
మిద్దె మీద లీఫ్ కల్చర్ !!
మొక్కల్ని కొనకుండా తామే ఉత్పత్తి చేసుకునేలా తోడ్పడాలనేదే ఆమె అభిమతం.
పూలు, కాయగూరల మొక్కల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానపు నర్సరీలపై ఆధారపడే పరిస్థితి మారే రోజులు వస్తున్నాయా? అంటు కట్టకుండానే, టిష్యూ కల్చర్‌తో పని లేకుండానే కొన్ని వారాల్లో అత్యంత సులువుగా నాణ్యమైన మొక్కల్ని తయారు చేసుకోవచ్చా? కొత్తపల్లి శోభ అద్భుత ఆవిష్కరణ గురించి తెలుసుకుంటే పై సందేహాలు తీరుతాయి. ఇంతకీ ఆమె ఏమి చేస్తున్నారో తెలుసా? ఆకులను నాటి మొక్కను తయారు చేస్తున్నారు. ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం.శోభ óస్వస్థలం సికిందరాబాద్ సమీపంలో బోయినపల్లి.
సెరికల్చర్,అగ్రికల్చర్,హార్టికల్చర్ గురించి అందరికీ తెలుసు. కానీ ఇపుడు కొత్తపల్లి శోభ లీఫ్ కల్చర్ గురించి చెబుతున్నారు. అంటే కేవలం కొన్ని రకాల మొక్కలను ఆకులతో మొక్కలు పెంచడం ... అదెలాగో తెలుసుకోవాలంటే శోభ ఇల్లు చూడాలి.
మిద్దెమీద పూలవనం
వ్యవసాయ కుటుంబంలో పుట్టి న శోభ మొక్కల పెంపకం పై మక్కువతో కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంటి మిద్దెమీద ఆకు కూరలు,కూరగాయల సాగు చేయడం మొదలు పెట్టారు.

దీనికంటే కాస్త భిన్నమైన పద్దతిలో , సులభమైన రీతిలో మొక్కల ఉత్పత్తి పద్ధతులు అన్వేషిస్తూ ఈ అర్బన్ మహిళ వినూత్నమైన ‘లీఫ్ కల్చర్’ ( Leaf Culture ) పద్ధతిని కనుగొన్నారు. పచ్చి ఆకును నాటి, వేర్లు మొలిపించడం ద్వారా అత్యంత నాణ్యమైన మొక్కను తయారు చేయడం అనే అద్భుత ఆవిష్కరణతో ఆమె మొక్కల పెంపకంలో వినూత్న దిశగా అడుగులు వేస్తున్నారు.

లీఫ్ కల్చర్‌తో పెంచిన మొక్కలను చూపిస్తున్న శోభ
మూడు వారాల్లో మొక్కలు!!
‘‘ విత్తనాలతో, షూట్ టిప్ కటింగ్స్‌తో, ఇతరత్రా కణజాలాలతో నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేయగలుగుతున్నప్పుడు.. పచ్చి ఆకును నాటి ఎందుకు మొక్కను ఉత్పత్తి చేయకూడదు? అనే ఆలోచనతో ప్రయోగాలు ప్రారంభించాను. ఈ క్రమంలో ఎదురైన వైఫల్యాలను అధిగమిస్తూ ఎట్టకేలకు పచ్చి ఆకులు నాటి ఇరవై రోజుల్లో తులసి,మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ ఆకుల నుండి మొక్కలను ఉత్పత్తి చేయగలిగాను.’’ అంటారు శోభ.

ఆకుకు వేర్లు మొలిపించేది ఇలా..
1. తొలుత, మీకు అవసరమైన మొక్క నుంచి పచ్చి ఆకును తొడిమతో పాటు తుంచాలి.
2. ఆ ఆకును తులసి రసంలో అరగంట సేపు నానబెట్టాలి. తరువాత గాజు గ్లాసులో సగం వరకు నీళ్లు పోసి.దానిలో ఆకును పెట్టాలి, రెండు రోజులకోసారి మరికొంత నీటిని చేర్చాలి. 10 నుండి 15 రోజుల్లో వేర్లు పెరుగుతాయి. అపుడు ఆ మొక్కను తీసి మట్టిలో నాటాలి.
4, పుదీన, తులసి ,మనీప్లాంట్‌లను లీఫ్ కల్చర్‌లో శోభ పెంచుతున్నారు.
కొన్ని క్రోటన్ జాతి ఆకులతో కూడా మొక్కలను పెంచుతున్నారు.

లీఫ్ కల్చర్‌లో పెంచిన మొక్కలతో శోభ
నాలుగు వారాల్లో ఆకుకు వేర్లు మొలుస్తాయి. మరో 4 నుండి 5 వారాల్లో ఆకు పక్కనే మొక్క పెరుగుతుంది. క్రమంగా ఆకులు వస్తాయి అని వివరించారు శోభ.
అరుదైన పండ్ల మొక్కలు
హిమాచల్ ప్రదేశ్ వంటి శీతల ప్రాంతాల్లో పెరిగే స్ట్రా బెర్రీ పండ్ల మొక్కలను ఆమె మేడ మీద కుండీల్లో పెంచుతున్నారు. విదేశాల్లో పెరిగే అరుదైన ఔషద గుణాలున్న బ్రొకోలి (క్యాలిఫ్లవర్ జాతి) ని కూడా సాగు చేస్తున్నారు. బొడ్డు మల్లె, సన్నజాజి, కనకాంబరం తో పాటు పదిరకాల బంతి పూల జాతులను చూడవచ్చు. క్యాబేజీ, మెంతి, కొత్తి మిర తో పాటు కొన్ని పండ్ల జాతుల మొక్కలను పూర్తి సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నారు.

శోభ మిద్దెమీద పెరిగిన బ్రకోలి
లీఫ్ కల్చర్‌పై అవగాహన !
ఆకులతో మొక్కల్ని ఉత్పత్తి చేయడం చాలా సులువు. రైతులు,గృహిణులే కాదు, స్కూలు పిల్లలు కూడా ఇది నేర్చుకోగలుగుతారు. యంత్రాలు, ప్రయోగశాలలు అవసరం లేదు.కాస్త ఓపిక ఉంటే చాలు అవగాహన కల్పిస్తాను అంటున్నారు కొత్తపల్లి శోభ.

శోభ మిద్దెమీద పెరిగిన స్ట్రాబెర్రీ
ఇప్పటికే చాలా మందికి ఆకులతో మొక్కల్ని ఉత్పత్తి చేసే పద్ధతిపై శిక్షణ ఇచ్చారు. రూపాయి కూడా ఫీజు చెల్లించనక్కరలేదు. మొక్కల్ని కొనకుండా తామే ఉత్పత్తి చేసుకునేలా తోడ్పడాలనేదే ఆమె అభిమతం.
లీఫ్ కల్చర్ అంటే ఏమిటి?
ఇది మొక్కల ఆకులను (పూర్తిగా లేదా ముక్కలుగా) మట్టిలో, నీటిలో లేదా ప్రత్యేక కల్చర్ మీడియాలో నాటి కొత్త మొక్కలను పుట్టించే పద్ధతి.
ఆకులో ఉండే meristematic tissues (కొత్త కణాలు పెరుగే భాగాలు) వేర్లు, కొమ్మలు తయారు చేసి, స్వతంత్రంగా మొక్క అవుతుంది. లీఫ్ కల్చర్ అనేది ఆకును "విత్తనంలా" వాడి మొక్క పుట్టించే శాస్త్రీయ ఉద్యాన పద్ధతి.
ఇది ఎక్కడ మొదలైంది?
శాస్త్రీయంగా ఇది హార్టికల్చర్ (ఉద్యానవనం) మరియు టిష్యూ కల్చర్ పరిశోధనల్లో అభివృద్ధి చెందింది.
ఆరంభంగా ఇది 19వ శతాబ్దం చివరలో యూరప్ లో గార్డెనింగ్ పద్ధతిగా మొదలైంది.
ఆ తర్వాత 20వ శతాబ్దం మధ్యలో ప్లాంట్ టిష్యూ కల్చర్ లాబొరేటరీల్లో దీనిని శాస్త్రీయ పద్ధతిగా అభివృద్ధి చేశారు.
దీనికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్:
అతి తక్కువ భాగం నుంచే మొక్క పుడుతుంది → విత్తనాలు అవసరం లేదు.
ఆర్థికంగా ఉపయోగకరమైన మొక్కల (అలంకార మొక్కలు, గృహ ఉద్యానవనం, ఔషధ మొక్కలు) పెంపకంలో వాడతారు.
బహుళ ఉత్పత్తి సాధ్యమవుతుంది → ఒకే ఆకుతో అనేక మొక్కలు తయారు చేయవచ్చు.
సాధారణంగా ఉపయోగించే మొక్కలు: Bryophyllum (అమృత వల్లి), Begonia, African Violet, Sansevieria (snake plant), Aloe vera మొదలైనవి.
ప్రకృతి లో సహజంగా కొన్ని మొక్కలు ఆకుల గాయాల దగ్గరే కొత్త మొక్కలు పుడతాయి (ఉదా: Bryophyllum ఆకుల అంచుల్లో చిన్న మొక్కలు పుడతాయి).
టిష్యూ కల్చర్ లాబ్‌లలో ఆకుల ముక్కల నుండి కొత్త మొక్కలను కల్చర్ మాధ్యమంలో పెంచి, తరువాత వాటిని పొలాల్లో నాటుతారు.