
ఢిల్లీ కాలుష్యంపై పార్లమెంటు వద్ద ప్రతిపక్షాల నిరసన
తక్షణం యాక్షన్ ప్లాన్ ప్రకటించాలన్న వయానాడ్ ఎంపీ ప్రియాంక..
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution,) బాగా పెరిగిపోయింది. పిల్లలు, వృద్ధులు తరుచూ అనారోగ్యం బారినపడుతున్నారు. గాలి నాణ్యత బాగా పడిపోయిన నేపథ్యంలో కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టాలని కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు మాస్కులు ధరించి గురువారం పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగాయి. మకర ద్వార్ వెలుపల వివిధ పార్టీల నాయకులు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. వాయు కాలుష్యం కారణంగా కొంతమంది పిల్లలు చనిపోతున్నా.. ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదు. నాలాంటి వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు" అని సోనియా గాంధీ విలేకరులతో అన్నారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపక్ష నాయకులలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ..వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"వాయు కాలుష్యం రాజకీయ సమస్య కాదు. ప్రభుత్వం ఖచ్చితమైన చర్య తీసుకోవాలి,’’అని పేర్కొన్నారు. దీపావళి తర్వాత ఢిల్లీ గాలి నాణ్యత సరిగా లేకపోవడంతో ఇబ్బంది పడుతోంది.

