
నేను చూసిన మరో అద్భుతం "గుడి పల్లం"
ఈ అద్భుతమైన దేవాలయం గురించి తెలుసుకుందాం .
-పుష్య మీ సాగర్
శివుడు అర్చామూర్తి గా కాకుండ లింగ రూపం లో దర్శనం ఇస్తాడు. ఇది అందరికి తెలిసిందే . కానీ మీరు ఎప్పుడైనా శివుడు ఒక పురుషాంగా లింగం గా కొలువై ఉండడం చూసారా ? ఇదిగో ఈ ప్రదేశం లో మాత్రం శివుడు అలానే ఉంటాడు . ఎక్కడో కాదండీ చిత్తూరు జిల్లాలోని, తిరుపతి నుంచి ఆగ్నేయం దిశగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. "గుడి మల్లం" అనే ఊరి లో ఉంది. ఈ అద్భుతమైన దేవాలయం గురించి తెలుసుకుందాం .
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికీ, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం. ప్రాంగణంలో ఆనందవల్లి దేవి, శ్రీవల్లీ దేవసేన సుబ్రమణ్య స్వామి, సూర్య భగవాన్, వినాయకుడి ఆలయం మొదలైనవి కొలువై ఉన్నాయి.
ఇది క్రీస్తుశకం 1వ, 2వ శతబ్దములో కాలంలో నిర్మించినట్లు ఇక్కడ బయటపడిన శాసనాలద్వారా తెలుస్తోంది. అయితే, శాస్తజ్ఞ్రుల విస్తృత పరిశోధన తరువాత భారత పురాతత్వ సర్వేక్షణ ఈ శివాలయం క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నాటిదని నిర్ణయించింది. 1973లో ఈ ఆలయాన్ని జాతీయసంపదగా గుర్తించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కంటే ప్రాచీనమైన ఈ ఆలయంలోని శివలింగాని పరశురాముడు పూజలు చేసాడని ప్రశస్తి.
ఈ ఆలయం లింగం కంటే తరువాతది, ప్రస్తుతం ఉన్న భవనం చోళ, విజయనగరం రాజుల కాలాల తరువాతది, అంటే శిల్పం ప్రతిష్టించిన తరువాత వెయ్యి సంవత్సరాలకు గుడి నిర్మించినట్లు తెలుస్తోంది. లింగం బహుశా మొదట బహిరంగ ప్రదేశంలో ఉంచబడి ఉండవచ్చు, దీర్ఘచతురస్రాకార రాయి చుట్టూ ఉండి, చెక్క నిర్మాణం లోపల ఉంది. ఈ ఆలయం 1954 నుండి భారత పురాతత్వ సర్వేక్షణ (ఎఎస్ఐ) చేత రక్షించబడింది.
లింగం ముందు భాగంలో మరుగుజ్జు అపస్మార బొమ్మ భుజాలపై నిలబడి ఉన్నాడు. శివుడి బొమ్మ ఒక బలమైన వేటగాడిని పోలి ఉంటుంది, అతను తన కుడి చేతిలో ఒక జింకను, ఎడమ చేతిలో ఒక చిన్న నీటి కుండను పట్టుకున్నాడు. అతని ఎడమ భుజం మీద ఒక గొడ్డలి ఉంది. అతను భారీ చెవిపోగులు, నెక్లెస్ ధరించాడు. అతని చేతులు ఐదు కంకణాలతో అలంకరించబడి, ప్రతి మణికట్టు మీద వివిధ డిజైన్లతో, ప్రతి వైపు ఎత్తైన చేతి ఉంగరంతో అలంకరించబడి ఉంటాయి. అతను చాలా సన్నని పదార్థంతో కూడిన ధోతి ధరిస్తాడు, అతని నడుము వద్ద విశాల-మేఖలా ధరించి ఉంటాడు. ఇది లింగం మొత్తం కొమ్ముల చుట్టూ విస్తరించి ఉంటుంది. ఆయనకు యజ్ఞోపవీతము లేదు. తలపాగా, తలపై అతని జుట్టు పొడవుగా ఉంటుంది.
గుడి చరిత్ర
ఈ ఆలయం పేరు శాసనాలలో పరశురామేశ్వర ఆలయం అని ప్రస్తావించబడింది. ఈ శాసనాలు ఆలయ అసలు నిర్మాతలను సూచించవు. కానీ వారు ఆలయానికి ఇచ్చిన భూమి, డబ్బు, ఆవులు వంటి బహుమతులను ఆలయంలో రోజువారీ ఆరాధన నిర్వహణ కోసం నమోదు చేస్తారు. క్రీ. శ. 2వ లేదా 3వ శతాబ్దానికి చెందిన నల్ల, ఎర్రటి వస్తువుల షెర్డ్స్ 1973లో నిర్వహించిన తవ్వకాల సమయంలో వెలుగులోకి వచ్చాయి. ఆంధ్ర శాతవాహన కాలం (క్రీ. శ. 1వ శతాబ్దం నుండి క్రీ. శ 2వ శతాబ్దం వరకు) కు చెందిన కుండలు, అదే కాలానికి చెందిన 42x21x6 అంగుళాల పెద్ద పరిమాణపు ఇటుకలు కూడా కనుగొనబడ్డాయి. అందువల్ల కొంతమంది చరిత్రకారులు ఈ ఆలయాన్ని శాతవాహన కాలం నాటిదిగా పేర్కొన్నారు.
ఆలయ ప్రాంగణంలోని రాతి పలకలపై పల్లవ, యాదవ దేవరాయలు, గంగా పల్లవ, బాణ, చోళ కాలానికి చెందిన అనేక శాసనాలు ఉన్నాయి. అత్యంత పురాతన శాసనం నందివర్మ పల్లవ (క్రీ. శ. 802) పాలనకు చెందినది.
తొలి శివాలయం ఇదే..!
తొలి శివాలయానికి ఎంతో చరిత్ర ఉందంటున్న భక్తులు ఆలయ ప్రాశస్త్యం గొప్పదంటున్నారు పరమేశ్వరుడు పరుశురామేశ్వరుడిగా ఎందుకయ్యాడనే పలు పురాణ ఆధారాలు ప్రాచూర్యంలో ఉన్నాయంటున్నారు. స్థల పురాణం ప్రకారం తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు తల్లిని సంహరించి తిరిగి తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బతికించుకున్నాడని కథనం పురాణాలు చెబుతున్నాయి. పాప ప్రాయిశ్చిత్యం కోసం గుడిమల్లంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో తపస్సు చేసేందుకు వచ్చిన పరశురాముడు స్వయంభు గా వెలసిన శివలింగాన్ని పూజిస్తాడు. ఆ అడవిలో సరోవరాన్ని నిర్మించుకున్న పరశురాముడు అక్కడే తపస్సు చేశాడు.
అక్కడ పూసే విచిత్రమైన ఆకారంలో పూసే వింత సువాసన వెదజల్లే ఒకే ఒక పువ్వుతో శివున్ని ఆరాధించేవారు. ఆ పువ్వును అడవి జంతువుల నుంచి కాపాడేందుకు చిత్రశేనుడు అనే యక్షకుడిని ఏర్పాటు చేసి ప్రతిరోజు జంతువును ఆహారంగా ఇచ్చే వాడని, ఒక రోజు పరశురాముడు రాకముందే ఆ పుష్పాన్ని స్వామి వారికి సమర్పించి పూజించడంతో చిత్రశేనుడి తో పరశురాముడు యుద్ధం చేశాడని పురాణ కథలు చెబుతున్నాయి. దాదాపు 14 ఏళ్లు పాటు యుద్ధం చేశాడని, యుద్ధం ముగియకపోవడంతో పరమశివుడు ప్రత్యక్షమైన భక్తికి మెచ్చాడని పురాణాలు చెబుతున్నాయంటున్నారు ఆలయ అర్చకులు.
ఈ క్షేత్రం గురించి సరి అయినా సమాచారం లేకపోవడం వలన పెద్దగా ఎక్కువ గా తెలియదు అయితే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కాస్త మార్పు వచ్చినట్టే ఉంది. ఇక్కడి వాళ్ళు చెప్పారు ..శని వారం, ఆదివారం, సోమవారం రోజులలో మాత్రం ఎక్కువ గా సందర్శకులు వస్తారు. నేను వెళ్ళినప్పుడు కూడా చాలా మంది సొంత వాహనాలలో రావడం కనిపించింది.
ఈ సారి నేను గమనించింది ఏమిటి అంటే ఎప్పుడు అయితే నేను పది హేను సంవత్సరాల కి ముందు వెళ్ళినప్పుడు శివుడి నిజ రూప దర్శనం చేసుకున్నాను . ఇప్పుడు మాత్రం అలంకారాలతో సర్వ సుందరంగా తీర్చి దిద్దారు., అప్పుడు పూజలు అవి ఏమి లేవు కానీ ఇప్పుడు మాత్రం నిత్యం పూజలు చేస్తున్నారు.
గర్భాలయం పైకప్పు గజవృష్ట ఆకారంలో ఉండగా ఛోళుల తర్వాత పల్లవులు కొంత కాలం ఆలయ నిర్వహణ కొనసాగించినట్లు తెలుస్తోంది. గుడి పల్లం కాస్తా గుడిమల్లంగా ఏర్పడగా చోళ, పల్లవుల కాలం నుంచి రాయల కాలం దాకా నిత్య దూప నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయం 1954లో ఆర్కియాలజీ చేతిలోని వెళ్ళింది. దీంతో పూజలు నిలిచిపోవడంతో చాలా విగ్రహాలు చోరీకి గురి అయ్యాయి. ప్రస్తుతం భారత పురావస్తు శాఖ వద్ద ఆలయానికి చెందిన సాహిత్యం కూడా లేకపోగా ఉజ్జయినిలో దొరికిన రాగి నాణేలపై గుడిమల్లం ఆలయం మూల విరాట్ బొమ్మ ఉండగా, మధుర మ్యూజియంలోనూ ఇలాంటి శిల ఉందని తెలుస్తోంది. 9వ శతాబ్దం వరకు ఆరు బయటనే పూజలు అందుకుంటున్న శివలింగం చుట్టూ రాజవంశాలు గుడి నిర్మాణాలు చేపట్టాయి. ఆలయ ప్రాంగణంలో పార్వతి, సుబ్రమణ్యస్వామి, సూర్య భగవానుడి విగ్రహాలతో ఆలయ నిర్మాణం జరిగింది.
60 ఏళ్లకు ఒకసారి అసలేం జరుగుతుంది..!
ఏకశిలపై శివుని అనేక రూపాలు చెక్కడం నాటి శిల్పుల విశిష్టతను చాటుతోంది. భూగర్భజల మట్టం ఈ లింగం కింద 350 అడుగుల లోతు లో ఉన్నప్పటికీ ఒత్తిడి పెరిగిన సమయంలో ఆ నీళ్లు లింగంపై పడుతుంటాయి. ఈ నిర్మాణం వెనుక అద్భుతమైన అర్కెటెక్చర్ పరిజ్ఞానం దాగి ఉంది. 2005 డిసెంబర్ 5న అలా నీళ్లు శివుడిని అభిషేకించాయి. తిరిగి 60 ఏళ్లకు అంటే 2065 కు అలా వచ్చే వరదనీటితో ఈ ఆలయం నిండి పోతుందని భక్తుల నమ్మకం. శిల్ప చరిత్రలోనే అపురూపమైనదని అంతర్జాతీయ పురాతత్వ వేత్తల రచనలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇక ఆలయంలోని దొరికిన శాసనాల ద్వారా పరమేశ్వర ఆలయంగా గుర్తించిన చరిత్రకారులు శిల్ప చరిత్రలోనే అపురూపమైన శివలింగం ప్రాచీనమైనదిగా గుర్తించారు. పురావస్తుశాఖ పరిశోధన ప్రకారం క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ఆలయంగా గుర్తించగా 1908 నాటికే బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని గుర్తించింది.
ఈ ఆలయం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం అనే గ్రామంలో ఉంది. ఇది తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో ఉంది. రేణిగుంట విమానాశ్రయం ముందు నుండి పాపానాయుడు పేట మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. తిరుపతి నుండి విరివిగా బస్సులున్నవి. ప్రత్యేకించి ఈ క్షేత్రానికి మాత్రమే ఎటువంటి రవాణా సౌకర్యంలేదు.