తెలంగాణలో వరకట్న పిశాచాలు... 5 ఏళ్ళ‌ల్లో 776 డౌరీ డెత్‌లు
x

తెలంగాణలో వరకట్న పిశాచాలు... 5 ఏళ్ళ‌ల్లో 776 డౌరీ డెత్‌లు

వరకట్న వేధింపులు తగ్గలేదు! అవి 498ఏ కేసుల్లో దాగి ఉన్నాయి...


తెలంగాణలో వరకట్న వేధింపులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో అత్తవారింట అడుగుపెట్టిన కోడళ్లను, కట్నం కోసం తీవ్రంగా హింసిస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో 1304 మంది మహిళలు వరకట్నం వేధింపులతో మరణించారు. 2019 నుంచి 2023 వరకు ఆంధ్రప్రదేశ్లో 526 తెలంగాణ రాష్ట్రంలో 776 కేసులు నమోదయ్యాయి. గత ఆరేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకుపైగా వరకట్న వేధింపుల కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనం. 2020 జనవరి నుంచి 2025 సెప్టెంబర్‌ వరకు తెలంగాణలో 51,586 వరకట్న వేధింపుల కేసులు నమోదైనట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. తెలంగాణ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఈ గణాంకాల ప్ర‌కారం రాష్ట్రంలో ఈ ఏడాది వరకట్న మరణాల (సెక్షన్‌ 304 బీ) కేసులు భారీగా నమోదయ్యాయి.

వరకట్నం చావుల పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. "ఈ ఘటనలు అత్యంత దారుణాలు. సభ్య సమాజానికి చెరగని మచ్చలు" అని న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఓ వైపు వరకట్నం పద్థతిపై చట్టపరమైన నిషేధం అమలులో ఉంది. అయితే తెరవెనుక ఈ దురాచారం సాగుతూనే ఉంది. దీనితో వరకట్నం వేధింపులతో వేలాది మంది మహిళలు అకాలమరణం చెందుతున్నారు. ఇది అమానుషం అని తెలిపారు.

2023లో 14 శాతం నేరాలు పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తన నివేదికలో వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. ఆ ఏడాది 15,489 వరకట్న వేధింపు కేసులు నమోదయ్యాయి. ఈ వేధింపుల కారణంగా 6,156 మంది మహిళలు మృతి చెందారు. అయితే 2021లో చూసుకుంటే వరకట్న నిషేధ చట్టం కింద 13,568 కేసులు నమోదు కాగా 2022లో ఈ సంఖ్య 13,479కి తగ్గింది. కానీ 2023లో మాత్రం మళ్లీ కేసులు పెరిగాయి.

దేశంలో ప్రతి రోజు దాదాపు 20 మంది మహిళలు వరకట్నం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బం డి సంజయ్‌ సమాధానం ఇచ్చారు. 2017 నుంచి 2021 వరకు… 35 వేలకుపైగా వరకట్న మరణాలు నమోదయ్యాయి.

2022లో 6,400కి పైగా, 2023లో 6,100కి పైగా కేసులు. అంటే… రోజుకు సగటున 20 మధ్య మహిళలు చనిపోతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఇంకా షాకింగ్‌గా ఉంది.

తెలంగాణలో 2021లో కేవలం 5 వరకట్న కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కానీ, 175 మంది మహిళలు చనిపోయారు. 2023లో మళ్లీ కేవలం 4 కేసులు కానీ 145 మరణాలు. అంటే… నేరాలు జరుగుతున్నాయి. కానీ సరైన చట్టం కింద కేసులు నమోదు కావడం లేదు.

2022లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో 100 కేసులు. 298 మరణాలు.

తెలంగాణలో కేవలం 6 కేసులు. కానీ 137 మరణాలు.

వరకట్నాన్ని అరికట్టేందుకు చట్టాలు ఉన్నాయి.

1961 వరకట్న నిషేధ చట్టం ఉంది.

గృహ హింస నిరోధక చట్టం ఉంది.

కొత్త క్రిమినల్ చట్టాలు కూడా ఉన్నాయి.

వన్ స్టాప్ సెంటర్స్ 181

హెల్ప్‌లైన్ 112

పోలీస్ స్టేషన్లలో మహిళల హెల్ప్ డెస్కులు.

సహాయం అందించడానికి వ్యవస్థలు ఉన్నాయి. ఇన్ని చర్యలు ఉన్నా వరకట్నం మ‌ర‌ణాలు జ‌రుగుతూనే వున్నాయి.

వరకట్నానికి సంబంధించిన కేసులు: మూడు రకాలుగా నమోదవుతాయి.

1) డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. అంటే… నేరుగా వరకట్నం డిమాండ్ చేసినప్పుడు.

2) ఐపీసీ 304బి. అంటే వరకట్న మరణం.

3) ఐపీసీ 498ఏ. అంటే భర్త లేదా అత్తింటి వేధింపులు.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. వరకట్న వేధింపుల అసలు చిత్రం ఎక్కువగా 498ఏ కేసుల్లోనే కనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే డౌరీ యాక్ట్ కింద కేసులు కొన్ని వందలే ఉన్నాయి.

కానీ… 498ఏ కేసులు మాత్రం 10 వేలకుపైగా ఉన్నాయి.

ఇక తెలంగాణ పరిస్థితి ఇంకా ఆందోళనకరం.

డౌరీ యాక్ట్ కేసులు కేవలం 5 నుంచి 10 మధ్యలోనే ఉంటాయి.

కానీ వరకట్న మరణాలు మాత్రం 100 నుంచి 150 వరకు నమోదవుతున్నాయి.

వరకట్న వేధింపులు భారీగా జరుగుతున్నాయి. కానీ వేరే సెక్షన్ కింద నమోదు అవుతున్నాయి.

ఇది ఏమి చెబుతోంది? అసలు సమస్య పోలీస్ రిజిస్ట్రేషన్ ప్యాటర్న్‌లోనే ఉంది. చాలా కేసులు 498ఏ కింద నమోదు అవుతున్నాయి. డౌరీ యాక్ట్ కింద కేసులు మాత్రం చాలా తక్కువ. దీంతో బయటకు కనిపించే డేటా ఏమంటుంది? సమస్య తక్కువగా ఉన్నట్టే కనిపిస్తుంది.

కానీ వాస్తవం ఏమిటంటే వరకట్న వేధింపులు తగ్గలేదు. అవి కేవలం 498ఏ కేసుల్లో దాగి ఉన్నాయి.

2021-2023 సంవత్సరాల మధ్య ‘వరకట్న నిషేధ చట్టం, 1961’ కింద న‌మోదైన కేసులు

2021ః తెలంగాణానమోదు చేయబడిన కేసులు = 5

అభియోగపత్రం దాఖలు చేయబడిన కేసులు = 5

నేరం రుజువైన కేసులు = 0

అరెస్టు చేయబడిన వ్యక్తులు = 12

అభియోగపత్రం దాఖలు చేయబడిన వ్యక్తులు = 13

నేరం రుజువైన వ్యక్తులకు = 0


2022ః తెలంగాణానమోదు చేయబడిన కేసులు = 6

అభియోగపత్రం దాఖలు చేయబడిన కేసులు = 5

నేరం రుజువైన కేసులు = 0

అరెస్టు చేయబడిన వ్యక్తులు = 0

అభియోగపత్రం దాఖలు చేయబడిన వ్యక్తులు = 8

నేరం రుజువైన వ్యక్తులకు = 0


2023ః తెలంగాణానమోదు చేయబడిన కేసులు = 4

అభియోగపత్రం దాఖలు చేయబడిన కేసులు = 6

నేరం రుజువైన కేసులు = 0

అరెస్టు చేయబడిన వ్యక్తులు = 0

అభియోగపత్రం దాఖలు చేయబడిన వ్యక్తులు = 10

నేరం రుజువైన వ్యక్తులకు = 0


2021-2023 సంవత్సరాల మధ్య వరకట్న మరణాలు

2021ః తెలంగాణాకింద నమోదైన కేసులు = 175

2022ః తెలంగాణాకింద నమోదైన కేసులు = 137

2023ః తెలంగాణాకింద నమోదైన కేసులు = 145

2019 నుంచి 2023 వరకు ఆంధ్రప్రదేశ్లో 526.. తెలంగాణ రాష్ట్రంలో 776 డెత్ కేసులు నమోదయ్యాయి.

2021తెలంగాణలో కేవలం 5 వరకట్న కేసులు మాత్రమే నమోదయ్యాయి. కానీ 175 డౌరీ మరణాలు జరిగాయి!

2022లో AP vs Telangana shocking dataDowry Act కేసులు:

ఆంధ్రప్రదేశ్: 100

తెలంగాణ: కేవలం 6 అదే సమయంలో Dowry deaths: ఆంధ్రప్రదేశ్: 100 తెలంగాణ: 137అంటే,

కేసులు తక్కువ. కానీ మరణాలు ఎక్కువ! 2023లో పరిస్థితి ఇంకా క్లియర్ తెలంగాణలో కేవలం 4 కేసులుకానీ 145 డౌరీ మరణాలు అంటే నేరాలు జరుగుతున్నాయి. కానీ సరైన చట్టం కింద నమోదు కావడం లేదు.

ఆరు దశాబ్దాల క్రితమే వరకట్నం అనేది చట్టవిరుద్ధం చేసినప్పటికీ దేశంలో ఈ ఆచారం ఎంత బలంగా పాతుకుపోయిందో తాజా ఘటనలు చేస్తున్నాయి.

Read More
Next Story