ఉప్పు చేప.. ఇక ఉడకదంట!

ఉప్పు చేపా.. పప్పుచారు.. ఆ పాట గుర్తుందిగా! అప్పుడెప్పుడో 1979లో మాట. దాసరి నారాయణ రావు తీసిన రావ‌ణుడే రాముడైతే సినిమాలో పాట. ఆ కాంబినేషన్ మహా రంజుగా ఉంటుంది.


ఉప్పు చేప.. ఇక ఉడకదంట!
x
plastic threat to dry fish

(ది ఫెడరల్ ప్రతినిధి, హైదరాబాద్)

ఉప్పు చేపా.. పప్పుచారు.. ఆ పాట గుర్తుందిగా!అప్పుడెప్పుడో 1979లో మాట. దాసరి నారాయణ రావు తీసిన రావ‌ణుడే రాముడైతే సినిమాలో పాట. ఆ కాంబినేషన్ మహా రంజుగా ఉంటుంది. కొండకచో కొంపా ముంచుతుంది. ఈమధ్య విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో కొందరు కుర్రాళ్లు మందులోకి ఉప్పుచేపకాల్చుకోబోతే పడవలు తగలబడ్డాయి. అందువల్ల అప్పుడప్పుడు ఉప్పు చేప నిప్పు చేపా అవుతుంది.. ఇప్పుడెందుకీ ముచ్చటంటే ఉప్పు చేపకీ ముప్పొచ్చింది. దేశదేశాల్నీ, నదీనదాల్నీ చుట్టబెడుతున్న ప్లాస్టిక్ ఉప్పు చేపకీ కీడు తెచ్చింది. ప్లాస్టిక్ భూతం ఉప్పు చేపనీ కమ్మేసి కుమ్మేస్తోంది.

చేపల్నిఎండబెట్టుకుని తినడంమనకి కొత్తేమీ కాదు. బోలెడంత పాతది. అనాదిగా వస్తున్నదే. ఇంకా బాగా చెప్పాలంటే ఈమధ్య బాగా పెరిగింది కూడా. చాలామందికి ఇదో వృత్తి. భలే మంచి వ్యాపారం కూడా. తీర ప్రాంతాలున్న అన్ని చోట్లా ఎండు చేపల వాడకం ఉంది. దీనికో ప్రభుత్వ శాఖ ఉంది. గుక్కెడుగంజి, ఒక ఉప్పు చేపతో పూట గడిపే కుటుంబాలెన్నో ఈ దేశంలో.
ఎండు చేపల వాటా 20 శాతం...
ఫిషరీస్ శాఖ అంచనా ప్రకారం మొత్తం చేపల ఉత్పత్తిలో ఎండు చేపల వాటా 20 శాతం.కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మత్స్యశాఖ నివేదిక ప్రకారం ఇండియాలో మొత్తం చేపల ఉత్పత్తి 131.45 లక్షల టన్నులు. ఇందులో 20 శాతం ఎండు చేపల వాటాగా ఉంటుందని ఏపీకి చెందిన ప్రముఖ ఆక్వా రైతు ఆకురాతి దొరయ్య మాట. కేరళ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లో ఎండు చేపల వ్యాపారం మెండు. లాభదాయకమైన వ్యాపారం. తమిళనాడులో సగటు రాబడి రేటు 43.48శాతం. ఫిషింగ్ నిషేధ కాలం లేదా చేపలు చిక్కని లీన్ సీజన్లలో ఎండు చేపలకు గిరాకీ ఉంటుంది. ఏడాది పొడవునా దొరుకుతాయి. విదేశాలకూ ఎగుమతి అవుతాయి. కొండకోనల్లో ఉండే గిరిజనులకు ఎండు చేపలే ప్రధానం. లైవ్ చేపలు దొరకవు గనుక ఎక్కువ వినియోగిస్తారు. ఎండిన రొయ్యలు, ఆంకోవీస్, పోనీ ఫిష్, రిబ్బన్ ఫిష్,మాకేరెల్, షార్క్ రకం చేపలు మామూలుగా దొరుకుతాయి.
ప్రపంచంలోనే పెద్ద ఎండు చేపల మార్కెట్ ఎక్కడంటే....
అప్పటికప్పుడు తెచ్చుకునే తడి చేపలతో పోలిస్తే ఎండు చేపల్లో ప్రొటీన్ కూడా ఎక్కువే. పోషకాలకు కొరత ఉండదు. కేరళలో చేసిన ఒక సర్వే ప్రకారం ఎండు చేపల్లో 399 రకాలున్నాయి. కేరళ వంటకాల్లో ఎండు చేపలకు ప్రాధాన్యత ఉంది. అస్సాంలోని మోరిగావ్ జిల్లా మయోంగ్ సబ్ డివిజన్లోని జాగీరోడ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎండు చేపల మార్కెట్ ఉంది. ప్రతి వంద కిలోల చేపలకు 33 కిలోల ఎండు చేపలు వస్తాయి. అందుకే కాస్త రేటు కూడా ఎక్కువ. చేపల్ని పట్టుకొచ్చిన తర్వాత శుభ్రం చేస్తారు. పెద్ద చేపల్ని కోసి పేగుల్ని తీసేసి శరీరంపై గాట్లు పెట్టి ఉప్పులో 18,20 గంటలు ఊరబెడతారు. ఆ తర్వాత బయటకు తీసి ఒక రోజంతా ఎండబెడతారు. తర్వాత ప్యాక్ చేస్తారు.
ఇప్పుడొచ్చిన ముప్పేమిటంటే...
ప్లాస్టిక్‌ంమానవాళిని వెంటాడుతున్న పెద్ద సమస్య. భూగోళాన్ని పట్టిపీడిస్తున్న పెద్ద భూతం. భూమిపైన్నే కాకుండా భూమి కిందకి కూడా ఇప్పుడిది వ్యాపించింది. నింగి, నేలతో పాటు కాలువలు, కుంటలు, చెరువులు, నదులు, సముద్రాలనే తేడా లేకుండా ప్రతి జీవిని చుట్టబెడుతోంది. సుముద్రాల్లో చేరిన ప్లాస్టిక్‌ తో జలపుష్పాలకు ముప్పు తెచ్చిపెడుతోందట. ఈ ప్రమాద తీవ్రత ఎంతనే దానిపై చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రయోగం ఒకటి మన ఆంధ్రా యూనివర్శిటీ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం కూడా నిర్వహించింది. యూరోపియన్ యూనియన్‌కమిషన్‌ ఈ ప్రయోగానికి సాయపడింది.
పసుపులేటి జానకీరామ్ పరిశోధన
ఆ పరిశోధనకు మెరైన్‌ప్రాజెక్టు ప్రిన్సిపల్‌ఇన్వెస్టిగేటర్‌ఆచార్య పసుపులేటి జానకీరామ్‌నాయకత్వం వహించారు. వాళ్ల పరిశోధనలో వళ్లు గగుర్పొడిచే అంశాలు బయటపడ్డాయి. ఆయన ఏమంటారంటే ్ఙప్లాస్టిక్‌అనేక రకాలు. మనం వాటిని వాడి పారేస్తుంటాం. అవి అలా అలా చెరువులు, నదులు, సముద్రాల్లో చేరుతుంటాయి.సముద్ర జీవులు తినే ఆహారంలోనూ, తీసుకునే నీటి ద్వారా వాటి శరీరాల్లోకి వెళ్లిపోయి అలా ఉండిపోతాయి. సముద్రాల్లోని చేపలు, ఇతర జలచరాలు సముద్రంలోని నాచు (మైక్రో ఆల్గే) వంటివాటిని తింటాయి. వీటి నుంచి గాలి అంటే ఆక్సిజన్‌ను పీల్చి బతుకుతుంటాయి. ఇలా తిన్నప్పుడు ప్లాస్టిక్‌రేణువులు జలచరాల్లోకి చేరిపోతున్నాయని ఈ పరిశోధనలో తేలింది. సముద్రంలో చేపల జీర్ణకోశం, లివర్, కిడ్నీ, మొప్పలు, చేప కండరాలలోకిమైక్రో ప్లాస్టిక్‌వెళుతుంది. ఇది మరింత ముప్పుగా మారింది. దీనికి కారణం సముద్రాలు.. సూప్‌ఆఫ్‌మైక్రోప్లాస్టిక్స్‌గా మారడమే! ఏళ్ల తరబడి పేరుకుపోయిన ప్లాస్టిక్‌వస్తువులు సూక్ష్మ కణాలుగా విభజన చెంది జల చరాల శరీరంలో చేరుతున్నాయి. సీపుడ్‌ను మానవులు పెద్దఎత్తున ఆహారంగా తింటున్న క్రమంలో మైక్రో ప్లాస్టిక్‌క్రమేణా వారి శరీరాల్లోకి వచ్చి చేరుతోంది. ఇది రకరకాల వ్యాధులకు కారణమవుతాయి. సముద్ర జీవుల్లో చేరే మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించి లెక్కించి అధ్యయనం చేయటం ద్వారా పై విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అచ్చంగా ఈ రంగాన్నే ఔపోశన పట్టే నిపుణులు ప్రస్తుతం లేరు. భవిష్యత్లో అటువంటి వాళ్లను తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మా యూనివర్శిటీ పరిధిలో 50 మందిని ఎంపిక చేసి 25 మంది చొప్పున రెండు బ్యాచ్‌లలో శిక్షణ ఇచ్చాం. విశ్వ విద్యాలయ పరిశోధకులు, అధ్యాపకులు, మత్స్యశాఖ సిబ్బంది, అధికారులు, జీవీఎంసీ అధికారులూ ఇందులో భాగస్వాములయ్యారు.
అట్టడుగు నుంచే శాంపిళ్లు...
విశాఖ తీరంలోని గంగవరం నుంచి భీమునిపట్నం వరకూ సముద్రంపై నుంచి, మధ్యస్తంగానూ, అట్టడుగు ప్రాంతం నుంచి శాంపిళ్లను సేకరించాం. ఎంపిక చేసిన 50 మందీ నేరుగా ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ప్రత్యక్ష నైపుణ్య శిక్షణతో ప్రతి ఒక్కరిలో దీనిపై విస్తృత అవగాహన ఏర్పడింది. తొలి మూడు రోజుల శిక్షణలో భాగంగా రెండు రకాల చేపల్లో మైక్రో ప్లాస్టిక్స్‌పై అధ్యయనం సాగింది. ఐదు మైక్రాన్ల కంటే తక్కువ మంది కలిగిన సూక్ష్మ ప్లాస్టిక్‌కణాలు సముద్రపు నీటిలో, ఇసుకలో, చేపల్లో ఉండటాన్ని ఈ శిక్షణలో ప్రత్యక్షంగా అధ్యయనంచేశారు. నూనె కవళ్లు, పండుగప్పలో అవశేషాలు సేకరించిన సముద్రపు నీటిని వడబోసి, వ్యర్థాలను వేరుచేసి ఫొరియర్‌ట్రాన్స్‌ఫామ్‌ఇన్‌ఫ్రారెడ్‌స్పెకోట్రస్కోపీ (ఎఫ్‌టీఐఆర్‌) సహాయంతో మైక్రో ప్లాస్టిక్‌పరిమాణాన్ని గణించారు. ఇసుకలో ఉన్న మైక్రో ప్లాస్టిక్‌ను కూడా ఇలాగే లెక్కిస్తారు. చేపల్లో మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించేందుకు శరీర భాగాలను వేరుచేసి జీవ పదార్థం జీర్ణమయ్యేలా రసాయనాల ప్రక్రియ చేపట్టారు. మిగిలిన పదార్థాలను ఎండబెట్టి ఎఫ్‌టిఐఆర్‌లో పరీక్షించారు. ప్రజలు ఎక్కువగా తినే నూనె కవ్వళ్లు (ఆయిల్‌సార్డయిన్స్‌), పండుగప్ప (లాటిస్‌) చేపల్లో ఈ ప్రయోగం సాగింది. వాటి లివర్, కిడ్నీల్లో పెద్దఎత్తున మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించారు. ఈ పరిశోధనల్లో ప్రాజెక్టు కో ఇన్వెస్టిగేటర్‌డాక్టర్‌కె.ఉమాదేవి, రీసెర్చ్‌స్కాలర్లు డి.చంద్రశేఖర్, ఎస్‌.గీత తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ఆంధ్రా, కేరళ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సైప్రస్, జర్మనీ, మలేషియా, స్పెయిన్, గ్రీసు దేశాల్లో కూడా కొనసాగుతున్నాయి. ప్లాస్టిక్‌కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రధానంగా దాని వినియోగాన్ని తగ్గించాలి.బీచ్‌లో ప్రజలకు అవగాహన కల్పించటం, స్వచ్ఛత, శుభ్రతపై చెప్పడం, కరపత్రాలు పంపిణీ వంటివి చేపడుతూ ఉంటే కొంత మేలు జరగవచ్చునంటారు పసుపులేటి జానకీరామ్.
మైక్రో ప్లాస్టిక్ను తీనే రోబో.....
భూమిపై అన్ని సముద్రాల్లో సుమారు 20 కోట్ల టన్నులకు పైగా ప్లాస్టిక్‌వ్యర్థాలు ఉన్నట్లుగా నిపుణుల అంచనా. అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్‌యూనివర్శిటీ పరిశోధకులు నదులు, సముద్రాల్లోని ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌ను 2016లో కనిపెట్టారు. మెంటానా స్టేట్‌యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్‌పోర్ట్స్‌మౌత్‌పరిశోధకులు టీపీఎడీఒ ఎంజైమ్‌ను అభివృద్ధి చేశారు. 2015లో ఆస్ట్రేలియాలో రూపొందించిన బిసిన్‌వ్యాక్యూమ్‌క్లీనర్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 860 వరకూ వాడుకలోకి వచ్చాయి. కృత్రిమ మేథతో పనిచేసే బగ్గీలు, మ్యాగటిక్‌నానో స్కేల్‌స్ప్రింగ్‌లు కూడా ప్లాస్టిక్‌వ్యర్థాలను సేకరించడానికి వాడుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) సైక్లోన్‌గ్లోబల్‌నావిగేషన్‌శాటిలైట్‌సిస్టమ్‌(సివైజిఎన్‌ఎన్‌ఎస్‌) ద్వారా ప్లాస్టిక్‌వ్యర్థాల కదలికలను తెలుసుకుంటున్నారు. చైనాలోని సిచువాన్‌యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మైక్రో ప్లాస్టిక్‌ను తినే రోబోచేపను తయారు చేశారు. ఇవన్ని వస్తున్నందున చేపల్లో ప్లాస్టిక్ తగ్గి జనానికి మేలు జరుగుతుందని ఆశిద్దాం.


Next Story