ప్రజా పాలనకు ’దినం‘ (నిరసన కవిత)
సెప్టెంబర్ 17 ను”ప్రజా పాలన దినోత్సవం”గా పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కవిత
—నిధి
నాకిప్పుడే తెలిసింది - వ్రజాపాలనంటే
ప్రజలను ఇండ్లల్ల నుండి ఈడ్చూకొచ్చి
కాల్చి చంపుడని
నాకిప్పుడే తెలిసింది - వ్రజాపాలనంటే
ప్రజలు నిద్దుర లేవక ముందే
మిలటరీ ఊర్లకు ఊర్లనే వలయాకారంగా చుట్టేసి
జనాలన్నంత ఒక్కదగ్గర పోగేసి
బహిర్భూమికి కూడ వేళ్లనీకుండ
పొద్దంత చిత్రహింసలు పెట్టడమని
నాకిప్పుడే తెలిసింది - వ్రజాపాలనంటే
ఆదివాసీల గూడాలను ఖాళీ చేయించి
కానుసెంట్రేషన్ క్యాంప్ లో కుక్కేసి
ఆకలి అంటురోగాలతో చచ్చేట్లు చేయడమని
వాళ్ళతో పాటు వాళ్ళ గొడ్డు గోదను
గోస పుచ్చుకొవడమని
నాకిప్పుడే తెలిసింది - ప్రజాపాలనంటే
ప్రజలు పోరాడి సాధించుకున్న
వారి తాతలనాటి భూమి జాగ గొడ్డు గోదను
దొరలకు తిరిగి ఇవ్వండని
ఎప్పట్ల మీ ఎట్టిబతుకులు మీరు బతకండని
ప్రజలను రక్తాలు కారునట్లుగా కొట్టి
గాయాల్లో కారం నింపి
కాలే ఇసుకలో పొర్లించుడమని
నాకిప్పుడే తెలిసింది - వ్రజాపాలనంటే
పిల్లా జల్లా ముసలి ముతక
రోగి బాలింతా వీరూ వారూ తేడా లేకుండ
అందరిని కుళ్ళబోడుస్తు
మీకు తలేత్తుకు బ్రతకడం నెర్పీన
ఆ సంఘం నాయకుల జాడ చెప్పకుంటే
మిమ్మల్ని భూమ్మీద బ్రతుకనియ్యమని
భయాందోళనలకు గురి చెయ్యడమని
నాకిప్పుడే తెలిసింది - వ్రజాపాలనంటే
ప్రజలు ఎర్పరుచుకున్న గ్రామ స్వరాజ్యాలను
మిలటరీ బూట్ల క్రింద నేలరాసి
ప్రజల ఆస్తులనే కాదు
మాన ప్రాణాలను దోసుకున్న దొరలను
గ్రామల్లో పునఃప్రతిష్టించడమని
నాకిప్పుడే తెలిసింది - ప్రజాపాలనంటే
ప్రజలు అప్పుడప్పుడే పీల్చుకుంటన్న
స్వేచ్ఛ వాయువులను హరించి
తలేత్తాలంటే భయపడేలా
భీభత్సం సృష్టించడమని.
అవును నాకిప్పుడే తెలసింది
ప్రజా పాలనంటే ఇదని
అందుకే సెప్టెంబర్ 17 కు
ప్రజా పాలన దినమని పేరు పెట్టిన ప్రభుత్వానికి
ఆ పేరు వద్దని గళ మెత్తని వామ పక్షాలకు
చేతులెత్తి శతకోటి వందనాలు మనసాగక…….!
ఆనాటి అమర వీరులకు
అంతులేని బాధలు అనుభవించిన అశేష జనావళికి
క్షమాపణలు
Next Story