‘రామేశ్వరం’వస్తోంది.. హైదరాబాద్ కు.. లొట్టలు వేయించడానికి
x
రామేశ్వరం కెఫె

‘రామేశ్వరం’వస్తోంది.. హైదరాబాద్ కు.. లొట్టలు వేయించడానికి

ఇంట్లో ఓ పూట వండుకోకపోతే, బయట మంచి రెస్టారెంట్ ఉందో వెతుకుతాం. కొన్నిపేర్లు చెప్పగానే నోరూరుతుంది. అలాంటి ఓ రెస్టారంటే రామేశ్వరం. అసలు కథేంటంటే...


అప్పుడెప్పుడో నలభీముల గురించి విన్నాం.. ఇప్పుడు కూడా ఎవరైన బాగా వండితే నలభీమపాకం అంటాం.. తరువాత పూటకూళ్ల ఇళ్ల గురించి అందరికీ తెలుసు.. ఈ రెండు కలిపి ఉన్నదే రామేశ్వరం కెఫె... ప్రస్తుతం బెంగళూర్ లో అదో సంచలనం.. పాక శాస్త్రంలో చెప్పిన అన్ని రకాల రుచులు.. అదిరిపోయే టేస్ట్ తో అందిస్తూ కన్నడిగుల మనసు దోచుకుంది.

అందుకే అతి తక్కువ టైంలో అంటే కేవలం రెండు సంవత్సరాల కాలంలో నగరంలోని నాలుగు చోట్ల నాలుగు బ్రాంచీలు పెట్టి విజయవంతంగా వ్యాపారంలో దూసుకుపోతోంది. ఇప్పుడు మన మాదాపూర్ లో తన పాక ప్రావీణ్యం చూపేందుకు రెడీ అయింది.

‘ఇది ఆరంభం మాత్రమే. ఇంతకంటే పెద్ద ఐడియాలే మా మదిలో ఉన్నాయి. మొదట దక్షిణాది, తరువాత ఉత్తరాది, ఆ తరువాత దుబాయ్.. ఇలా మా బిజినెస్ ను విస్తరిస్తాం.. మా రుచులతో ఆహార ప్రియుల నోరు నింపేస్తాం’మని అంటున్నారు కెఫె ఓనర్లు దివ్యరాఘవేంద్ర రావు.. రాఘవేంద్ర. ఇద్దరు భార్యా భర్తలు.




వారితో మాట్లాడుతుంటే తెలిసింది. వారి విజన్ గురించి..‘దేశంలో అందరూ మా కెఫె గురించి మాట్లాడుకోవాలని మేం ముందే గట్టిగా నిర్ణయించుకున్నాం. మొదటి అడుగుతోనే మా ముద్రను బలంగా ఫుడ్ రంగంలో వేయాలని అనుకున్నాం’ అని అంటున్నారు ఈ బిజినెస్ కపుల్.

తగిన ప్రణాళిక వేసుకున్నాం.. మాకేం తొందరలేదు.. కావాల్సినంత సమయం తీసుకుని.. ముందుగా అనుకున్న విధంగా కెఫెను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాం. అందులో భాగంగా మా రెండో గమ్యంగా హైదరాబాద్ ను ఎంచుకున్నాం. సంక్రాంతికి తెలుగు మూకుడ్లకు ముందు మేం ఉంటాం.. అని నమ్మకంగా చెబుతున్నారు.. ఈ జంట.

రెండో అడుగు హైదరాబాద్ లోనే ఎందుకు?

‘హైదరాబాద్ లోనే రెండో అడుగు ఎందుకు అని చెప్పడానికే ప్రత్యేకంగా కారణం అంటూ ఏం లేదు. అక్కడ వ్యాపారం చేయడానికి అన్ని వేగంగా కలిసొచ్చాయి.. అంతే ఇంకేంలేదు. దాదాపు ఎనిమిది నెల్ల నుంచి మేము రోజు హైదరాబాద్ లో బ్రాంచీ గురించి పనులు చేస్తూనే ఉన్నాం. అవి ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి.

నిజానికి చెన్నైకి నాకు మధ్య బంధం మాటల్లో చెప్పలేనిది. అక్కడే రెండో బ్రాంచీ పెట్టాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. నేను మద్రాస్ లోని సత్యం సినిమాలో పనిచేశాను. మణిరత్నం, శంకర్ సినిమాల్లో నటించాలనే ఆశ కూడా ఉండేది. కానీ ప్రతి మనిషికి ఓ డెస్టినీ అని ముందే రాసి పెట్టి ఉంటుంది కదా.. అదే ఇక్కడ కూడా జరిగిందని అర్థరాత్రి ఫెడరల్ తో మాట్లాడుతూ తన జ్ఞాపకాల దొంతరల్లోకి వెళ్లిపోయారు, అలా ప్రశాంతంగా కళ్లు మూసుకుంటూ..

మా వ్యాపారం విజయవంతం కావడానికి మేము ఆవలంబించేది విస్తృతమైన ప్రణాళికలే కారణం. ప్రతి విషయాన్నిసీరియస్ గా చూసుకుంటాం. మా దగ్గర ఉన్న సిబ్బందికే శిక్షణ ఇచ్చి అక్కడికి పంపిస్తాం. అందుకే రుచుల్లో తేడా రాదు. అయితే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మా డిష్ లకు అక్కడి టేస్ట్ ను అద్దుతామని చెబుతున్నారు ఐడీసీ కిచెన్ లో రెండేళ్ల అనుభవం ఉన్న రాఘవేంద్రరావు.

బెంగళూర్ లో ఉన్న మెనూనే ఇక్కడ కూడా అందిస్తాం.. కానీ స్థానిక వంటకాలకు సైతం ఇందులో చోటు ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పగలుగుతాం. కాకపోతే కాస్త కారంగా మమకారం కలిపి ఉంటాయి. అక్కడికి(బెంగళూర్).. ఇక్కడికి(హైదరాబాద్) మధ్య తేడా ఇదే.

ఫెడరల్ టీమ్ ఇంటర్య్వూ చేస్తున్న సమయంలో అంటే రాత్రి ఒంటి గంటకు సైతం అక్కడ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. కూర్చోడానికి స్థలం లేకపోయిన దొరికిన చోట సర్థుకుని తింటున్నారు. అవి తగ్గే సూచనలు కనపించట్లేదు. వాళ్ల ప్లేట్లలో నెయ్యితో చేసిన ఇడ్లీ, నెయ్యితో చేసిన పిండి వంటకం మసాలా, పొంగల్ ఉన్నాయి. అది చూస్తే చెన్నైలోని పాత శరవణన్ హోటల్ల రద్దీ గుర్తుకు వచ్చింది.



మీరు చేసే పనిమీద మీకు శ్రద్ద ఉంటే.. ఏదీ కష్టం అనిపించదు. అలసట అనే ప్రశ్న రాదు. మా కెఫెలను రోజు రాత్రి 2 గంటలకు మూసేస్తాం. తిరిగి ఉదయం 5 గంటలకే ప్రారంభిస్తాం. ఓ గంటపాటు డీప్ క్లీన్ చేస్తాం. తరువాత ఆర్డర్ లు తీసుకుంటామని చెబుతున్నారు కెఫె ఓనర్.

మా దగ్గర 800 మంది ఉద్యోగులు ఉన్నారు. మేము 24/7 పని చేస్తున్నాం. ప్రభుత్వ అనుమతి తీసుకుని 24*7 పనిచేస్తాం. సిబ్బందిని షిప్ట్ ల వారిగా రప్పిస్తాం. మా దగ్గర ఎలాంటి ప్రిజ్ లు ఉండవు. ఆహరం నిల్వ చేయడం అన్నది మా కాన్సెప్టే కాదు. ఎప్పటికప్పుడు తాజా ఆహరం మాత్రమే అందిస్తున్నామని, అలాగే అందిస్తామని రామేశ్వరం ఫౌండర్ రాఘవేంద్రరావు చెబుతున్న మాట. అలాగే వాళ్ల భవిష్యత్ ప్రణాళికలు సైతం ఫెడరల్ తో పంచుకున్నారు. త్వరలో హెన్నూర్ రోడ్, న్యూ ఎయిర్ పోర్ట్ రోడ్, సర్జాపూర్ ఇలా వాళ్ల ప్లాన్స్ సాగుతున్నాయి.

చారిత్రక నగరం.. ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు కలిగి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా గా పేరుపొందిన బెంగళూర్ లో రామేశ్వరం హోటల్ రెండేళ్లలో సాధించిన ప్రత్యేకతలు ఎన్నో. కేవలం 10/15 స్క్వేర్ ఫీట్ స్థలం కలిగి ఉండి ఎలాంటి పార్కింగ్ లేకుండా ఉన్న ఈ కెఫెపై ఇంటర్నెట్ లో మీమ్స్ పేలుతున్నాయి.

ఇక్కడి వంటకాల్లో నూనె వాడరు.. కేవలం నెయ్యి మాత్రమే వాడతారనేది బాగా ప్రచారం కావడం వల్లనేమో ఇక్కడి నెలవారీ అమ్మకాలు ఎవరూ ఊహించలేనంతగా జరుగుతున్నాయి.

ఇంతకీ ఈ హోటల్ కి ‘రామేశ్వరం’ అనే పేరు పెట్టడానికి ప్రత్యేకంగా ఓ కారణం ఉంది. కలల కనండి వాటిని సాధించండి అని విద్యార్థులకు ప్రేరణ నింపిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన పుట్టిన ప్రదేశమే రామేశ్వరం. అందుకే ఈ పేరు పెట్టినట్లు ఆయన చెబుతున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. కష్టం, అదృష్టం అనేది కవల పిల్లలు లేదా భాగస్వాములు. ఇవి ఎప్పుడు పక్కపక్కనే ఉంటాయని అంటున్నారు రాఘవేంద్రరావు.


Read More
Next Story