తిరుమల కొండ అంచున శతాబ్దాల సాక్షి ఈ ఒంటరి మండపం
x

తిరుమల కొండ అంచున శతాబ్దాల సాక్షి ఈ ఒంటరి మండపం

ఈ మండపం తిరుపతికి 23 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. అలిపిరి కాలిబాట నుంచి యోగ నరసింహాలయం నుంచి ఎడమకు ట్రెక్ చేసుకుంటూ వెళ్తే కొండల అంచున నిలబడి కనిపిస్తుంది.


ఎన్నిసార్లు వెళ్లినా తనివి తీరని ట్రెక్ ఇది. 2020 ఆగస్టులో మళ్లీ వెళ్లాను. అంతుకు ముందు ఎన్నిసార్లు వెళ్లానో లెక్కలేదు. తర్వాత 2021 జూన్ కరోనా సమయంలో వెళ్లాను. ఆ జ్ఞాపకాలు ఇవి.



(భూమన్)



అయిదు శ‌తాబ్దాల నాటి గంటమండ‌పం ఇది. ఇక్క‌డ‌ గంట లేదు కానీ, రాతి మండ‌పం మాత్రం మిగిలి ఉంది. ఇప్పుడీ గంట ఎక్క‌డున్న‌ద‌నేది ప్ర‌శ్న‌. తిరుమల ఆల‌యంలోనే ఉందరి కొందరు చెబుతారు. విజ‌య‌గ‌న‌ర చ‌క్ర‌వ‌ర్తుల కాలంలో నిర్మించిన మండ‌పం ఇది.


మండపంలో కూర్చున్న చరిత్రపరిశోధకుడు భూమన్


ఈ మండపం తిరుపతికి 23 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. అలిపిరి కాలిబాట నుంచి యోగ నరసింహాలయం దాకా వెళ్లాలి. అక్కడి నుంచి ఎడమ వైపునకు ట్రెక్ చేసుకుంటూ వెళ్తే తిరుమల కొండల అంచున నిలబడి మండపం కనిపిస్తుంది. ఇక్కడి చేరుకోవడం చాలా కష్టం. అదొక చిన్నసాహస యాత్ర. ఒక గొప్ప అనుభవం.


గుప్తనిధుల కోసం మండపంలో నేల నంత తవ్వేశారుు


పూర్వం ఈ మండపంలో ఒక పెద్ద గంట వేళాడుతూ ఉండిందట. బహుశా ఈ గంట కోసం ఈ మండపం కట్టారేమో. తిరుపతి సమీపంలో చంద్రగిరి కోట ఉంది. విజయనగర రాజు రామదేవరాయ ఈ ప్రాంతాన్ని చంద్రగిరి రాజధానిగా పరిపాలించేవాడు.

తిరుమలేశుడికి ప్రసాదం సమర్పించిన తర్వాత భోజనానికి ఉపక్రకమించడం ఆయనకు అలవాటు. తిరుమల వెంకటేశ్వరుడికి ప్రసాదం సమర్పించగానే ఆ కబురు రామదేవరాయుడికి చేరవేయాలి. అపుడే భోజనానికి కూర్చుంటారు. ఈ కబురు ఏక్కడో దూరాన ఉన్నరాజుకుఎలా చేరవేయాలి. ఒక సైనికుడు గుర్రం మీద వెళ్లి మెసేజ్ అందించడం సాధ్యంకాదు. అందువల్ల గంటనాదం సిగ్నల్ ఎంచుకున్నారు.




గంట మోగించడం ఒక అనుకూలమయిన పద్ధతి. ప్రసాదం శ్రీవారికి సమర్పించగానే ఈ గంట మోగేది. అపుడు రాజుగారు గంటానాదం విని భోజనానికి ఉపక్రమించే వారు. అయితే, ఈ గంట ఎలా మోగేది? శ్రీవారికి నైవేద్యం పెట్టగానే, అక్కడి నుంచి ఒక మనిషి వచ్చి ఈ గంట మోగించాలి.అంతేనా?

ఆలయం దగ్గిర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి గంట మోగించాలి. ఇది కూడా ఆచరణ సాధ్యం కాదు. మరి ఈ కొండ చివరన ఉన్న ఈ గంటను మోగించడమెలా?

దీని కొక గాధ ప్రచారంలో ఉంది. శ్రీవారికి నైవేద్యం పెట్టగానే తిరుమల ఆలయం గంటని పెద్దగా మోగిస్తారు. అపుడు ఆ గంట నుంచి వెలువడే శబ్ద తరంగాలు ఇక్కడికి చేరుకునేవి. ఆ ప్రకపంనలతో ఈ గంట మోగేదని చెబుతారు. ఇది సైంటిఫిక్ గా నిరూపించడం కష్టం. అయితే, ఇదొక గాధ మాత్రమే.

మొత్తానికి కొండ చివరన, చంద్రగిరి ముఖంగా ఈ మండపం ఉండటం వల్ల ఈ గాథ ప్రచారమయ్యేందుకు కారణం కావచ్చు. ఈ మండపం దగ్గిర నుంచి చూస్తే చంద్రగిరి కోట, స్వర్ణముఖి నది కనబడతాయి.

ఈ గంటని 1614-1630లో రఘనాధ యాచమనాయకుడనే వ్యక్తి చంద్రగిరి రాజుకు బహూకరించారని చెబుతారు. అదీ సంగతి.




ఈ రాతి స్తంభాల‌నుకు పునాది లేదు. నిటారుగా నిలబెట్టారు. స్తంభాల మీద రాతి బండ‌ల‌తో క‌ప్పు వేశారు. ఏమాత్రం పునాదిలేకుండా, కేవ‌లం రాళ్ళ పైన నిల‌బెట్టిన ఈ మండ‌పం శతాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఎలా నిల‌బ‌డింద‌నేది ప్ర‌శ్న! మండ‌పం మ‌ధ్య‌లో కూడా రాళ్ళ‌ను ప‌రిచారు.

2020 నాటి చిత్రం ఇది.


2020లో గంట మండపానికి వెళ్లూ...


గంట మండపానికి దారి అంటూ ఉండదు. దారిచేసుకుంటూ ముందుకు సాగాలి.

ఇదే

ఇదే దారి అనుకోవాలి... వెళ్తూ ఉండాలి


గుప్త నిధుల కోసం ఎవ‌రో మండ‌పం మ‌ధ్య‌లో త‌వ్వేశారు. ఈ మండపం ఎన్ని తుపానుల‌ను త‌ట్టుకుందో! ఎన్ని ప్ర‌కృతి భీభత్సాల‌కు ఎదురొడ్డి నిల‌బ‌డిందో! ప‌ద‌హార‌వ శ‌తాబ్దంలో నిర్మించిన ఈ మండ‌పం ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌కుండా ఉంది.




మండపం సమీపం నుంచి దూరాన తిరుపతి పట్టణం చూడవచ్చు


ఈ గంట మండ‌పంలో విశ్ర‌మించడం ఒక గొప్ప అనుభూతి. అక్కడనిలబడి చూట్టూర కలియ చూస్తూ ఎంతసేపయినా గడపవచ్చు.



Read More
Next Story