పుస్తకం చిరంజీవి
x
source: freepic

పుస్తకం చిరంజీవి

పుస్తకం విశ్వరూపం చూపించే ఒక చక్కటి కవిత



పుస్తకం చిరంజీవి


-వల్లభాపురంజనార్దన


మనిషి అనుభవ గనిలోంచి

బయటపడిన ఖనిజంపుస్తకం

అపురూప అక్షర విజ్ఞాన కళా ఖండం పుస్తకం

సతత హరిత భావరూపచిత్రం

మనసులోతొలుస్తున్న మొలుస్తున్న

ఎదుగుతున్న వ్యాపిస్తున్న ఊహలకు సుడులు తిఫుగుతున్న

సుడులు తిరుగుతున్న ఆలోచనలకు

అక్షర చిత్ర ప్రదర్శన శాల పుస్తకం

మనిషిని చలనవిద్యుత్ ట్రాన్స్మీటరును చేసి వెలిగిస్తుంది

నడిపిస్తుంది పుస్తకం

పుస్తకం మార్పులేని జడం కాదు

బుద్ది సాంకేతిక విప్లవానికి రూప రసాయనయంత్రం

అది ఉన్నట్టుండి ఆకాశంనుండి ఊడిపడలేదు

మనిషి అవిశ్రాంత బుద్ధి చైతన్య పంటగా పుట్టింది

ఊహల విత్తనం మొలకై పంటగా మారిన పరిణామ ప్రస్థానం దానిది

బండలు తోళ్ళు బెరళ్లు రాగిరేకులు

తాటాకులే ఒకప్పుడు పుస్తకాలు

బుద్ధికి జడత్వం అంటకుండా

చలన రేఖీయతను ప్రవహింప జేసే ఫ్యాక్టరీ పుస్తకం మరి ఇప్పుడో

ఈ నెట్ ఆన్లైను పుస్తకాలు

నత్తలా నడుస్తున్న బుద్ధిని

పందెపు ఉర్రంలా పరు గెత్తిస్తుందిప్పుడు పుస్తకం

నిన్నైనా నేడైనా మొన్నైనా రేపైనా

పుస్తకం సజీవం పరిణామ రూపంతో

పుస్తకాన్ని కోల్పోతే ప్రపంచాన్ని కోల్పోవడమే

నీచేతిలో పుస్తకం ప్రపంచ అంతరం గాన్ని చూపే డ్రోన్ విమానం

పుస్తకం ఎప్పటికీ రూపాంతర చిత్రం

అందుకే పుస్తకం చిరంజీవి


(23 ఏప్రిల్ నాడు మహబూబు నగర్లోని లుంబిని హైస్కూలులోతెలంగాణ సాహితి నిర్వహించిన కవిసమ్మేలనంలో చదివిన కవిత)




Read More
Next Story