గోలి మధు ఆరు మినీ కవితలు
x

గోలి మధు ఆరు మినీ కవితలు

నేటి రాజకీయ నిస్సహాయ పరిస్థితి మీద గోలి మధు రాసిని అరు మినీ రాజకీయ కవితలు




గోలి మధు



హవ్వ

ఆకులు రాలిన

ప్రజాస్వామ్య వృక్షం నీడన

ఒక్క శాతం

ప్రజా బలం లేని పార్టీకి

పాతిక మంది ఎంపి లు


భేతాళ ప్రశ్న


ఈ వి ఎం వద్దు

బ్యాలెట్ ముద్దంటూ

ప్రజా సంఘాల రోదన

ప్రతి పక్షాల మౌనం

భేతాళ ప్రశ్న !

మత్తు


క్వార్టర్ మత్తు

మనిషికి కిక్కు

మతం మత్తు

దేశానికే కిక్కు

మత్తులో మనిషి

చిత్తు చిత్తు !

స్వాహా


సీసా మారింది

మద్యం ముదిరింది

డెబ్బై ఆరేళ్ల క్రితం

విదేశీయుల స్వాహా

డెబ్బై ఆరేళ్లుగా

స్వపాలకుల స్వాహా

కర్తవ్యం


గుడి గోపుర నీడనున్న

ఓ బ్యాలెట్ నుంచి

కులం వాసన

ఇంకో బ్యాలెట్ నుంచి

మద్యం దుర్వాసన

మరో బ్యాలెట్ లో

ధన దుర్గంధం

చూపుడు వేలి సిరాతో

చిత్తు చేసేదెపుడు

వంచన కళ


లౌకికవాదానికి

వేసిన ఓటు

వంచన కళతో

మతవాదుల

పంచన చేరింది !



Read More
Next Story