
మీరు కుక్కను పెంచుకోవాలనుకుంటున్నారా, ఈ విషయాలు తెలుసుకోండి!
కుక్కల దాడులు ఎందుకు పెరుగుతున్నాయి? ముందు జాగ్రత్తలేమిటి?
హైదరాబాద్: ఇటీవల దేశవ్యాప్తంగా పెంపుడు, వీధి కుక్కల దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం చిన్న గాయాలతోనే కాకుండా, కొన్ని ఘటనల్లో ఈ దాడులు ప్రాణాంతకంగా మారి మరణాలకు దారి తీస్తున్నాయి. వీధి కుక్కల దాడులతో చిన్నారులు మృతిచెందిన సంఘటనలు కూడా పెరిగిపోతున్నాయి.
భారతదేశంలో కుక్కల దాడుల గణాంకాలు: ఏటా 9.1 మిలియన్ మందిపై కుక్కల దాడులు జరుగుతున్నట్లు అంచనా. దాదాపు 5,700 మంది రేబిస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.2024లో దేశవ్యాప్తంగా 22 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. 2025 (జనవరి – మార్చి) నాటికి తమిళనాడులో 1.24 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ (2024): అత్యధికంగా 21,131 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. మేడ్చల్-మల్కాజ్‌గిరి : 14,685 కేసులు – రంగారెడ్డి జిల్లాలో 3,998 కేసులు నమోదయ్యాయి.
కుక్కలు ఎందుకు ఆక్రోశంగా మారుతున్నాయి?
సాధారణంగా విశ్వాసానికి, విధేయతకు ప్రతీకగా భావించే కుక్కలు ఆకస్మికంగా దాడులకు దిగడంపై పరిశోధనలు జరిగాయి. కుక్కలు వాహనాలను వెంబడించే కారణాలు & నివారణ మార్గాలు
కుక్కలు వాహనాలను వెంబడించే ప్రధాన కారణాలు
కుక్కలు సహజంగా తమచుట్టూ కదలికలపై అప్రమత్తంగా ఉంటాయి. కుక్కల వేటాడే ప్రవృతి వలన కదిలే వస్తువుల్ని వెంబడించడం వాటి సహజ లక్షణం. వాహనం తమ పరిసరాల్లోకి వస్తే, అది వాటికి ప్రమాదం అని భావించి తమ ప్రాంతాన్ని కాపాడుకొనేందుకు వాహనాల వెంట పడతాయి . కొన్నిసార్లు కుక్కలు వాహనాలను వెంబడించడం సరదాగా భావిస్తాయి. ఆటగా అనుకుని పరుగెడతాయి, దీని వల్ల ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
పెద్ద శబ్దం చేసే బైక్‌లు, కార్లు కుక్కలకు భయాన్ని కలిగిస్తాయి. అందువల్ల అవి తమను రక్షించుకునే ప్రయత్నం లో దాడి చేస్తాయి. కొన్ని కుక్కలకు వాహనాలతో మునుపటి ఛేదు అనుభవాలు ఉంటాయి. వాహనాల వలన గాయపడిన సంఘటనల వల్ల కూడా , కుక్కలు వాహనాలను వెంబడించే అలవాటు పెంచుకుంటాయి.
నివారణ మార్గాలు
* పిల్లి కుక్కలకు చిన్నప్పటి నుంచి వాహనాల పరిచయం చేయాలి
*కుక్కలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నెమ్మదిగా డ్రైవ్ చేయాలి
* ప్రయత్నించి హార్న్ మోగించకూడదు, ఇది మరింత రెచ్చగొట్టవచ్చు
పై సూచనలు పాటించడం వలన వాహనదారులకు , జంతువులకూ మేలు కలుగచేస్తాయి.
ఆ ఆక్రోశం వెనుక ప్రధానంగా ఆహార లోపం, శిక్షణ లేకపోవడం, అనారోగ్యం, ఒత్తిడి, ఆవాస సమస్యలు వంటి కారణాలు కూడా ఉంటాయి. అవెలాంటివో చూద్దాం.
1. పెంపుడు జంతువుల సంరక్షణలో లోపాలు: తగిన ఆహారం, నీరు అందించకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఎప్పుడూ తాడుతో కట్టేయడం , వైద్య సేవలు నిర్లక్ష్యం చేయడం. ఇవన్నీ కుక్కల్లో ఆందోళన, ఆక్రోశం, హింసాత్మక ప్రవర్తన కలిగిస్తాయి.
2. సరైన శిక్షణ లేకపోవడం: చిన్నతనం నుంచే సరైన ప్రవర్తనా శిక్షణ ఇవ్వకపోతే, కుక్కలు తమ సహజ ప్రవృత్తికి లోబడి హింసాత్మకంగా మారతాయి. ఆక్రోశ నియంత్రణ శిక్షణ లేకపోవడం కూడా ప్రధాన సమస్య.
3. ప్రత్యేక ఆరోగ్య సమస్యలు: హార్మోన్ల అసమతుల్యత, నరాల సమస్యలు కుక్కల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. రాట్విలీర్, డాబర్మాన్, పిట్ బుల్ వంటి కొన్ని జాతుల కుక్కలు సహజంగానే ఆగ్రహ స్వభావం కలిగి ఉంటాయి.
4 వృద్ధాప్యం: వయస్సు పెరిగేకొద్దీ మెదడు సమస్యలు (Dementia) వల్ల కుక్కలు ఆకస్మిక దాడులకు పాల్పడవచ్చు.
5. ఆకలి మరియు ఆహార సమస్యలు: పోషకాహార లోపం వల్ల మానసిక స్థితి ప్రభావితమవుతుంది. తినే సమయంలో అడ్డొస్తే కొన్ని కుక్కలు హింసాత్మకంగా ప్రవర్తించే అవకాశం ఉంది.
5. యజమానుల ప్రవర్తన & పరిసరాలు: ఇంట్లో గందరగోళ వాతావరణం, అధిక శబ్దాలు కుక్కలను ఒత్తిడికి గురిచేస్తాయి.
6. దుర్వినియోగం: కొందరు యజమానులు తమ కుక్కలను కొట్టడం వల్ల అవి ప్రమాదకరంగా మారతాయి.
7.సహజ పరిరక్షణ స్వభావం: కొన్ని కుక్కలు తమ యజమానులను కాపాడే క్రమంలో దాడులకు దిగుతాయి.
కుక్క దాడుల హెచ్చరిక సంకేతాలు – ముందు జాగ్రత్త తీసుకోవాలి!
కుక్కలు దాడి చేసేముందు కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తాయి. వాటిని ముందే గుర్తించడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చు.
శరీర భాష: మెడ వెనుక వెంట్రుకలు నిటారుగా లేవడం, పళ్ళు చూపించడం, గట్టిగా మొరిగడం, తోక నిటారుగా నిలబెట్టడం యజమాని ఆజ్ఞలకు స్పందించకుండా దృష్టిని కేంద్రీకరించడం
దాడి చేయబోయే కుక్క ఎదురైతే ఏమి చేయాలి?
* పారిపోవద్దు – పరుగెత్తితే, కుక్క వెంటపడే అవకాశం ఉంది.
* నేరుగా కుక్క కళ్ళలో చూడవద్దు – కుక్కలకు ఇది సవాలు విసిరినట్లే.
*నెమ్మదిగా వెనక్కి వెళ్లండి – హఠాత్తుగా కదలకుండా, క్రమంగా వెనక్కి వెళ్లాలి.
*అడ్డుగా ఉన్న వస్తువులను ఉపయోగించండి – బ్యాగ్, కర్ర వంటి వస్తువులను అవరోధంగా ఉంచండి.
*కుక్క కరిచిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలు
* గాయాన్ని సబ్బుతో 5 నిమిషాలు కడగాలి, యాంటీసెప్టిక్ అప్లై చేయాలి.
*రక్తస్రావం ఉంటే శుభ్రమైన గుడ్డతో గట్టిగా కట్టు వేయాలి.
*యాంటీ-రేబిస్ & యాంటీ-టీటెనస్ టీకాలు వేయించుకోవాలి.
* కుక్క ప్రవర్తనను గమనించి వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించాలి.
ప్రమాదాన్ని తగ్గించడానికి ఏం చేయాలి?
* పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ చేయించాలి.
*సరైన శిక్షణ & వ్యాయామం ఇవ్వాలి.
* ఆహారం, నీరు సమర్థంగా అందించాలి.
*అధికంగా ఆక్రోశం ప్రదర్శించే జాతులను జాగ్రత్తగా పెంచాలి.
పెంపుడు కుక్కలకు తప్పనిసరి టీకాలు – యజమానులు పాటించాల్సిన నిబంధనలు
పెంపుడు జంతువులను,ప్రత్యేకించి కుక్కలను ప్రేమతో పెంచే ప్రతి యజమాని వాటి ఆరోగ్యాన్ని సమర్థవంతంగా పరిరక్షించాల్సిన బాధ్యత వహించాలి. కుక్కలకు సమయానికి అవసరమైన టీకాలు వేయించకపోతే, వారు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రజలు కూడా రేబిస్ (Rabies) వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి, కుక్కల ఆరోగ్య రక్షణ కేవలం ఒక వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాకుండా, సమాజ భద్రతకూ అవసరమైన అంశంగా మారింది.
భారతదేశంలోని చట్టాలు మరియు నిబంధనలు
1. రేబిస్ నియంత్రణ చట్టం – 1964
భారతదేశంలో 1964 రేబిస్ నియంత్రణ చట్టం ప్రకారం, పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించాలి. టీకాలు వేయించనట్లయితే, సంబంధిత మునిసిపల్ సంస్థలు కఠిన చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంటాయి.
2. మునిసిపల్ నిబంధనలు
దేశంలోని చాలా నగరాలు మరియు పట్టణాల్లో స్థానిక మునిసిపల్ కార్పొరేషన్లు ఈ నిబంధనలను అమలు చేస్తాయి. దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (DMC), బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) వంటి సంస్థలు పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణ కోసం కఠిన నియమాలను పాటిస్తూ, వాటి అమలును నిర్బంధంగా కొనసాగిస్తున్నాయి.
3. పెంపుడు జంతువుల లైసెన్సింగ్
కొన్ని నగరాల్లో పెంపుడు జంతువుల లైసెన్స్ పొందడానికి, కుక్కలకు టీకాలు వేయించడాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. బెంగళూరు (BBMP), ముంబై (BMC), చెన్నై (CMC) లాంటి నగరాల్లో ఈ విధానం కచ్చితంగా అమలులో ఉంది.
టీకాలు వేయించనట్లయితే యజమానులకు జరిమానా & శిక్ష
భారతీయ శిక్షాస్మృతి ప్రకారం కుక్కలకు టీకాలు వేయించని యజమానులకు ₹500 - ₹5000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని నగరాల్లో, కోర్టులో విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దాడి తీవ్రతను బట్టి, ఒకటి లేదా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించవచ్చు (అయితే, ఇది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది).
యజమానులు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు
రేబిస్, DHPP, లెప్టోస్పైరోసిస్ వంటి ముఖ్యమైన వ్యాధుల నివారణ టీకాలను సమయానికి వేయించాలి. స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ నిబంధనలను తెలుసుకోవాలి మరియు వాటిని కచ్చితంగా పాటించాలి. టీకాల రికార్డ్‌ను భద్రంగా ఉంచాలి, ఎందుకంటే కొన్ని నగరాల్లో పెంపుడు జంతువుల లైసెన్స్ పొందేందుకు ఇది అవసరం అవుతుంది.
తమ పెంపుడు జంతువుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, సమాజం భద్రతకూ సహకరించాలనే బాధ్యతను యజమానులు గుర్తించాలి. కుక్కలకు టీకాలు వేయించడం ద్వారా, ప్రమాదకర వ్యాధుల నియంత్రణలో భాగస్వాములు ఖచ్చితంగా కావలి .