‘ తెలుగు సాహిత్య చరిత్రను మలుపు తిప్పిన కవి ఆరుద్ర’
x

‘ తెలుగు సాహిత్య చరిత్రను మలుపు తిప్పిన కవి ఆరుద్ర’

సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ నివాళి


ఆరుద్ర అనబడే భాగవతుల సదాశివశంకర శాస్త్రి తెలుగుసాహిత్య చరిత్రను మలుపుతిప్పాడని, ఏది రాస్తే అదే చరిత్ర..ఏం చెబితే అదే ప్రసంగం..అనబడిన కాలంలో వాస్తవసాహిత్యచరిత్రను తెలుగు సాహిత్యలోకానికి అందించడంతో తెలుగు సాహిత్యం కొత్తపుంతలు తొక్కిందని అసలు సిసలైన ప్రగతిశీల ఆరుద్ర అని సహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ పాఠశాల ఆవరణంలో జరిగినసభ కు ముఖ్య అతిథి గా హాజరై ప్రసంగించారు. గుడివాడ సాహితీ స్రవంతి కన్వీనర్ ఎల్ సురేంద్ర అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఆరుద్ర

సమగ్రాంధ్రసాహిత్యం పదమూడు సంపుటాలతో తెలుగు పరిశోధకులకు సాహిత్యకారులకు, కవులకు పవిత్రగ్రంథమైందంటే అతిశయోక్తి కాదన్నారు.కవిగా, చరిత్రకారుడిగా నాటకకర్తగా, పద్యకవిగా ఎన్నో రచనలు చేసిన ఘనుడు ఆరుద్ర అన్నారు.త్వమేవాహం 1949 జూలైలో వచ్చిందని, ఇప్పటికీ అనేక ముద్రణలు పొందుతూనే వుందన్నారు

ఛందోనియమాలను ఆరుద్ర ధ్వంసం చేశాడన్నారు.

త్వమేవాహంలో

టెక్నిక్‌లేని కవిత్వాన్ని ఊహించలేనంటాడన్నారు.

నిర్ధేశించిన భావాలను వాక్యాలు బట్వాడా చెయ్యవనినువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఒక జీవితకాలం లేటని, మన నెత్తురు మన చెమటలు

మాగాణిని తడుపుతాయని,

సాగిస్తాం సమరం

సాధిస్తాం విజయం అని,మీ పాపం పండుతుంది

మీ రాజ్యం కూలుతుందని,

ప్రజాబలం సమవాదపు

ప్రభుత్వాన్ని ఏలుతుందని లాంటి గోపకవితావాక్యాలను రాశాడన్నారు.

నవ్యకవిత్వానికి అగ్రస్థానం తెలుగుభాషదని,

మనవిధానాలను సామ్యవాదవ్యవస్థకు అనుకూలంగా మారుస్తుందను,

త్వమేవాహనాన్ని తెలంగాణ అని పేరుపెట్టమని శ్రీశ్రీ సలహా ఇచ్చాడని, ఆరుద్ర వద్దన్నాడన్నారు.

త్వమేవాహానికి కాలమే ఫ్రదానవస్తువని,

కవిమిత్రులకు లేఖలు రాయడం కూడా కవిత్వమేనని ఆరుద్ర చెప్పాడన్నారు.

కవిత్వం ప్రజలకోసం,

ప్రజాప్రయోజనం సాధించలేని కవిత్వం వ్యర్థం అని ఆరుద్ర కవిత్వానికి నిర్వచనమిచ్చాడన్నారు. కవికి నిజమైన శ్రోత మరొక కవి అని

వర్తమానకవులందరూ ఆధునికులు కారని,

అధునికులు కొందరే ఉంటారన్నారు

గతం గూర్చి

మతం గూర్చి మాట్లాడకూడదని ఏనాడో ఆరుద్ర చెప్పాదన్నారు. కవులు ఆధునిక కవిత్వం

కృష్ణశాస్త్రిని పతాకగా చేసుకుని శ్రీశ్రీ ఆరుద్రలను రెండు చక్రాలుగా అమర్చుకుని వెళ్ళిందంటారన్నారు.

బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావదే సుమతి అన్న వేమన కవిత్వం లో మార్క్సిజం వుందని ఆరుద్ర చెప్పదన్నారు

ద్రావిడజాతుల జీవనం సంఘజీవితమే..

రాజలు రాచరికాలు వచ్చాక రాజుకు దేవునికి తేడా లేకుండా పోయిందని,

ఆదివాసీల జీవనవాధానం చూస్తే వాళ్ళ ఆచార వ్వవహారాల్లో నైతిక విలువల స్థానం తెలుస్తుందని ఆయన పరిశోధనల వల్ల మనకు తెలుస్తుందన్నారు.

గుడి అనేపదం ద్రావిడ భాషా పదమని ఆరుద్ర పరిశోధనల్లో వుందన్నారు

తెలుగు సినీపాటల గేయరచయితగా నవశకాన్ని ఆరంభించారు. దాదాపు నాల్గువేల పాటలు రాసిన ఆరుద్ర సినీసాహిత్యచరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన పాటలెన్నో రాశారన్నారు.ఆయన రాసిన పాటల్లో ఘంటశాల ఆలపించిన దేశభక్తి గేయాలను పరిశీలిస్తే

సాలూరి రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో 1971లో వి.మధుసూధనరావు దర్శకత్వంలో వచ్చిన పవిత్రబంధం సినిమాలో మూడు పాటలు రాశారని, అందులో ఉన్న దేశభక్తి గేయం ఇప్పటికీ తెలుగునాట వివిధ పాఠశాలల్లో పాడుకుంటున్నారని ‘గాంధి పుట్టిన దేశమా ఇది, నెహ్రు కోరిన సంఘమా ఇది’ మంచి సందేశం అందించే పాట అన్నారు. నేటికి శ్రోతలు మరువ లేని పాట.’ మరొక దేశభక్తి గేయం అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘సిపాయి చిన్నయ్య’లోని ‘నా జన్మ భూమి ఎంత అందమైన దేశము.. నా ఇల్లు అందులోనా కమ్మని ప్రదేశము..’ ఇది ఎవర్‌గ్రీన్‌ దేశభక్తి గీతమన్నారు. ఈ పాట వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ యంఎఫ్‌రేడియోల్లో వారానికి కనీసం రెండుసార్లయినా ప్రసారమవుతుంటుందన్నారు.


ఈలోకంలో డబ్బుకు ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు..ధనం మూలం మిధం జగత్‌ అన్నారని,ఆ డబ్బు ఎవరిని వరిస్తుంది..ఎవరికి అందకుండా అందనంత ఎత్తులో ఉంటుందో..డబ్బును ఎలా నిలబెట్టుకోవాలో..ఎలా కూడబెట్టుకోవాలో వివరిస్తూ ఇప్పటికీ మనిషి ఆచరించదగ్గ సందేశాత్మక గేయంగా మనకు దర్శనమిస్తుందన్నారు ఆరుద్ర రాసిన ఆ పాట..లక్ష్మీనివాసం సినిమా కోసం ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అంటూ పల్లవి సాగుతుంది. చరణంలో మానవుడే ధనమన్నది సృ జియించెనురా దానికి తానే తెలియని దాసుడాయెరా మానవుడే ధనమన్నది శృజియించెనురా దానికి తానే తెలియని దాసుడాయేరా ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా.. రెండో చరణంలో..ఉన్ననాడు తెలివికలిగి పొదుపు చేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే..మూడోచరణంలో..కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లో ధనమున్నదిరా కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లో ధనమున్నదిరా, శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం ఆ శ్రీదేవిని నిరసించుట తీరని ద్రోహం..అంటూ గొప్ప సాహిత్యాన్ని ఆరుద్ర సృష్టించాడు.

మనోహరమైన యుగళగీతాలెన్నో ఆరుద్ర రాశారు. ఒక్కొక్కపాట ఆణిముత్యంగా నిలిచిపోయాయి. అందరి హృదయాల్లోనూ పదిలంగా నిలిచిపోయా యన్నారు.ఈనాడు ఆధునిక కవుల రచనల్లో చాలా మంది రచనల్లో కవిత్వం ఉండటం లేదు అన్నారు. ఏ.ఎన్. ఆర్.కళాశాల విశ్రాంత తెలుగు విభాగాదిపతి కొడాలి సోమసుందరవు పత్రం సమర్పించి, మాట్లాడుతూ పెద్దగా చదువుకోకపోయినా ఏ గురువు వద్ద పరిశోధన చేయకపోయినా ఆరుద్ర రచనలు పరిశోధకులకు మార్గదర్శక మయ్యాయి అన్నారు.. ఏ.ఎన్. ఆర్ .విశ్రాంత చరిత్ర విభాగాదీపతి కోగంటి చెన్ను గాంధీ బాబు పత్రం సమర్పించి, మాట్లాడుతూ...ఆరుద్ర 20 శతాబ్దపు మలి భాగంలో తెలుగు సాహితీ ప్రపంచంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ఎలాడన్నారు....అభ్యుదయ రచయిత్రి పుట్టి నాగలక్ష్మి మాట్లాడుతూ ఆరుద్ర స్త్రీల సమస్యలపై కవితలు సంధించిన మహిళ పక్షపాతి అన్నారు.


మధ్యాహ్నం జరిగిన రెండో సెస్షన్ కి సాహితీ మిత్రులు కన్వీనర్ వసుద బసవేశ్వరరావు అధ్యక్షత వహించారు.కె. టి.ఆర్.మహిళ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ కె.ఇందిరాదేవి మాట్లాడుతూ సాహితీ లోకంలో మహా సముద్రం ఆరుద్ర అన్నారు .. ఆద్యుదయ కవి వంగా వంశీ కూనలమ్మ పదాలపై పత్రం సమర్పించి ప్రసంగించారు....సాహితీ స్రవంతి కార్యదర్శి మాల్యాద్రి గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసేర్.జి. ఎస్. భాస్కరరావు,మరో అసోసియేట్ ప్రోఫెసర్ వి.నవీన్ ,తదితరులు ప్రసంగించారు. సీహెచ్ .రూప జి. ఎం.ఆర్.కిషోర్, పి.శ్రీనివాస్ ,వంశీ (గజల్) రూపా తదితరులు అభ్యుదయ గేయాలపన చేశారు.కవులు బి.వి.శ్రీనివాసరావు, బెనర్జీ, యు.టి.ఎఫ్.కైకలూరు అధ్యక్షులు పీటర్ తదితరులు కవితలు చదివి వినిపించారు..ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి కోశాధికారి ఎలమర్తి కోటేశ్వరరావు, సి.ఐ. టి.యు ఉపాధ్యక్షులు ఆర్.సి.పి.రెడ్డి, కవి పుల్లేటికుర్తి శ్రీనుబాబు. కవయిత్రి ఎమ్.సాయిలక్ష్మి,,టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి బి.అరుణ,మండవల్లి యు.టి.ఎఫ్..నాయకులు శ్రీనివాసరావు, భాగవతుల ఉమామహేశ్వరి పలువురు సాహితీ వేత్తలు అభిమానులు పాల్గొన్నారు


Read More
Next Story