ఇంగ్లండులో తెలంగాణ మగ్గం నేత లైవ్ షో
x

ఇంగ్లండులో తెలంగాణ మగ్గం నేత లైవ్ షో

లైవ్ గా పోచంపల్లి చీరెలను నేసి ప్రపంచానికి చూపించబోతున్న చందూరు నేతకళాకారుడు చండూరు శ్రీనివాస్


నల్లగొండ జిల్లా చండూరుకి చెందిన చేనేత కళాకారుడు చిలుకూరు శ్రీనివాస్ కు యునైటెడ్ కింగ్‌డమ్ (UK) లోని బర్మింగ్‌హామ్ లో నిర్వహించే స్ప్రింగ్ ఫెయిర్ -2026 (Spring Fair-2026) లో చేనేత విధానంను ప్రదర్శించే అరుదైన అవకాశం పొందారు.

ఇంగ్లండులోని బర్మింగ్ హామ్ (Birmingham) లో 75 సంవత్సరాలుగా యునైటెడ్ కింగ్‌డమ్ (UK) లో నిర్వహిస్తున్న స్ప్రింగ్ ఫెయిర్ అతిపెద్ద రిటైల్ ట్రేడ్ షో. ప్రతి సంవత్సరం నాలుగు రోజుల పాటు నిర్వచించే స్ప్రింగ్ ఫెయిర్ లో వివిధ దేశాలకు 1400 పైగా ప్రదర్శనకారులు పాల్గొంటారు. అలాగే 38,౦౦౦ పైగా సందర్శకులు స్ప్రింగ్ ఫెయిర్ కు వస్తారు. 2026 సంవత్సరంకు గాను స్ప్రింగ్ ఫెయిర్ ను ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు నిర్వహించనున్నారు.

ఇలాంటి ప్రపంచ ప్రాముఖ్యత గల స్ప్రింగ్ ఫెయిర్ కు కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ (Ministry of Textiles) చిలుకూరి శ్రీనివాసు (Chilukuri Srinivas) ను ఎంపిక చేసింది. డబల్ ఇక్కత్, జాంధానీ, కంచి, ట్విక్కట్, కోట, కంచి ఇక్కత్ పట్టు వస్త్రాల తయారీ విధానంను లైవ్ లో ప్రదర్శించనున్నారు. దీనికోసం అతను జనవరి 30న 24 ఇంచుల మగ్గంతో బర్మింగ్‌హామ్ కు బయలుదేరనున్నారు.



చేనేత కుటుంబంకు చెందిన చిలుకూరి నర్సింహా, లక్ష్మమ్మ దంపతులకు శ్రీనివాస్ జన్మిచాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకు ఐదవ తరగతిలోనే చదవుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. దానితో పది సంవత్సరాల వయసులోనే చేనేత వృత్తిని చేపట్టాడు. మొదట చేనేత సహాయక పనులు - ఆసు పోయటం, డైయింగ్ వంటి పనులు నేర్చుకున్నాక. చేనేత కళ నేర్చుకున్నాక 1995 సంవత్సరంలో సొంతంగా మగ్గంను సమకూర్చుకొని నేత పనిని ప్రారంభించాడు.

అతను ఇపుడు మాస్టర్ వీవర్ స్థాకికి ఎదిగి, ప్రస్తుతం 150 చేనేత కళాకారులకు పనికల్పిస్తున్నారు. సరాసరి 600 చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇతను కొత్త డిజైన్స్ తో చీరలను ఉత్పత్తి చేస్తుండటంతో వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. శ్రీనివాస్ కొత్త డిజైన్లు సృష్టించడం,చేనేతలో కొత్త కొత్త ప్రయోగాలు చేయడం లో నేర్పరి. ఆయన నేసిన చీరలు పలు ఫాషన్ షో లను అలంకరించాయి. డిజైన్స్ మాత్రమే కాకుండా చేనేతలో కొత్త వస్త్ర నేత పద్దతులతో ప్రయోగాలు చేనేత చీరెలు తయారు చేసి చండూరు కు జాతీయ గుర్తింపు తీసుకువచ్చారు. పద్మాజలి పట్టుకు చండూరును పుట్టినిల్లుగా అతను మార్చాడు. ఇపుడు చండూరు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటున్నది.

చిలుకూరు శ్రీనివాస్

పద్మాజలి పట్టు, కోట ఉప్పాడ, రాజకోట్ నేత పద్దతులను ఇతని మగ్గంపై రూపొందినవే. ఇక్కత్ చీరలకు అదనపు సొగసులు దిద్ది మార్కెట్ లో మంచి డిమాండ్ తో తన వద్ద పనిచేసే నేత కళాకారులకు అదనపు ఆదాయం కల్పిస్తున్నారు. ఇక్కత్ చీరలకు ఎంబ్రాయిడరీ, ఫ్రెంచ్ నాట్ వర్క్స్ తో వస్త్ర ప్రపంచంలో కొత్త ట్రెండ్ ను సృష్టించాడు. ఇక్కత్, ట్విల్లింగ్ నేత విధానంను కలిపి ట్విక్కట్ చీరలను కూడా రూపొందించాడు. దేశంలోని పేరున్న పైధాని, కంచి వంటి రకరకాల చైనేత శైలులను మేళవించి కొత్త రకాలు రకాలు తయారు చేయడం చండూరు చేనేత కళాకారులగొప్పదం. ఇందులో శ్రీనివాస్ కళ కి జాతీయ గుర్తింపువచ్చింది. ఒక మాటలో చెబితే చండూరును శ్రీనివాస్ చేనేత ప్రయోగాల లాబొరేటరీగా మార్చాడు.ఈ లాబొరేటరీ నుంచి వచ్చిన ఒక సెన్సేషన్ లాల్ పాడ్ సఫేద్ చీరె.

ఆమధ్య లాల్‌పాడ్‌ సఫేద్‌ చీర గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. సాధారణంగా ఇక్కత్‌ కాటన్‌ చీరలు ధరించే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలసీతారామన్ అప్పట్లో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన రోజు లాల్‌పాడ్‌ సఫేద్‌ చీరలో ఆకట్టుకున్నారు. దీనితో లాల్‌పాడ్‌ సఫేద్‌ చీర గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ డిజైన్‌ చీరలు నల్లగొండ జిల్లా చండూరులో తయారవుతున్నాయి. వీటిని తయారు చేసింది చిలుకూరి శ్రీనివాసులే.

శ్రీనివాస్ 35 సంవత్సరాలుగా డబుల్‌ ఇక్కత్‌పై ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో రసాయన రంగులతో డబుల్‌ ఇక్కత్‌ వస్త్రాలు నేసినా, ఇపుడు ఆయన కూడా సహజ సిద్ధమైన రంగులకు మారి మంచి ఆదరణ పొందారు. పలు ఫాషన్ డిజైన్ స్కూల్స్ ల విద్యార్థులు స్టడీ టూర్ లో భాగంగా చండూరులో శ్రీనివాస్ ఇంటిని సందర్శించి చేనేత మెళకువలను అధ్యయనం చేస్తుంటారు.

చేనేత రంగంలో చేస్తున్న కృషికి శ్రీనివాస్ కు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు, కేంద్ర టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ వారి జాతీయ హ్యాండ్లూమ్స్ అవార్డులు శ్రీనివాసును వరించాయి. నేషనల్ హ్యాంలూం డెవలప్మెంట్ ప్రోగ్రాం లో భాగంగా భారత వస్త్ర కళా వైభవమును ప్రపంచాన్ని చాటడానికి నేత విధానంను స్ప్రింగ్ ఫెయిర్-2026 లో ప్రదర్శించటాని శ్రీనివాస్ ను ఎంపిక చేసినట్లు స్టేట్ వీవెర్స్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. తన ప్రయోగాలను అంతర్జాతీయ స్థాయిని తీసుకువెళ్లేందుకు స్పింగ్ ఫెయిర్ -2026 దోహదపడుతుందని శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

“భారతీయ వస్త్ర కళా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడదానికి స్ప్రింగ్ ఫెయిర్ ఒక పెద్ద అవకాశం. దీనితో చండూరుకు అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుంది.దీనితో చండూరు చేనేత ఉత్పత్తులకుడిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది చాలా ఉత్తేజకరమయిన విషయం,” అన్నారు. ఈ అవకాశం కల్పించిన వీవెర్స్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ అరుణ్ కుమార్ కు కృతాజ్ఞతలు తెలిపారు.

ఫాషన్ ప్రపంచంలో మారుతున్న ట్రెండ్స్ కు అనుగుణంగా చేనేత కళాకారులు కొత్త డిజైన్లతో చీరలను నేసినట్లు అయితే వారి ఉత్పత్తులకు మంచి డిమాండ్ తో లాభాలు పొందే అవకాశం ఉంటుందని చెబుతూ తన లైవ్ చేనేత ప్రదర్శన ప్రపంచ వస్త్ర వ్యాపారులను భారత్ వైపు ఆకర్షిస్తుంది అనే ఆశాభావంను శ్రీనివాస్ వ్యక్తం చేసారు.


Read More
Next Story