నా విద్యార్థులకు ( కవిత)
ఢిల్లీ యూనివర్శిటీ ఫ్రొఫెసర్ జిఎన్ సాయిబాబ కవిత. రాజ్యం మీద యుద్ధం ప్రటించిన మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆయనపై పెట్టిన కేసును నిన్న కోర్టు కొట్టి వేసింది.
నా విద్యార్థులకు.....
-ప్రొ.జి ఎన్.సాయిబాబా
నా ఒంటరి జైలుగది
ఇనుప చువ్వల వెనుక
పగలూ రాత్రి నేనొక
తరగతి గదిని కలగంటాను.
మీ నుండి దూరంగా
ఖైదు చేయబడినా
నరాలలో రక్త నాళాలలో
పరుగులెత్తుతున్న
స్వేచ్చా కాంక్ష నుండి
సంకెళ్లు లేని మనోనేత్రం నుండి
నేను మిమ్మల్ని చూస్తాను
మాట్లాడతాను
నా బలహీనమైన చేతులతో
హత్తుకుంటాను........
బోధించడం నా బలం
నా ఊపిరి నా జీవితం
బాధలు కన్నీళ్లు
ఆశయాలు భయాల
బాధామయ చరిత్రతో
తాత్వికతతో అర్థశాస్త్రoతో
మనల్ని కలిపి ఉంచే సారస్వతాన్ని
రేపటి ఉదయంకోసం హత్తుకుంటాను...
అసత్యాల చెరసాల
విద్రోహకర నియమాలు
కుట్రపూరిత సంభాషణలు
జ్ఞానంతో మీ విమర్శనాత్మక సాంగత్యం నుండి
చెరబడ్డ ఈ నేల విముక్తిపై
మీకున్న ప్రేమ నుండి
నన్ను దూరంగా బంధిస్తున్నాయి....
(సోషల్ మీడియా నుంచి )
Next Story