింది...

(తెలంగాణలో డెంగ్యూ వ్యాపించింది. పిల్లలు పెద్ద సంఖ్యలో జర్వపీడితులువున్నారు. ఈరోజు సిద్దిపేట లో ఒక ఐదేండ్ల బాబు డెంగ్యూతో తో మరణించాడన్న వార్తకు చలించి..)



-వంగల సంతోష్


ఏదో ఒక కొత్త నంబర్ నుండి ఫోన్ మోగుతున్నది
ఎవరా అని మాట్లాడితే
అవతలి వైపు నుండి తెలిసిన మిత్రుడొకరు
ధీనంగా తడబడుతూ చెపుతున్నాడు
అర్థం కానీ తన మాటలకు నేను
హాస్పిటల్ చేరుకున్నా

ఇప్పుడు హాస్పిటల్ సీజన్ నడుస్తున్నట్లుంది
వర్ష కాలంతో వానలు కురిసి
భూమి తడిసిందో లేదో కానీ
వొంటి తాపంతో మనిషి మండిపోతున్నాడు
వంద డిగ్రీల ఫారన్ హీట్ లోకి వెళ్ళిపోయాడు
హైవోల్టేజీతో హాస్పిటల్స్ నిండుకున్నాయి.
భయంతో వణుకుతన్నాయి.!

స్ట్రెచర్ మీద చిన్నోడు చలి జ్వరంతో
వణుకుతూ మిటమిట కండ్లు తెరుస్తూ
పెదాలను ఆడిస్తున్నాడు
తడి ఆరిన పెదాలకు అమ్మా అనే పిలుపు అందడం లేదు
ధైర్యంగా గ్లూకోస్ బాటిల్ నిలబెట్టేందుకు
నాన్నే నిటారైన స్టాండ్ లాగా నిలబడ్డాడు
కళ్ల నిండా బెణుకుతో

ఒంట్లో నీరసం ఆవరించి హత్తుకుంటే
స్టెతస్కోప్ మెడలో వేసుకున్న
తెల్ల కోటు మనిషివొకరు టెస్టులంటూ ఏవో రాస్తున్నాడు
పింక్ బట్టలతో ఒకరు వచ్చి
సిరంజీతో నా ఒంట్లో ఉన్న రక్తాన్ని లాగారు
కాటన్తో రుద్ది పోయారు..!

అటు ఇటు తిప్పుతూ
ఒక రూమ్ లోకి తీసుకొని పోయి
ఎక్స్ రే తీసినా
ఎన్ని టెస్టులు చేసినా
ఏమి తేలలేదు..

అవ్వ..!
యాధికొచ్చి
నాటు వైద్యానికి నడకలు సాగినాయి
వేప రెమ్మలు,పసువు నీళ్లు
ఎన్ని చేసినా లాభం లేదు
అన్ని బంద్ చేసుకుని
పట్నం బాట పట్టిన కానీ
హాస్పిటల్స్ అన్నీ హైవోల్టేజీ ఫివర్ తో
కొట్టుకుంటున్నాయి..!

గడిచిన కొవిడ్19 చెప్పిన పాఠం
మరవక ముందే
గత్తరలా వ్యాపిస్తున్న ఈ జ్వరాల(కల్లోల) కాలంలో
ఎందరు ప్రాణాలు ఒదిలేస్తున్నా
పట్టించుకునే పాలకుడే లేడా?







Read More
Next Story