
Image Source: writinginsidevt
పైకి లేస్తాను ...
ఆదివారం అనువాద కవిత
నీ కాఠిన్యం, అబద్దాలతో
చరిత్రలో నన్ను రాసుకోవచ్చు
నువ్వు నన్ను బురదలో నడిపించవచ్చు
కానీ,ధూళిలాగా యింకా పైకి లేస్తాను
నా అలక్ష్యం నిన్ను కలత పెట్టిందా?
ప్రమాదకారిగా వున్నావెందుకు?
నా గది నిండా చమురు బావుల వత్తిడి వున్నట్లు
నేను నడుస్తున్నాను
సూర్య చంద్రుల్లాగా
నిశ్చయమైన ఆటుపోట్లతో
అధికమైన ఆశలున్నాయి
పైకి లేస్తాను
తల వంచుకుని,కళ్ళు దించితే?
రాలిన కన్నీటి బిందువుల్లా భుజాలు వొంగిపోతే?
నా అంతరాత్మ యేడ్పులతో చిక్కిపోతే?
నేను దెబ్బతింటే చూడాలని ఉందా?
నేను వెంటాడటం నీకు బాధగా వుందా?
దానిని భయానకమైనదిగా తీసుకోకు
నా సొంత పెరటిలో తొవ్వుతున్నపుడు
బంగారు గని దొరికినట్లు నవ్వుతాను
నీ గొడవతో నన్ను కాల్చవచ్చు
నీ చూపులతో నన్ను చీల్చవచ్చు
నీ ద్వేషంతో నన్ను చంపవచ్చు
కానీ,గాలిలాగా యింకా పైకి లేస్తాను
నా లైంగికాకర్షణ నిన్ను నిరుత్సాహపరిచిందా?
అది విస్మయపరిచిందా?
అయితే,నా తొడలు కలిసే దగ్గర
నాకు వజ్రాలు దొరికినట్టు చిందేస్తాను
గుడిసెలు లేని చరిత్ర సిగ్గు లేనిది
పైకి లేస్తాను
గతం నుంచి పాతుకుపోయిన బాధ సెలేస్తున్నది
పైకి లేస్తాను
నేనొక నల్ల సముద్రాన్ని
ఎగిసిపడుతున్న విశాలమైనదాన్ని
మరుగుతున్న బావిని
నేను ఆటుపోట్లను భరిస్తాను
భయాల,భయోత్పాతాల రాత్రులను వెనక వొదిలి
పైకి లేస్తాను
ఒక వేకువ లోకి అద్భుతం,అది స్పష్టం
పైకి లేస్తాను
నా పూర్వీకులు ఇచ్చిన బహుమతులను
తీసుకొని వస్తాను
నేను బానిస కలను,ఆకాంక్షను
నేను ఎదుగుతాను
నేను అభివృద్ధి చెందుతాను
నేను లేస్తాను
ఇంగ్లీష్ : Still I Rise by Maya Angelou
తెలుగు: కృపాకర్ మాదిగ
Next Story